14.11.13

తిరిగిరాని బాల్యం ...... శ్వేత

(N.V. రఘువీర్ ప్రతాప్ గారి సంపాదకత్వంలో.....అక్టోబర్ 27 వ తేదిన "అపురూపం" అనే పుస్తకావిష్కరణ జరిగింది. ఆ పుస్తకంలో 200 మంది కవులు వారి బాల్యం గూర్చి రాసారు. అందులో నేను (నండూరి లక్ష్మి) కూడా ఒక కవిత రాసాను. అదే ఈ కవిత)

తిరిగిరాని బాల్యం ...... శ్వేత

తిరిగిరాని బాల్యం - మనకెంతో అమూల్యం
అందరికి ప్రియాతిప్రియం
తలచుకుంటే కలుగుతుంది ఆనందం

చిన్ననాడు కాకెంగిళ్ళు అందరితో పంచుకున్నాం
ఆడ - మగ తేడాలేక అందరితో ఆడుకున్నాం

బంకమన్ను తెచ్చుకుని బొమ్మరిళ్ళు కట్టుకున్నాం
పప్పుబెల్లాలు అందరితో కలసి ఆరగించం

కోతిబావ అని అంటు బావల్ని ఆటపట్టించాం
గిల్లికజ్జాలాడుకుంటు ఆటలెన్నో ఆడుకున్నాం

ఆటలలో ముందున్నాం - అల్లరిలో ముందున్నాం
చదువులలో ముందున్నాం - అణకువలో ముందున్నాం

జ్ఞాపకాలకంటూ లేదు ఎప్పుడూ అంతం
గుర్తుకొచ్చిన నాడు వస్తుంది కన్నీటి వర్షం
ఈ బాల్యం స్మృతులంటే నాకెంతో ఇష్టం ..... 14 Nov 2013

No comments:

Post a Comment