20.1.15

శ్వేత ..... నామావ

మన తెలుగు మన సంస్కృతి గ్రూప్ లో నిర్వహించిన చిత్ర కవిత పోటీలో (70) నా కవితకి ప్రథమ బహుమతి వచ్చింది :)

శ్వేత ..... నామావ

ఎంతమాయకుడో నా మావ
ఎంత బాగుంటడో నామావ
ఎన్నెన్ని మాటలన్నా ఎనకెనకే వస్తఉంటడు
ఎదురేమీ పలుకడసలు

ఎర్రిబాగులోడంటూ ఎకసెక్కెం సేస్త ఉంటే
ఎర్రిమొగమేసుకొని ఒక్క నవ్వు నవ్వుతాడు

ఓర సూపు నే సూస్తే
అరనవ్వు నవ్వుతాడు
అల్లంత దూరం దౌడు తీస్తడు

పూవులిమ్మని నేనడిగితే
పారిజాత మొక్కనే  నాటినాడు
సంతలోన రంగురిబ్బన్లు కొనమంటే
జడగంటలు కొనిచ్చినాడు

మట్టంటకుండా కుర్సోమంటాడు
పట్టుబట్టలు కట్టమంటడు

ముద్దమందారం నేనేట్టుకుంటే
ముద్దుముద్దుగున్నావంటూ
మురిసిమురిసి పోతుంటాడు
కన్నార్పకుండా సూస్తుంటడు

సందె ఏల తెల్లసీర నే కట్టుకుంటే
సన్నజాజులు తెచ్చిపెడతడు
సరిగమలు పాడుతుంటడు ---14-1- 2015
14.1.15

చందమామ అందించే కలువలకి వలువలు - తన వెన్నెలతో

చందమామ అందించే కలువలకి వలువలు - తన వెన్నెలతో @శ్వేత ....15-10-14
శ్వేత ........ తలపుల పిలుపులు

శ్వేత ........ తలపుల పిలుపులు

చాలించు ఇక నీ మూతివిరుపులు
చూపించు నీ నగవులు

కురిపించు నాపై నీ వలపులు
అందించు నీ తీపి తలపులు

దాచుంచు నీ బిగువులు
వినిపిస్తున్నాయి నీ పిలుపులు

మైమరపిస్తున్నాయి నన్ను నీ మేని మెరుపులు
కవ్విస్తున్నాయి నన్ను కసిగా నీ అందాలు ------ 14-1-2015


7.1.15

పెరిగిన ప్రేమ ఒక్కసారైనా తరగదు

పెరిగిన ప్రేమ ఒక్కసారైనా తరగదు
విరిగిన ప్రేమ ఒక్కసారైనా అతకదు @శ్వేత.. 7Jan 14