24.12.16

ఎదలో రేపే అలజడి - నీ సిరిమువ్వల చిరు సవ్వడి

ఎదలో రేపే అలజడి - నీ సిరిమువ్వల చిరు సవ్వడి .... శ్వేత 23 Dec 2016


కన్నుగీటి తంటాలు పడుతున్న తుంటరి కుర్రాళ్ళు - నను జంటగ చేసుకోవాలని

కన్నుగీటి తంటాలు పడుతున్న తుంటరి కుర్రాళ్ళు  - నను జంటగ చేసుకోవాలని .... శ్వేత 24 Dec 2016


123 అని పరుగు పెట్టించా - 143 చెప్పిన వారినందరినీ

123 అని పరుగు పెట్టించా - 143 చెప్పిన వారినందరినీ 😜😝😋⁠⁠⁠⁠ .... శ్వేత 24 Dec 2016


మనసు మయూరమై నాట్యమాడింది - మధుర స్మ్రుతులు మేలుకొలపగానే

మనసు మయూరమై నాట్యమాడింది - మధుర స్మ్రుతులు మేలుకొలపగానే .... శ్వేత 24 Dec 2016


ప్రణయకవితకు నారుపోసి పెంచినవి - నీ కవ్వి०చే కళ్ళే

ప్రణయకవితకు నారుపోసి పెంచినవి - నీ కవ్వి०చే కళ్ళే .... శ్వేత 24 Dec 2016


తనువంతా తడిసి ముద్దియ్యింది - నీ తాపపు చూపుల జల్లులలో

తనువంతా తడిసి ముద్దియ్యింది - నీ తాపపు చూపుల జల్లులలో .... శ్వేత 24 Dec 2016


ఆపవయ్య నీ జోరు ...... శ్వేత

ఆపవయ్య నీ జోరు ...... శ్వేత

ఎందుకంత కంగారు
ఆపవయ్య నీ జోరు

భయపెడితే అవ్వను నేను బేజారు

ఉంచవయ్య అదుపులో నీ నోరు
లేకుంటే అవుతుంది మనమధ్య పెద్ద హోరు
ఆపైన ఏం జరిగినా ఎవరూ ఊరుకోరు  17 Dec 2016కవితల పంటలు

కవితల  పంటలు ... శ్వేత

పండిస్తున్నా కవితల  పంటలని
కలాలనే హలాలుగా చేసుకుంటూ

అక్షరాలతో ఆడుకుంటూ
పదాలతో పాడుకుంటూ

వాక్యాలతో వ్యంగ్యమాడుతూ
భావాలకి కొత్త భాష్యం చెబుతూ
పుస్తకాల పూదోటలో
కవితా కుసుమాలు (శ్వేత సుమాలు) పూయిస్తున్న..... 23 Dec 2016


23.12.16

కవితల పందిరిని కడుతున్నా - అక్షరాలని భావాలతో అల్లుకుంటూ

కవితల పందిరి  కడుతున్నా - అక్షరాలని భావాలతో అల్లుకుంటూ .... శ్వేత 23 Dec 2016


అల్లరి చేస్తున్న అక్షరాలు - భావాలని కవితలలో ఇమడనీకుండా

అల్లరి చేస్తున్న అక్షరాలు - భావాలని కవితలలో ఇమడనీకుండా .... శ్వేత 23 Dec 2016


అక్షర నిధి దాగుంది - కవితా కుక్షిలో

అక్షర నిధి దాగుంది - కవితా కుక్షిలో .... శ్వేత 23 Dec  2016


ఆడుకుంటున్నా - అక్షరాలని. కవితలని, భావాలని బామ్మలుగా వాడుకుంటూ

ఆడుకుంటున్నా - అక్షరాలని. కవితలని, భావాలని  బామ్మలుగా వాడుకుంటూ .... శ్వేత 23 Dec 2016


సాదరంగా ఆహ్వానం పలికింది శయ్య - కలల అలలపై తే(సో)లి పొమ్మని

సాదరంగా ఆహ్వానం పలికింది శయ్య - కలల అలలపై తే(సో)లి పొమ్మని .... శ్వేత 23 Dec 2016


ఊపిరి ఉయ్యాలలూగుతోంది - ప్రాయం పరువాల తోటలో పరుగెడుతుంటే

ఊపిరి ఉయ్యాలలూగుతోంది - ప్రాయం పరువాల తోటలో పరుగెడుతుంటే .... శ్వేత 23 Dec 2016 

                    

