Happy New Year Video 2017
31.12.16
24.12.16
23.12.16
22.12.16
నువ్వొస్తావని ...... శ్వేత
నువ్వొస్తావని ...... శ్వేత
ఎదలో ఉన్నావని తెలుసు
ఎదురుగ ఎప్పుడొస్తావాని ఎదురుచూస్తూ
నిన్నే స్మరిస్తూ
నీకై నేను జీవిస్తూ
నన్నే నీకై అర్పిస్తూ
నిద్రాహారాలని హరిస్తూ
ఎన్నో నోములు ఆచరిస్తూ
మరెన్నోప్రాంతాలు సంచరిస్తూ
ఎదో తెస్తావని ఊహిస్తూ
నీకోసమే ఆలోచిస్తూ
నువ్వొస్తావనే భ్రమలో జీవిస్తూ కాలం గడిపేస్తున్నా ... 22 Dec 2016
21.12.16
20.12.16
మనసే కాజేసాడు ....... శ్వేత
మనసే కాజేసాడు ....... శ్వేత
మొన్ననే చూసాడు
మనసే ఇచ్చేసాడు
వరసే కలిపేసాడు
వద్దకు వచ్చేసాడు
కళ్ళుకళ్ళు కలిపేసాడు
కవ్వించి మనసే కాజేసాడు
మాటలతో మురిపించాడు
నా మనోరథంపై ఒక అందమైన తారలా మెరిసాడు
నిన్ననే ఇంటికి వచ్చాడు
నన్ను మనువాడతానన్నాడు
ఈరోజు ఇంటికి వచ్చాడు
అమ్మ అయ్యను ఒప్పించాడు
మూడుముళ్ళు వేసేసాడు ..... 20 Dec 2016
మొన్ననే చూసాడు
మనసే ఇచ్చేసాడు
వరసే కలిపేసాడు
వద్దకు వచ్చేసాడు
కళ్ళుకళ్ళు కలిపేసాడు
కవ్వించి మనసే కాజేసాడు
మాటలతో మురిపించాడు
నా మనోరథంపై ఒక అందమైన తారలా మెరిసాడు
నిన్ననే ఇంటికి వచ్చాడు
నన్ను మనువాడతానన్నాడు
ఈరోజు ఇంటికి వచ్చాడు
అమ్మ అయ్యను ఒప్పించాడు
మూడుముళ్ళు వేసేసాడు ..... 20 Dec 2016
శ్వేత ...... నేటి నవతరం
శ్వేత ...... నేటి నవతరం
ఝుళిపించు నీ కలం
వినిపించు నీ గళం
తరాల అంతరాలను మార్చుకుంటూ
కులాల కుమ్ములాటను కత్తెరించుకుంటూ
మతిమాలిన మనుషులకి
మితిమీరిన సమాధానమిచ్చుకుంటూ
బంధాలను కలుపుకుంటూ
సంబంధాలను పెంచుకుంటూ
ఆధ్యాత్మికతను పంచుకుంటూ
కోరుకుంటోంది మార్పన్నది ఈతరం
కావాలంటోంది నూతనోత్తేజం నేటి నవతరం .... 20 Dec 2016
ఝుళిపించు నీ కలం
వినిపించు నీ గళం
తరాల అంతరాలను మార్చుకుంటూ
కులాల కుమ్ములాటను కత్తెరించుకుంటూ
మతిమాలిన మనుషులకి
మితిమీరిన సమాధానమిచ్చుకుంటూ
బంధాలను కలుపుకుంటూ
సంబంధాలను పెంచుకుంటూ
ఆధ్యాత్మికతను పంచుకుంటూ
కోరుకుంటోంది మార్పన్నది ఈతరం
కావాలంటోంది నూతనోత్తేజం నేటి నవతరం .... 20 Dec 2016
17.12.16
శ్వేత ......... పల్లెసీమ అందాలు
శ్వేత ......... పల్లెసీమ అందాలు
ఉదయారుణ సింధూరపు రేఖల మేల్కొలుపులు
బోసినవ్వుల బుజ్జాయిల పులకింతలు
పల్లెటూరి పైరుగాలి పరవళ్ళు
