Showing posts with label My Family. Show all posts
Showing posts with label My Family. Show all posts
13.4.15
10.8.14
16.6.14
Rama.......Father's Day Special Short Film || By Harsha Annavarapu
My Sister's Short Film.....in Telugu One
24.1.14
నూతన వధూవరులకు అక్షరాక్షర శుభాక్షతలు
నూతన వధూవరులకు అక్షరాక్షర శుభాక్షతలు
(అమ్మ - నాన్న పెళ్ళికి వారిని ఆశీర్వదిస్తూ.... నాన్నగారి స్నేహితుడు (కొప్పనాతి అప్పలస్వామిగారు) రాసి అందించిన కవిత)ఓనూత్న వధూవరులారా !
వినూత్న జీవన ప్రాంగణాప్రవేశితులారా !
నవజీవనానందాన్వేషణాశక్తులారా !
అక్షరాక్షర శుభాక్షతలివే ..... ఇవే ..... ఇవే !!!
చంద్రుడూ వెన్నెలల
పూవూ తావిలా
ఎడబాయక మీరెప్పుడు
ఎదలలోన మమతలనూ
మురిపెముగా పెంచుకొనగ
అక్షరాక్షర శుభాక్షతలివే ...... ఇవే ...... ఇవే !!!
మధుర శోభాసమన్వితం జీవితం
వసంత వాటికా తటాక తరీ సౌందర్యశ్రీ
చెంత ... వన్నెల, చిన్నెల హాసవిలాసములదేల
అక్షరాక్షర శుభాక్షతలివే ...... ఇవే ...... ఇవే !!!
ఓ నూత్న వధూవరులారా !
నవోదయం మీకు
మహోదయం మీకు
శుభోదయం మీకు
నూత్న వదూవరులకు అక్షరాక్షర శుభాక్షతలివే ...... ఇవే ...... ఇవే !!!
(By ..... కొపనాతి అప్పలస్వామి .... 14-05-1968.....శ్రీహరిపురం ..... విశాఖపట్నం)
<3 అమ్మ - నాన్న పెళ్ళిఫోటో లేదు .... అందుకే షష్టిపూర్తి ఫోటో పెడుతున్నాను <3
Subscribe to:
Posts (Atom)