31.12.13

Happy New Year

Happy New Year


ఓ నాన్న !

ఓ నాన్న !

ఓ నాన్న !
మీచేతిలో మావేలు లేకున్నా
ఇప్పటికీ మా అడుగులకి ముందడుగు మీదే

మా ఆశయాలకి ఆయువు మీరే
మా కలలకి భరోసా మీరే

మా ప్రతీ విజయంలో మీరున్నారు
మా ప్రతీ ఆనందంలో మీరున్నారు

మాకు మేముగా ఈ ప్రపంచానికి
పరిచయం అయ్యేలా చేసారు

మమ్మల్ని మాకు సరికొత్తగా చూపించారు
చిన్ని చేతులతో పెద్ద సాయం
ఎలా చెయ్యాలో నేర్పించారు

మనకోసం మనం కాకుండా
పదిమంది కోసం బ్రతకడం లోని
సంతోషాన్ని రుచి చూపించారు

ఆశించక అందివ్వటంలోని
గొప్పదనాన్ని నేర్పించారు
విశ్వమంత  ప్రేమకి చిరునామా మీరు

విశాల జగతికి ఆదర్శం మీరు
తరం మారినా తరాలు పాటు
నిలిచిపోయే కీర్తి మీసొంతం
పిల్లలుగా అది మాకు సంతోషం

జన్మదిన శుభాకాంక్షలు నాన్నగారు
(మీ పిల్లలు -----లక్ష్మీ - రమ - వేద - కళ్యాణి)

Nanna 70 th Birthday (I.V.Gopalacharyulu) 28-12-2013

నాన్నగారి 70 వ జన్మదినం సందర్భంగా
తమ్ముడి ఇంటిలో జరిపించిన
శ్రీనివాస కళ్యాణం


30.12.13

గూడు చెదిరిపోయే - జంటవీడిపోయే

గూడు చెదిరిపోయే - జంటవీడిపోయే
కళలు చెరిగిపోయే - కలత వీడదాయే 


29.12.13

Venkanna Udayaastamana Seva ---- Part 9

Venkanna Udayaastamana Seva ---- Part 8

Venkanna Udayaastamana Seva ---- Part 7

Venkanna Udayaastamana Seva ---- Part 6

Venkanna Udayaastamana Seva ---- Part 5

Venkanna Udayaastamana Seva ---- Part 4

Venkanna Udayaastamana Seva ---- Part 3

Venkanna Udayaastamana Seva --- Part 2

Venkanna Udayaastamana Seva-- Part 1

avva nulu vadukuta

తిరుపతిలో నారాయణవనం అనే ఊరిలో నేతకారులు మగ్గంపై బట్టలు నేయుట

14.12.13

ఆరాధించి, ఆస్వాదించటమే తెలుసు నాకు - నీ అపురూప లావణ్యాన్ని

ఆరాధించి, ఆస్వాదించటమే తెలుసు నాకు - నీ అపురూప లావణ్యాన్ని  -- శ్వేత 14-12-13


నా శ్వాస ఆగిపోదూ......నిను తలవకుంటే......

నా శ్వాస ఆగిపోదూ - నిను తలవకుంటే..... శ్వేత --- 14-12-13



తారలన్ని చిన్నబోవా ...... నే నర్తిస్తే

తారలన్ని చిన్నబోవా - నే నర్తిస్తే.....శ్వేత --- 14-12-13



ఎదలో ఏదో సడి - నీ కాలి అందెయిలదా

ఎదలో ఏదో సడి - నీ కాలి అందెయిలదా ..... శ్వేత -- 14-12-13


ప్రేమదీపం వెలగదు - మన మధురస్మృతులు(చమురు) అందించకపొతే

ప్రేమదీపం వెలగదు - మన మధురస్మృతులు(చమురు) అందించకపొతే ...... శ్వేత 14-12-13



22.11.13

కోటి రాగాలు పలుకుతాయి - నా ఎద మీటినంతనే

కోటి రాగాలు పలుకుతాయి - నా ఎద మీటినంతనే .... శ్వేత -- 22-11-13


మది పులకించింది - నీ వేలి కొసలు కాలిని తాకగానే

మది పులకించింది - నీ వేలి కొసలు కాలిని తాకగానే ...శ్వేత 22-11-13

శ్వేత ...... చిలిపి వయసు కోరిక

శ్వేత ...... చిలిపి వయసు కోరిక

జాజులు ఎర్రబడ్డాయి ...... నీవు తలపుకు రాగానే
చెక్కిళ్ళు సిగ్గుపడ్డాయి ...... నీవు ఎదురుపడగానే