గోదారమ్మ గలగలలు
పల్లెపడుచు పరువాల సందళ్ళు
కన్నెపిల్ల వాల్చూపుల గిలిగింతలు
అచ్చమైన ఆవుపాలు
స్వచ్ఛమైన పిండివంటలు
గోధూళి అందాలు
గడ్డిమోపుల గోదాములు
అనురాగపు బుజ్జగింపులు
ఆప్యాయపు పలకరింపులు
ఉదయారుణ సింధూరపు రేఖల మేల్కొలుపులు
బోసినవ్వుల బుజ్జాయిల పులకింతలు
పల్లెటూరి పైరుగాలి పరవళ్ళు
గోదారమ్మ గలగలలు
పల్లెపడుచు పరువాల సందళ్ళు
కన్నెపిల్ల వాల్చూపుల గిలిగింతలు
అచ్చమైన ఆవుపాలు
స్వచ్ఛమైన పిండివంటలు
గోధూళి అందాలు
గడ్డిమోపుల గోదాములు
అనురాగపు బుజ్జగింపులు
ఆప్యాయపు పలకరింపులు
ఎంతందంగా ఉన్నాయో
పల్లెసీమ అందాలు ప్రకృతి సోయగాలు ..... 17 Dec 2016శ్వేత .......... అక్షౌహిణుల దాడి
శ్వేత .......... అక్షౌహిణుల దాడి
మా ఇంటికొచ్చి మనువాడమని వేధిస్తుంది మీనాక్షి
వీధి చివర కాపుగాసి కన్నుగీటి కవ్విస్తుంది కామాక్షి
బస్టాండులో నాకై వేచి చూస్తుంది విశాలాక్షి
చల్లని సాయంత్రం చేతులూపి పలకరిస్తుంది చారుజాక్షి
పట్టపగలే పదిమందిలో నన్నుచూసి నవ్వి పరువుతీస్తుంది పద్మాక్షి
పెళ్ళి చేసుకోమని పగబట్టి నా వెంట తిరుగుతోంది పంకజాక్షి
నిట్ట నిలువునా నను ముంచడానికి చూస్తోంది నీరజాక్షి........ 17 Dec 2016
మా ఇంటికొచ్చి మనువాడమని వేధిస్తుంది మీనాక్షి
వీధి చివర కాపుగాసి కన్నుగీటి కవ్విస్తుంది కామాక్షి
బస్టాండులో నాకై వేచి చూస్తుంది విశాలాక్షి
చల్లని సాయంత్రం చేతులూపి పలకరిస్తుంది చారుజాక్షి
పట్టపగలే పదిమందిలో నన్నుచూసి నవ్వి పరువుతీస్తుంది పద్మాక్షి
పెళ్ళి చేసుకోమని పగబట్టి నా వెంట తిరుగుతోంది పంకజాక్షి
నిట్ట నిలువునా నను ముంచడానికి చూస్తోంది నీరజాక్షి........ 17 Dec 2016
15.12.16
నా (నేటి)మిత్రులు ........ శ్వేత
నా (నేటి)మిత్రులు ........ శ్వేత
ఎంత వింత మనుషులో నా మిత్రులు
పిలచి పలకరిస్తుంటే
ఛీ, ఫో అని కసురుకుంటారు
ఫోనుచేసి హాయ్ చెబితే
బాయ్ అని కట్ చేస్తారు
అందనంత ఎత్తు ఎదిగి
అందలమెక్కి కూర్చున్నారు
చింతలన్ని చెబుదామంటే
చిటికెడంత సమయమివ్వరు
రోజంతా బోరాయె
పలకరించ మనిషి కరువాయె
మనసుని మబ్బులు వీడవాయె
మనిషి మనుగడ మారదాయె
పలకరింపులు మనిషికి కరువాయె
పులకించే హృదయం ఎక్కడా కానరాదాయె
మనిషికి మనసే బరువాయె
ఆ బరువు తీరే దారి ఎవరికీ తెలియదాయె
