Smt.Pullabhatla Eswarammagaru ....... శ్రీమతి పుల్లాభట్ల ఈశ్వరమ్మగారు
మన విశాఖ మహాసాగరంలో ప్రతిభ ఉన్నవారు, పైకి రాలేక, ఎందరెందరో మరుగున పడిపోతున్నారు. ఈమె ఈశ్వరమ్మగారు. నాకు మాపిన్నిగారిద్వారా పరిచయమయ్యారు. ఈమె 3 సంవత్సరముల వయసు నుండే సంగీతం పట్ల అభిమానం చూపుతూ, వింటూ, రామాయణ, మహాభారత, భాగవతాలు మొదలైన పురాణగ్రంధాలను బాగా చదువుతూ, అన్నిటినీ ఆకళింపు చేసుకొని, ఆధ్యాత్మిక కీర్తనలు అవలీలగా ఆసువుగా పాడటం, రాయటం మొదలుపెట్టారు. ఆవిధంగా ఎన్నో కీర్తనలు రచించి, స్వరపరచి, ఆలపించారు. ఎన్నో హరికథలు కూడా చెప్పారు. ఈ కీర్తనకి ఆమె చాలా కష్టపడ్డారు. ఆమెకున్న పాండిత్యమంతా రంగరించి రాసి, స్వరపరచి, ఆలపించారు. ఆమె ప్రతిభని, ఆమె కుమార్తె వర్ణించారు. ఈశ్వరమ్మగారి కీర్తనని, ఆమె స్వరంలోనే మీరు స్వయంగా విని ఆనందించండి.
No comments:
Post a Comment