నా భావాలకు అక్షరాభ్యాసం చేయిస్తున్నాను - కమ్మని కవితలు రాద్దామని

నా భావాలకు అక్షరాభ్యాసం చేయిస్తున్నాను - కమ్మని కవితలు రాద్దామని .... శ్వేత 23 Dec 2016


ప్రాయం పరుగులు తీస్తుంది - పరువాల పందిట్లో

ప్రాయం పరుగులు తీస్తుంది - పరువాల పందిట్లో .... శ్వేత 23 Dec 2016

అక్షర కోటి లిఖిస్తున్నా - భావాల వరమందుకోవాలని

అక్షర కోటి లిఖిస్తున్నా - భావాల వరమందుకోవాలని .... శ్వేత 23 Dec 2016

కవితల పంటలు పండిస్తున్నా - కలాలనే హలాలుగా చేసి


కవితల పంటలు పండిస్తున్నా - కలాలనే హలాలుగా చేసి .... శ్వేత 23 Dec 2016

22.12.16

నువ్వొస్తావని ...... శ్వేత

నువ్వొస్తావని ...... శ్వేత

ఎదలో ఉన్నావని తెలుసు 
ఎదురుగ ఎప్పుడొస్తావాని ఎదురుచూస్తూ 

నిన్నే స్మరిస్తూ 
నీకై నేను జీవిస్తూ 
నన్నే నీకై అర్పిస్తూ 

నిద్రాహారాలని హరిస్తూ 
ఎన్నో నోములు ఆచరిస్తూ
మరెన్నోప్రాంతాలు సంచరిస్తూ 

ఎదో తెస్తావని ఊహిస్తూ 
నీకోసమే ఆలోచిస్తూ 
నువ్వొస్తావనే భ్రమలో జీవిస్తూ కాలం గడిపేస్తున్నా ... 22 Dec 2016

ధ్యానం అంటే - ఉత్ప్రేరకాలని చూసి ఉత్తేజితం చెందకుండా ఉండటమే

ధ్యానం అంటే - ఉత్ప్రేరకాలని చూసి ఉత్తేజితం చెందకుండా ఉండటమే .... శ్వేత 22 Dec 2016

సంధించు అక్షర భావాలని - మానస కుహరము లో బందీగా ఉన్న కవితలపై

సంధించు అక్షర భావాలని - మానస కుహరము లో బందీగా ఉన్న కవితలపై .... శ్వేత 22 Dec  2016

వెతుకుతున్నా - అక్షరాలఅంబులపొదిలో భావాల విల్లంబులని

వెతుకుతున్నా - అక్షరాల అంబులపొదిలో భావాల విల్లంబులని ... శ్వేత 22 Dec 2016

కమ్మని కలలు ..... శ్వేత

కమ్మని కలలు ..... శ్వేత

మంచుపల్లకి మంచం అంచు చేరగానే
నిదురమ్మ ఎదురొచ్చి ఆహ్వానం పలికింది 
తన వెచ్చని ఒడిలో ఒదిగి పొమ్మని 
కమ్మని కలలు కనమని ..... 22 Dec 2016


20.12.16

రెప్పల దుప్పటి కప్పుకున్నాయి - కళ్ళలోని కమ్మని కలలు ... శ్వేత

రెప్పల దుప్పటి కప్పుకున్నాయి - కళ్ళలోని కమ్మని కలలు ... శ్వేత 20 Dec 2016

అపశృతుల అనుభవాలెన్నో మెదులుతున్నాయి - గతస్మృతుల జ్ఞాపకాలలో

అపశృతుల అనుభవాలెన్నో మెదులుతున్నాయి -  గతస్మృతుల జ్ఞాపకాలలో ... శ్వేత 20 Dec 2016


మనసే కాజేసాడు ....... శ్వేత

మనసే కాజేసాడు ....... శ్వేత

మొన్ననే చూసాడు
మనసే ఇచ్చేసాడు

వరసే కలిపేసాడు
వద్దకు వచ్చేసాడు

కళ్ళుకళ్ళు కలిపేసాడు
కవ్వించి మనసే కాజేసాడు

మాటలతో  మురిపించాడు
నా మనోరథంపై ఒక అందమైన తారలా మెరిసాడు

నిన్ననే ఇంటికి వచ్చాడు
నన్ను మనువాడతానన్నాడు

ఈరోజు ఇంటికి వచ్చాడు
అమ్మ అయ్యను ఒప్పించాడు
మూడుముళ్ళు వేసేసాడు ..... 20 Dec 2016

ఎలా దాచాలి ? - గుప్పెడంత గుండె గూటిలో కొండంత ప్రేమని ... శ్వేత

ఎలా దాచాలి ? - గుప్పెడంత గుండె గూటిలో కొండంత ప్రేమని ... శ్వేత 20 Dec 2016


శ్వేత ...... నేటి నవతరం

శ్వేత ...... నేటి నవతరం

ఝుళిపించు నీ కలం
వినిపించు నీ గళం
తరాల అంతరాలను మార్చుకుంటూ
కులాల కుమ్ములాటను కత్తెరించుకుంటూ

మతిమాలిన మనుషులకి
మితిమీరిన సమాధానమిచ్చుకుంటూ

బంధాలను కలుపుకుంటూ
సంబంధాలను పెంచుకుంటూ
ఆధ్యాత్మికతను పంచుకుంటూ

కోరుకుంటోంది మార్పన్నది ఈతరం
కావాలంటోంది నూతనోత్తేజం నేటి నవతరం .... 20 Dec 2016


17.12.16

శ్వేత ......... పల్లెసీమ అందాలు

శ్వేత ......... పల్లెసీమ అందాలు

ఉదయారుణ సింధూరపు రేఖల మేల్కొలుపులు
బోసినవ్వుల బుజ్జాయిల పులకింతలు

పల్లెటూరి పైరుగాలి పరవళ్ళు
గోదారమ్మ గలగలలు

పల్లెపడుచు పరువాల సందళ్ళు
కన్నెపిల్ల వాల్చూపుల గిలిగింతలు

అచ్చమైన ఆవుపాలు
స్వచ్ఛమైన పిండివంటలు

గోధూళి అందాలు
గడ్డిమోపుల గోదాములు

అనురాగపు బుజ్జగింపులు
ఆప్యాయపు పలకరింపులు

ఎంతందంగా ఉన్నాయో 
పల్లెసీమ అందాలు ప్రకృతి సోయగాలు ..... 17 Dec 2016శ్వేత .......... అక్షౌహిణుల దాడి

శ్వేత .......... అక్షౌహిణుల దాడి

మా ఇంటికొచ్చి మనువాడమని వేధిస్తుంది మీనాక్షి
వీధి చివర కాపుగాసి కన్నుగీటి కవ్విస్తుంది కామాక్షి

బస్టాండులో నాకై వేచి చూస్తుంది విశాలాక్షి
చల్లని సాయంత్రం చేతులూపి పలకరిస్తుంది చారుజాక్షి

పట్టపగలే పదిమందిలో నన్నుచూసి నవ్వి పరువుతీస్తుంది పద్మాక్షి
పెళ్ళి చేసుకోమని పగబట్టి నా వెంట తిరుగుతోంది పంకజాక్షి
నిట్ట నిలువునా నను ముంచడానికి చూస్తోంది నీరజాక్షి........  17 Dec 201616.12.16

అచ్చమైన కవితకి అందం - అక్షరాల అమెరిక, పదాల పొందిక

అచ్చమైన కవితకి అందం - అక్షరాల అమరిక, పదాల పొందిక    ....శ్వేత 16 Dec 2016


15.12.16

స్మృతుల స్వప్నాలు కదలాడుతున్నాయి - అందమైన కృతులు నీవాలపిస్తుంటే

స్మృతుల స్వప్నాలు కదలాడుతున్నాయి - అందమైన కృతులు నీవాలపిస్తుంటే... శ్వేత 15 Dec 2016


రసరమ్య గీతాలాలపిస్తున్నా - వలపు సరాగాలు మేళవించి

రసరమ్య గీతాలాలపిస్తున్నా - వలపు సరాగాలు మేళవించి ... శ్వేత 15 Dec 2016


మనోవేదనని, ఆత్మరోదనని అంతర్మధనం చేస్తే వచ్చేదే - కమ్మని కావ్యం

మనోవేదనని, ఆత్మరోదనని అంతర్మధనం చేస్తే వచ్చేదే - కమ్మని కావ్యం ..... శ్వేత 15 Dec 2016వికశించిన అక్షరాల మోము - ముకుళించిన నీ మోముని స్తుతించగానే