మనిషి ఆనందాలన్నీ నిన్నటిలోకి జారిపోయె
అనురాగం, ఆఆప్యాయత నె(నే)టిజనులకు దూరమాయె ...... 15 Dec 2016
ఎంత వింత మనుషులో నా మిత్రులు
పిలచి పలకరిస్తుంటే
ఛీ, ఫో అని కసురుకుంటారు
ఫోనుచేసి హాయ్ చెబితే
బాయ్ అని కట్ చేస్తారు
అందనంత ఎత్తు ఎదిగి
అందలమెక్కి కూర్చున్నారు
చింతలన్ని చెబుదామంటే
చిటికెడంత సమయమివ్వరు
రోజంతా బోరాయె
పలకరించ మనిషి కరువాయె
మనసుని మబ్బులు వీడవాయె
మనిషి మనుగడ మారదాయె
పలకరింపులు మనిషికి కరువాయె
పులకించే హృదయం ఎక్కడా కానరాదాయె
మనిషికి మనసే బరువాయె
ఆ బరువు తీరే దారి ఎవరికీ తెలియదాయె
మనిషి ఆనందాలన్నీ నిన్నటిలోకి జారిపోయె
అనురాగం, ఆఆప్యాయత నె(నే)టిజనులకు దూరమాయె ...... 15 Dec 2016
14.12.16
Nanduri Chaitanya's Song .......... Om Namo Bhagavate Vasudevaya
Nanduri Chaitanya's Song
Om Namo Bhagavate Vasudevaya
Om Namo Bhagavate Vasudevaya
Nanduri Chaitanya's Song Andarini Premato Palakarinchu
Nanduri Chaitanya's Song
Andarini Premato Palakarinchu
Andarini Premato Palakarinchu
నేను మీకు తెలుసా ? ........ శ్వేత
నేను మీకు తెలుసా ? ........ శ్వేత
నేనెవరో తెలియాలంటే
ప్రశాంతంగా సాంతం చదవండి
భాష రాదు నాకు - అందరినీ పలుకరిస్తా
కళ్ళు లేవు నాకు - అందమైన ప్రకృతిని చూస్తా
చెవులు లేవు నాకు - అందరికీ వినిపిస్తా
నోరు లేదు నాకు - నా మాటనే తూటాలా పేలుస్తా
కాళ్ళు లేవు నాకు - అందరి దగ్గరకు నే వెళతా
చేతులు లేవు నాకు - అందరిచేతా రాయిస్తా
మాట రాదు నాకు - అన్ని భాషలు నే పలికి(కే)స్తా
పాట రాదు నాకు - అందరితో పాడిస్తా
అక్కున చేర్చుకున్న వారిని అందలమెక్కిస్తా
అందరిలో నేనుంటా
అందరిచేతా భావాలొలికిస్తా
ఉరకలువేసే హృదిలో నేనుంటా
మరులుగొలిపే మదిలో నేనుంటా
బావల భావాల్లో నేనుంటా
భామల ఊహల్లో నేనుంటా
అక్షరాల అమరికలో నేనుంటా
పదాల పొందికలో నేనుంటా
కలాల కదలికలో నేనుంటా
ఆకతాయిల ఆలోచనల్లో నేనుంటా
ఆవేశపూరిత అక్షరాల్లో నేనుంటా
ప్రేమికుల హృదయాలలో నేనుంటా
విరాగుల గీతికల్లో నేనుంటా
పండితుల పదాల్లో నేనుంటా
పామరుల గుండెల్లో నేనుంటా
అందరిలో నేనుంటా
అందరినీ స్నేహంగా కలుపుతుంటా
నన్నుచూసి మురుస్తారు కొందరు
నన్నుచూసి ఏడుస్తారు మరికొందరు
ఇంతకీ నేనెవరో తెలిసిందా ?
