15.2.14

మా ప్రేమకథ

మా ప్రేమకథ

మా ప్రేమకథలో ఫైటింగులు లేవు, పెద్దల ఆంక్షలు లేవు, అసలు ఏ ఆటంకాలు లేవు. మా ప్రేమకి 50 సంవత్సరాలు. మాప్రేమని నాటింది, చిగురింపచేసింది, పెద్దలేనండి. ఎలాగంటారా ........ నేను పుట్టగానే ఇదిగోరా నీకు పెళ్ళాం పుట్టింది, అని మా పెద్దవాళ్ళే చెప్పారు మాబావకి.... అదిగో అలామొదలయ్యింది మాప్రేమకథ. అలా తొలిచూపు నుండి నేటి వరకు అదే ప్రేమ కొనసాగుతుంది. అందుకే చెప్పాను కదండీ --- తొలిచూపు నుండి తుదిశ్వాస వరకు ఇరు హృదయాల ఏక సవ్వడే నిజమైన ప్రేమ అని.

చిన్నప్పటి నుండి "చేతిలో చెయ్యేసి చెప్పుబావ" అని ..... "ఎన్నెన్నో జన్మలబంధం నీది - నాది" అని ..... "నీవు లేని నేను లేను - నేను లేని నీవు లేవు" అని పాటలు పాడుకుంటుంటే మా పెద్దోళ్ళు చూసి, ఇంక లాభంలేదు, వీళ్ళకి పెళ్ళి చేసెయ్యాలి అని "శ్రీరస్తు - శుభమస్తు ... శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం" అంటూ నాకు 18 సంవత్సరాలకు మూడుముళ్ళు వేయించారు. "ఇంకేం చేస్తాం..... సర్దుకుపోతాం" అంటూ సర్దుకుపొయాము."కాపురం కొత్త కాపురం ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం" అంటూ పెళ్ళయ్యాక పాడుకున్నాము. ఇక నా చదువు అంతా పెళ్ళి అయ్యాక, పిల్లలు ఇద్దరూ పుట్టాక నడిచింది. నాచదువుకి పునాది వేసింది మానాన్నగారు & మాబావ. నాన్నగారికి ఆడపిల్లలని చదివించాలి అని కోరిక. మాబావకి కూడా నేను చదుకోవాలి అని ఆశ. అందుకే వాళ్ళిద్దరి ప్రోత్సాహంతో నేను MA వరకు చదవగలిగాను. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా 'హిందీ నిష్ణాత్' పాసయ్యాను, Human Resource Development(New Delhi) ద్వారా హిందీ డిప్లొమా చేశాను, ఆంధ్రాయూనివర్సిటీ కరస్పాండెన్స్ ద్వారా -- హిందీ MA చేశాను. పెళ్ళయ్యాక చదువు అంటే మాటలా???? నేను చదువుకుంటూ ఉంటే మా అమ్మ - నాన్న, మా బావ - పిల్లలు అందరూ ఎంతో సహకారం అందించారు. ఆ విధంగా పిల్లలతో పాటుగా, నేను కూడా చదువుకుంటూ ఉన్నాను.

ఇప్పుడు పిల్లల చదువులు అయిపోయాయి. ఉద్యోగాల వేటలో ఉన్నారు. బావ ఉద్యోగరీత్యా పై దేశాలకి వెళ్లారు, అందుకే కాలక్షేపం కోసం ఈ ముఖపుస్తాకనికి వచ్చి చేరాను. ఇందులో అందరినీ చూసి, నాకు తోచినట్టుగా ఏవో వాక్యాలు రాసేస్తున్నాను. ఆధ్యాత్మిక విషయాలు --  అమ్మ, నాన్నగారు, తమ్ముడిని అడిగి తెలుసుకుంటున్నాను.నాకు Computer Works అంటే అస్సలు తెలియదు. మా ఇద్దరు పిల్లలు నాకు అన్ని విషయాలు నేర్పించారు. ఈవిధంగా సరదాగా, సంతోషాలతో మా బ్రతుకుబండి సాగుతోంది.

Thankful 2 You &  Love You So Much My Dear "Ravi Bava".

                                        

4 comments:

  1. నిండు నూరేళ్ళూ సౌభాగ్యవతిగా ఉండాలని దీవిస్తూ...దీది

    ReplyDelete