ఎద తుళ్ళిపడింది ....... నీ పిలుపు వినగానే
పరువం ఎగసిపడింది ....... నీవు చెంతకు రాగానే

మనసు మారాం చేసింది ......... నిను వీడి రానని
చిలిపి వయసు కోరుతున్నది ....... నీ తోడు కావాలని 22-11-13

ఆనందం

నిన్ను చూసినప్పటి ఆనందం మళ్ళీ నాలో కలుగదు
నా అందాన్ని నేను ఎన్నిసార్లు అద్దంలో చూసుకున్నా ...... శ్వేత ... 22-11-13


15.11.13

చెవిలో చెప్పకు గుసగుసగా _ ఎదుటపడి తెలుపు ఇలా ఊసులుగా

చెవిలో చెప్పకు గుసగుసగా _ ఎదుటపడి తెలుపు ఇలా ఊసులుగా ..... శ్వేత ... 15-11-13




షేర్ చేసుకోవెందుకు నాతో ? - నీలో భావాలని !

షేర్ చేసుకోవెందుకు నాతో ? - నీలో భావాలని !.......శ్వేత ...14-11-13




 

పునీతురాలినయ్యా ! - నీ పాదాలచెంత చోటుదొరికినంతనే

పునీతురాలినయ్యా ! - నీ పాదాలచెంత చోటుదొరికినంతనే ....శ్వేత... 14-11-13



 

14.11.13

రిమూవ్ చేయకు మది నుండి - మన మధురూహలని .

రిమూవ్ చేయకు మది నుండి - మన మధురూహలని .....శ్వేత...14-11-13




 

శ్వేత ..... బుల్లి చెల్లి

శ్వేత ..... బుల్లి చెల్లి 

తడబడు అడుగులు ఎందుకే చెల్లి 
బుడిబుడి అడుగులు వేస్తూ రావే 

చురచుర చూపులు చూడకే బుల్లి 
పకపక నవ్వులు రువ్వగ రావే 

చెడుగుడు ఆటలు ఆడుదామే లిల్లి 
చకచక పరుగులు పెడదాం రావే ...... 14 Nov 2013

తిరిగిరాని బాల్యం ...... శ్వేత

(N.V. రఘువీర్ ప్రతాప్ గారి సంపాదకత్వంలో.....అక్టోబర్ 27 వ తేదిన "అపురూపం" అనే పుస్తకావిష్కరణ జరిగింది. ఆ పుస్తకంలో 200 మంది కవులు వారి బాల్యం గూర్చి రాసారు. అందులో నేను (నండూరి లక్ష్మి) కూడా ఒక కవిత రాసాను. అదే ఈ కవిత)

తిరిగిరాని బాల్యం ...... శ్వేత

తిరిగిరాని బాల్యం - మనకెంతో అమూల్యం
అందరికి ప్రియాతిప్రియం
తలచుకుంటే కలుగుతుంది ఆనందం

చిన్ననాడు కాకెంగిళ్ళు అందరితో పంచుకున్నాం
ఆడ - మగ తేడాలేక అందరితో ఆడుకున్నాం

బంకమన్ను తెచ్చుకుని బొమ్మరిళ్ళు కట్టుకున్నాం
పప్పుబెల్లాలు అందరితో కలసి ఆరగించం

కోతిబావ అని అంటు బావల్ని ఆటపట్టించాం
గిల్లికజ్జాలాడుకుంటు ఆటలెన్నో ఆడుకున్నాం

ఆటలలో ముందున్నాం - అల్లరిలో ముందున్నాం
చదువులలో ముందున్నాం - అణకువలో ముందున్నాం

జ్ఞాపకాలకంటూ లేదు ఎప్పుడూ అంతం
గుర్తుకొచ్చిన నాడు వస్తుంది కన్నీటి వర్షం
ఈ బాల్యం స్మృతులంటే నాకెంతో ఇష్టం ..... 14 Nov 2013


