శ్వేత .... డీ డిక్కుం
టీపొడి కొందామని
మేడపైనుండి దిగివచ్చి
గేటు గడియ తీసుకొని
వేడివేడిగా వీచే గాలిలో
వడివడిగా తడబడి అడుగులేస్తూ వెళుతుంటే
గిజిగాడు బీడీ కాల్చుకుంటూ ఎదురొచ్చాడు
బడి వైపు దారిలో పోతుంటే కోడి అడ్డొచ్చింది
పైడిమాంబ గుడివద్ద
బోడిగుండు బాబూరావు పళ్ళికిలించి పలకరించాడు
ఊరి నడిబొడ్డున
నాడి లేని జనాలకి..... ఈరిగాడు
గారడీలెన్నో చేసి చూపిస్తున్నాడు
ఒడిలో పసిపాపతో వస్తున్న మాఅక్కను చూసి
డాడీ ఇచ్చిన డబ్బులతో సోంపాపిడి అక్కా - నేను కొనుక్కొని
అమ్మ చెప్పిన టీపొడి తీసుకొని ఇంటికి చేరి
బడిలో చెప్పిన పాఠాలు
చావడిలో కూర్చుని బుద్ధిగ చదువుకుని
మా ఊరి గుడి వద్ద స్నేహితులని
బుడిబుడి అడుగులు వేసే పిల్లలందరినీ తీసుకుపోయి
ఏటి ఒడ్డున అందరం కలసి ఆడుకుంటున్నాము......... 11 Dec 2016

No comments:
Post a Comment