31.12.13

ఓ నాన్న !

ఓ నాన్న !

ఓ నాన్న !
మీచేతిలో మావేలు లేకున్నా
ఇప్పటికీ మా అడుగులకి ముందడుగు మీదే

మా ఆశయాలకి ఆయువు మీరే
మా కలలకి భరోసా మీరే

మా ప్రతీ విజయంలో మీరున్నారు
మా ప్రతీ ఆనందంలో మీరున్నారు

మాకు మేముగా ఈ ప్రపంచానికి
పరిచయం అయ్యేలా చేసారు

మమ్మల్ని మాకు సరికొత్తగా చూపించారు
చిన్ని చేతులతో పెద్ద సాయం
ఎలా చెయ్యాలో నేర్పించారు

మనకోసం మనం కాకుండా
పదిమంది కోసం బ్రతకడం లోని
సంతోషాన్ని రుచి చూపించారు

ఆశించక అందివ్వటంలోని
గొప్పదనాన్ని నేర్పించారు
విశ్వమంత  ప్రేమకి చిరునామా మీరు

విశాల జగతికి ఆదర్శం మీరు
తరం మారినా తరాలు పాటు
నిలిచిపోయే కీర్తి మీసొంతం
పిల్లలుగా అది మాకు సంతోషం

జన్మదిన శుభాకాంక్షలు నాన్నగారు
(మీ పిల్లలు -----లక్ష్మీ - రమ - వేద - కళ్యాణి)

2 comments: