7.2.14

శ్వేత ...... పెళ్ళికళ వచ్చేసిందేబాలా !

శ్వేత ...... పెళ్ళికళ వచ్చేసిందేబాలా !

పట్టుచీరల గరగరలతో
పసిపిల్లల కిలకిలలతో

పడుచుపిల్లల అందాలతో
కుర్రకారు కేరింతలతో

బావ - మరదళ్ళల సరసాలతో
కొత్తల్లుడి అలుకలతో
బావమరిది బుజ్జగింపులతో

మర్యాదల లోపమని వియ్యపురాలి మూతివిరుపులతో
హడావుడిగా పరుగులిడుతు ఆయాసపడు తల్లిదండ్రులతో

ఎన్నాళ్ళకో కలుసుకున్న బంధుమిత్రుల ఆప్యాయతల పలకరింపులతో
పెళ్ళిమంటపానికి  పెళ్ళికళ వచ్చేసిందేబాలా ! ........ 7-2-2014


No comments:

Post a Comment