22.12.16

నువ్వొస్తావని ...... శ్వేత

నువ్వొస్తావని ...... శ్వేత

ఎదలో ఉన్నావని తెలుసు 
ఎదురుగ ఎప్పుడొస్తావాని ఎదురుచూస్తూ 

నిన్నే స్మరిస్తూ 
నీకై నేను జీవిస్తూ 
నన్నే నీకై అర్పిస్తూ 

నిద్రాహారాలని హరిస్తూ 
ఎన్నో నోములు ఆచరిస్తూ
మరెన్నోప్రాంతాలు సంచరిస్తూ 

ఎదో తెస్తావని ఊహిస్తూ 
నీకోసమే ఆలోచిస్తూ 
నువ్వొస్తావనే భ్రమలో జీవిస్తూ కాలం గడిపేస్తున్నా ... 22 Dec 2016

No comments:

Post a Comment