Showing posts with label శ్వేతవాసుకి భావచిత్రాలు. Show all posts
Showing posts with label శ్వేతవాసుకి భావచిత్రాలు. Show all posts

15.12.16

నా (నేటి)మిత్రులు ........ శ్వేత

నా (నేటి)మిత్రులు ........ శ్వేత

ఎంత వింత మనుషులో నా మిత్రులు
పిలచి పలకరిస్తుంటే
ఛీ, ఫో అని కసురుకుంటారు
ఫోనుచేసి హాయ్ చెబితే
బాయ్ అని కట్ చేస్తారు

అందనంత ఎత్తు ఎదిగి
అందలమెక్కి కూర్చున్నారు
చింతలన్ని చెబుదామంటే
చిటికెడంత సమయమివ్వరు

రోజంతా బోరాయె
పలకరించ మనిషి కరువాయె
మనసుని మబ్బులు వీడవాయె
మనిషి మనుగడ మారదాయె

పలకరింపులు మనిషికి కరువాయె
పులకించే హృదయం ఎక్కడా కానరాదాయె
మనిషికి మనసే బరువాయె
ఆ బరువు తీరే దారి ఎవరికీ తెలియదాయె

మనిషి ఆనందాలన్నీ నిన్నటిలోకి జారిపోయె
అనురాగం, ఆఆప్యాయత నె(నే)టిజనులకు దూరమాయె ......  15 Dec 2016




నాలో కలిగెను మైకం.......శ్వేత

నాలో కలిగెను మైకం.......శ్వేత

ఎన్నడు తీరని దాహం
మునుపెన్నడు కలుగని మోహం
నిను చూసిన ఈ వైనం
నాలో కలిగెను మైకం ... 15 Dec 2016

2.4.14

Meaning Of My Name In FB

పేస్ బుక్ నాపేరుకి ఈవిధంగా అర్థం చెప్పింది. ఇది ఎంతవరకు నిజమో మరి.   


30.3.14

మిత్రులందరికీ శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఒక గంటసేపు కష్టపడి, ఫోటోషాప్ లో .... నేను తయారుచేసిన ఉగాది ఫోటో ఇది.
మిత్రులందరికీ శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.



8.3.14

12.2.14

ప్రేమంటే ఇదేరా !

శ్వేత ........ ప్రేమంటే ఇదేరా !

నాలుగు నయనాల మధ్య పుట్టేది కాదు ప్రేమంటే
ఇద్దరు మనుషుల మధ్య నుండి వచ్చేది కాదు ప్రేమంటే
తొలిచూపు నుండి తుదిశ్వాస వరకు నిలచియుండి
ఇరు హృదయాల నడుమ కలిగే ఏక సవ్వడే ..... నిజమైన ప్రేమంటే.

(ఇది నా అంతరంగ నిర్వచనం మాత్రమే)


30.12.13

గూడు చెదిరిపోయే - జంటవీడిపోయే

గూడు చెదిరిపోయే - జంటవీడిపోయే
కళలు చెరిగిపోయే - కలత వీడదాయే