21.4.15

మెరుగు పెట్టాలి - మరుగున పడుతున్న మన సంప్రదాయాలకి

మెరుగు పెట్టాలి - మరుగున పడుతున్న మన సంప్రదాయాలకి ...... శ్వేత - 21 APR 2015
వ్యాపకం అవసరం - (కొన్ని) జ్ఞాపకాలను మరుగుపరచటానికి

వ్యాపకం అవసరమే - (కొన్ని) జ్ఞాపకాలను మరుగుపరచటానికి ...... శ్వేత - 21 APR 2015


ఒప్పుకోవే నా వినతి

శ్వేత ...... ఒప్పుకోవే నా వినతి

నీవే నా రతివని నే నమ్మితి
అవునో కాదో తెలియజేయు నీ సమ్మతి

చేతులోగ్గి చేస్తున్నా నీకు ప్రణతి
వింటున్నావా నా వినతి

మతిపోయే నీఅందం చూసి అయ్యింది నామనసు కోతి
మితిమీరిన నాప్రేమను చూసి నీవు అనుకోకు అతి

నా మనసుని చేశాను నీకు ఎగుమతి
నీ మనసుని చేయు నాకు దిగుమతి
ఒప్పుకోవే నా వినతి
ఓ నా సుమతి
కుదిరితే మనకు జోడీ పోదాము ఇద్దరం తిరుపతి ....... 21-04-2015


17.4.15

జగమంతా మనది

శ్వేత ..... జగమంతా మనది

నాలో సగమై నీవుగా
నా ప్రాణమే నీవుగా
నీ ఊపిరే నేనుగా

వేణుగానమే మనదిగా
మనమిద్దరం ఆడిపాడాలి
జగమంతా మనదిగా ...... 17-4-2015


13.4.15

నాడు - నేడు (My Family)

నాడు - నేడు ... అమ్మ-నాన్న, చెల్లిళ్ళు & తమ్ముడితో (My Family)


శ్వేత .... బడుగు జీవులు

శ్వేత .... బడుగు జీవులు

చిరిగిన బుట్టలతో
చితికిన బతుకుల్లో
అతుకుల ముతక బట్టల్లో

మితిమీరిన ఆకలిలో కూడా
నీతి తప్పకుండా నడుచుకుంటూ

కతకటానికి మెతుకులేనప్పుడు
చతికిలబడి ఉండలేక
మెతుకు కోసమై వెతుకులాడుకుంటూ

అడుగడుగునా ఏడ్చుకుంటూ
తమ బతుకు బండినీడ్చుకుంటూ
బ్రతుకుతున్నారు నేటి బడుగు జీవులు...... 12-APRIL 2015

నా ఆశలకు శ్వాశనిచ్చేది - నీ తలపులే

నా ఆశలకు శ్వాశనిచ్చేది - నీ తలపులే ..... శ్వేత 12-APR 2015


నడిరేయి నట్టేట ముంచి పోయాడు - నేను నమ్మిన నా నాధుడు

నడిరేయి నట్టేట ముంచి పోయాడు - నేను నమ్మిన నా నాధుడు .... శ్వేత 12 APR 2015


శ్వేత ....... గతి తప్పిన గమ్యం

శ్వేత ....... గతి తప్పిన గమ్యం

శృతి తప్పిన రాగం
కృతి తప్పిన గానం 
యతి తప్పిన పద్యం
మతి తప్పిన వైనం
గతి తప్పి నడుస్తున్న నా జీవన గమ్యం .....12 APR 2015