13.11.13

శ్వేత ....చక్కని చుక్క

శ్వేత ....చక్కని చుక్క 

చక్కని చుక్క - దక్కెను లక్కుగ
మక్కువ పెరిగి వచ్చెను పక్కగ

ఎక్కువ - తక్కువలు ఆలోచించక
కిక్కురుమనక ఠక్కున పట్టెను తనచేయి
మనసు ఆనందంతో ఊరేగెను చుక్కలపల్లకిలో నడిరేయి....13 Oct 2013


8.11.13

శ్వేత .....ఆ కళ్ళు .....ఆ......కళ్ళు

శ్వేత .....ఆ కళ్ళు .....ఆ......కళ్ళు 

కొంటె చూపుల కన్నులతో కవ్విస్తూ
కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తూ 

అందమైన కళ్ళతో ఆకర్షిస్తూ
అందరి ఆకళ్ళను పెంచుతున్నాయి ... ఆ ...... కళ్ళు  ........ 08 Oct 2013

1.11.13

29.10.13

श्वेता। …… राधा की विरह वेदना

श्वेता। …… राधा की विरह वेदना

हे मेरे प्रिये !
चन्दन जैसे स्वच्छ मन वाले हो तुम
तू ही दूर करती है मेरी मन की ताप

तू ही मेरी जीवन है
मै ही तेरी संगी हूँ

चांदिनी दिलाती है तेरी यादें
कितिने दिन होगये मैं तेरी आघोष में सोये

मैं इस विरह सह नहीं सकती
बतावो कब तुम यहाँ आती

तुम यहाँ कब आओगे
ये खबर कैसे बताओगे

तुम्हारे बिना मैं कैसे जीऊ
मेरी वेदना आपको कैसे बताऊ
जल्दी आओ.....मुझपे समाजाओ ...... 26 Oct 2012

శ్వేత --- ఎన్నాళ్ళు మనకీ గ్రహపాటు

శ్వేత --- ఎన్నాళ్ళు మనకీ గ్రహపాటు 

బాధలేన్నో ఉన్నాయి మదిమాటున
చెప్పుకోవాలని ఉంది నీతో ఎదమాటున  

మనసుకేందుకో ఈ ఉలికిపాటు
కలవాలని ఉంది నిను అస్తమాటు 

పాడు(కను) దిష్టి తగిలెనేమో ఒకమాటు
కలిగెను మనకీ ఎడబాటు 

ఎక్కడ జరిగెనో పొరపాటు
ఇంకా ఎన్నాళ్ళు మనకీ గ్రహపాటు .... 29 Oct 2013

26.10.13

శ్వేత....... కినుకేలే బాల

శ్వేత....... కినుకేలే బాల

రేణుకా ! ఎందులకా కినుక
పిలచి ప్రేమించినందుకా 

వలచి వగచుట ఆపిక
చిరునగవు చూపింక 

పెట్టకు నను తికమక
చాలించు నీ నటనిక 

దరిచేర దాగుడుమూతలేల
ఓడిచేర రావే బాల ... 26 Oct 2013

కలవరపడతావెందుకు

శ్వేత...... కలవరపడతావెందుకు

ఓసోసి సిన్నమ్మి
చెట్టుచాటునుంటావెందుకు 

నక్కినక్కి చూస్తావెందుకు
బిడియమెందుకు 

రా నాముందుకు 
కలవాలని ఉందా నీకు 

కలవరపడతావెందుకు
వెడదాం పెద్దల వద్దకు
మన కల "వరం" చేద్దాం రా నా చెంతకు ..... 26 Oct 2013

22.10.13

మదికి తాళం వేసా _ నా నుండి నిన్నెవరు దోచుకోకుండా

మదికి తాళం వేసా _ నా నుండి నిన్నెవరు దోచుకోకుండా.. @శ్వేత...22-10-13