వికశించిన అక్షరాల మోము - ముకుళించిన నీ మోముని స్తుతించగానే ...... శ్వేత 15 Dec 2016


ఎదను కోస్తున్నాయి - యాదొచ్చిన మావ జ్ఞాపకాలు

ఎదను కోస్తున్నాయి - యాదొచ్చిన మావ జ్ఞాపకాలు ..... శ్వేత 15 Dec 2016కవితా లక్షణాలు లోపిస్తున్నాయి - కవితలకి గ్రహణం పట్టి

కవితా లక్షణాలు లోపిస్తున్నాయి - కవితలకి గ్రహణం పట్టి .... శ్వేత 15 Dec 2016


తాకేను తియ్యని బాధ తనువంతా - మురిసేను కమ్మని మైకం మనసంతా

 తాకేను తియ్యని బాధ తనువంతా  - మురిసేను కమ్మని మైకం మనసంతా  ..... శ్వేత 15 Dec 2016

                                     
                                                                    

అచ్చమైన కవితలకందం - అక్షరాల అమెరిక, పదాల పొందిక

అచ్చమైన కవితలకందం  - అక్షరాల అమెరిక, పదాల పొందిక ...... శ్వేత 15 Dec 2016నా (నేటి)మిత్రులు ........ శ్వేత

నా (నేటి)మిత్రులు ........ శ్వేత

ఎంత వింత మనుషులో నా మిత్రులు
పిలచి పలకరిస్తుంటే
ఛీ, ఫో అని కసురుకుంటారు
ఫోనుచేసి హాయ్ చెబితే
బాయ్ అని కట్ చేస్తారు

అందనంత ఎత్తు ఎదిగి
అందలమెక్కి కూర్చున్నారు
చింతలన్ని చెబుదామంటే
చిటికెడంత సమయమివ్వరు

రోజంతా బోరాయె
పలకరించ మనిషి కరువాయె
మనసుని మబ్బులు వీడవాయె
మనిషి మనుగడ మారదాయె

పలకరింపులు మనిషికి కరువాయె
పులకించే హృదయం ఎక్కడా కానరాదాయె
మనిషికి మనసే బరువాయె
ఆ బరువు తీరే దారి ఎవరికీ తెలియదాయె

మనిషి ఆనందాలన్నీ నిన్నటిలోకి జారిపోయె
అనురాగం, ఆఆప్యాయత నె(నే)టిజనులకు దూరమాయె ......  15 Dec 2016
నాలో కలిగెను మైకం.......శ్వేత

నాలో కలిగెను మైకం.......శ్వేత

ఎన్నడు తీరని దాహం
మునుపెన్నడు కలుగని మోహం
నిను చూసిన ఈ వైనం
నాలో కలిగెను మైకం ... 15 Dec 2016

14.12.16

Nanduri Chaitanya's Song .......... Om Namo Bhagavate Vasudevaya

Nanduri Chaitanya's Song
Om Namo Bhagavate Vasudevaya


Nanduri Chaitanya's Song Andarini Premato Palakarinchu

Nanduri Chaitanya's Song
Andarini Premato Palakarinchu

నేను మీకు తెలుసా ? ........ శ్వేత

నేను మీకు తెలుసా ? ........ శ్వేత

నేనెవరో తెలియాలంటే
ప్రశాంతంగా సాంతం చదవండి

భాష రాదు నాకు - అందరినీ పలుకరిస్తా
కళ్ళు లేవు నాకు - అందమైన ప్రకృతిని చూస్తా

చెవులు లేవు నాకు - అందరికీ వినిపిస్తా
నోరు లేదు నాకు - నా మాటనే తూటాలా పేలుస్తా

కాళ్ళు లేవు నాకు - అందరి దగ్గరకు నే వెళతా
చేతులు లేవు నాకు - అందరిచేతా రాయిస్తా

మాట రాదు నాకు - అన్ని భాషలు నే పలికి(కే)స్తా
పాట రాదు నాకు - అందరితో పాడిస్తా
అక్కున చేర్చుకున్న వారిని అందలమెక్కిస్తా