నేనేనండీ మీ మనోభావాలకి మరో రూపాన్ని
మీ అందమైన ....... "కవిత"ని ............ 14 Dec 2016
నేనెవరో తెలియాలంటే
ప్రశాంతంగా సాంతం చదవండి
భాష రాదు నాకు - అందరినీ పలుకరిస్తా
కళ్ళు లేవు నాకు - అందమైన ప్రకృతిని చూస్తా
చెవులు లేవు నాకు - అందరికీ వినిపిస్తా
నోరు లేదు నాకు - నా మాటనే తూటాలా పేలుస్తా
కాళ్ళు లేవు నాకు - అందరి దగ్గరకు నే వెళతా
చేతులు లేవు నాకు - అందరిచేతా రాయిస్తా
మాట రాదు నాకు - అన్ని భాషలు నే పలికి(కే)స్తా
పాట రాదు నాకు - అందరితో పాడిస్తా
అక్కున చేర్చుకున్న వారిని అందలమెక్కిస్తా
అందరిలో నేనుంటా
అందరిచేతా భావాలొలికిస్తా
ఉరకలువేసే హృదిలో నేనుంటా
మరులుగొలిపే మదిలో నేనుంటా
బావల భావాల్లో నేనుంటా
భామల ఊహల్లో నేనుంటా
అక్షరాల అమరికలో నేనుంటా
పదాల పొందికలో నేనుంటా
కలాల కదలికలో నేనుంటా
ఆకతాయిల ఆలోచనల్లో నేనుంటా
ఆవేశపూరిత అక్షరాల్లో నేనుంటా
ప్రేమికుల హృదయాలలో నేనుంటా
విరాగుల గీతికల్లో నేనుంటా
పండితుల పదాల్లో నేనుంటా
పామరుల గుండెల్లో నేనుంటా
అందరిలో నేనుంటా
అందరినీ స్నేహంగా కలుపుతుంటా
నన్నుచూసి మురుస్తారు కొందరు
నన్నుచూసి ఏడుస్తారు మరికొందరు
ఇంతకీ నేనెవరో తెలిసిందా ?
నేనేనండీ మీ మనోభావాలకి మరో రూపాన్ని
మీ అందమైన ....... "కవిత"ని ............ 14 Dec 2016
11.12.16
శ్వేత .... డీ డిక్కుం
శ్వేత .... డీ డిక్కుం
టీపొడి కొందామని
మేడపైనుండి దిగివచ్చి
గేటు గడియ తీసుకొని
వేడివేడిగా వీచే గాలిలో
వడివడిగా తడబడి అడుగులేస్తూ వెళుతుంటే
గిజిగాడు బీడీ కాల్చుకుంటూ ఎదురొచ్చాడు
బడి వైపు దారిలో పోతుంటే కోడి అడ్డొచ్చింది
పైడిమాంబ గుడివద్ద
బోడిగుండు బాబూరావు పళ్ళికిలించి పలకరించాడు
ఊరి నడిబొడ్డున
నాడి లేని జనాలకి..... ఈరిగాడు
గారడీలెన్నో చేసి చూపిస్తున్నాడు
ఒడిలో పసిపాపతో వస్తున్న మాఅక్కను చూసి
డాడీ ఇచ్చిన డబ్బులతో సోంపాపిడి అక్కా - నేను కొనుక్కొని
అమ్మ చెప్పిన టీపొడి తీసుకొని ఇంటికి చేరి
బడిలో చెప్పిన పాఠాలు
చావడిలో కూర్చుని బుద్ధిగ చదువుకుని
మా ఊరి గుడి వద్ద స్నేహితులని
బుడిబుడి అడుగులు వేసే పిల్లలందరినీ తీసుకుపోయి
ఏటి ఒడ్డున అందరం కలసి ఆడుకుంటున్నాము......... 11 Dec 2016
టీపొడి కొందామని
మేడపైనుండి దిగివచ్చి
గేటు గడియ తీసుకొని
వేడివేడిగా వీచే గాలిలో
వడివడిగా తడబడి అడుగులేస్తూ వెళుతుంటే
గిజిగాడు బీడీ కాల్చుకుంటూ ఎదురొచ్చాడు
బడి వైపు దారిలో పోతుంటే కోడి అడ్డొచ్చింది
పైడిమాంబ గుడివద్ద
బోడిగుండు బాబూరావు పళ్ళికిలించి పలకరించాడు
ఊరి నడిబొడ్డున
నాడి లేని జనాలకి..... ఈరిగాడు
గారడీలెన్నో చేసి చూపిస్తున్నాడు
ఒడిలో పసిపాపతో వస్తున్న మాఅక్కను చూసి
డాడీ ఇచ్చిన డబ్బులతో సోంపాపిడి అక్కా - నేను కొనుక్కొని
అమ్మ చెప్పిన టీపొడి తీసుకొని ఇంటికి చేరి
బడిలో చెప్పిన పాఠాలు
చావడిలో కూర్చుని బుద్ధిగ చదువుకుని
మా ఊరి గుడి వద్ద స్నేహితులని
బుడిబుడి అడుగులు వేసే పిల్లలందరినీ తీసుకుపోయి
ఏటి ఒడ్డున అందరం కలసి ఆడుకుంటున్నాము......... 11 Dec 2016
Subscribe to:
Posts (Atom)