అందరిలో నేనుంటా
అందరిచేతా భావాలొలికిస్తా

ఉరకలువేసే హృదిలో నేనుంటా
మరులుగొలిపే మదిలో నేనుంటా

బావల భావాల్లో నేనుంటా
భామల ఊహల్లో నేనుంటా

అక్షరాల అమరికలో నేనుంటా
పదాల పొందికలో నేనుంటా
కలాల కదలికలో నేనుంటా

ఆకతాయిల ఆలోచనల్లో నేనుంటా
ఆవేశపూరిత అక్షరాల్లో నేనుంటా

ప్రేమికుల హృదయాలలో నేనుంటా
విరాగుల గీతికల్లో నేనుంటా

పండితుల పదాల్లో నేనుంటా
పామరుల గుండెల్లో నేనుంటా

అందరిలో నేనుంటా
అందరినీ స్నేహంగా కలుపుతుంటా

నన్నుచూసి మురుస్తారు కొందరు
నన్నుచూసి ఏడుస్తారు మరికొందరు

ఇంతకీ నేనెవరో తెలిసిందా ?
నేనేనండీ మీ మనోభావాలకి మరో రూపాన్ని
మీ  అందమైన ....... "కవిత"ని  ............ 14 Dec 201611.12.16

శ్వేత .... డీ డిక్కుం

శ్వేత .... డీ డిక్కుం

టీపొడి కొందామని
మేడపైనుండి దిగివచ్చి
గేటు గడియ తీసుకొని

వేడివేడిగా వీచే గాలిలో
వడివడిగా తడబడి అడుగులేస్తూ వెళుతుంటే

గిజిగాడు బీడీ కాల్చుకుంటూ ఎదురొచ్చాడు
బడి వైపు దారిలో పోతుంటే కోడి అడ్డొచ్చింది
పైడిమాంబ గుడివద్ద
బోడిగుండు బాబూరావు పళ్ళికిలించి పలకరించాడు

ఊరి నడిబొడ్డున
నాడి లేని జనాలకి..... ఈరిగాడు
గారడీలెన్నో  చేసి చూపిస్తున్నాడు

ఒడిలో పసిపాపతో వస్తున్న మాఅక్కను చూసి
 డాడీ ఇచ్చిన డబ్బులతో సోంపాపిడి అక్కా - నేను కొనుక్కొని
అమ్మ చెప్పిన టీపొడి తీసుకొని ఇంటికి చేరి

బడిలో చెప్పిన పాఠాలు
చావడిలో కూర్చుని బుద్ధిగ చదువుకుని
మా ఊరి గుడి వద్ద స్నేహితులని
బుడిబుడి అడుగులు వేసే పిల్లలందరినీ తీసుకుపోయి
ఏటి ఒడ్డున అందరం కలసి ఆడుకుంటున్నాము......... 11 Dec 2016ఛందో కవిత

ఛందో కవిత ........శ్వేత

నజభజజజర అంటూ నవ్వకు
సభరనమయవ అంటూ సరసాలాడి
మసజసతతగ అంటూ మత్తెక్కించకు

రసజజభర అంటూ రాగాలు తీసి
భరనభభరవ అంటూ బాధపెట్టకు

సభరసజజగ అంటూ అంటూ సరిగమలు పలికించి
భభభభభభభగ అంటూ భయపెట్టకు

ననమయయ అంటూ నకరాలుపోకు
యమాతరాజభానస అంటూ బుద్దిగా ఛందస్సు నేర్చుకో....11 Dec 2016


ఏ వజ్రమూ పనికిరాదు మదిని విరచ(కోయ)టానికి - ఒక్క మాట తప్ప

ఏ వజ్రమూ పనికిరాదు మదిని విరచ(కోయ)టానికి - ఒక్క నీ మాట తప్ప ..శ్వేత-22 Dec 2016


అద్దానికి అసూయెందుకో - నా అందాన్ని అందంగా చూపటానికి

అద్దానికి అసూయెందుకో - నా అందాన్ని అందంగా చూపటానికి ... శ్వేత 11 Dec 2016


నా తలుపులని తడిపేస్తున్నాయి ----నీ ఊహలు ఝడి వానలా కురిసి

నా తలుపులని తడిపేస్తున్నాయి ----నీ ఊహలు ఝడి వానలా కురిసి ..... శ్వేత 11 Dec 2016