28.2.14

మీరు శివరాత్రి ఎలా జరుపుకున్నారు?

మీరు శివరాత్రి ఎలా జరుపుకున్నారు?

నేనైతే శివరాత్రి రోజు ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి, దేవాలయానికి వెళ్ళి, దర్శనం చేసుకొని, చుట్టుపక్కల ఉన్నవాళ్ళతో కాసేపు దైవసంబంధమైన విషయాలు చర్చించుకుంటాము. తరవాత పెద్దవాళ్ళం అంతా కలసి మావీధిలో ఉన్న పిల్లలని అందరిని ఒకదగ్గరకు చేర్చి, మేము చిన్నప్పుడు ఆడుకున్న రకరకాల ఆటలు నేర్పించి, ఆడిస్తాము. ఇక రాత్రి అయ్యింది అంటే, వీధిలో ఉన్న ఆడవాళ్ళం అందరం ఒక దగ్గర చేరి, ఉప్పులకుప్ప, కుంటాట, పరుగుపందాలు, ఖోఖో, షటిల్, రింగ్ టెన్నిస్,  ఒకటేమిటి..... చిన్నప్పుడు మేం ఏమేమి ఆటలు ఆడేవాళ్ళమో, అవన్నీ ఆడుకుంటాము. ఆ ఆటలు ఆడుకుంటూ ఉంటే, మళ్ళీ మా చిన్నతనం గుర్తుకువస్తుంది. ఆటలు ఆడి - ఆడి అలసిపోయిన తరవాత, ఇంట్లో కూర్చొని ఆటలు ఆడుకుంటాం. అష్టాచెమ్మా, పులి - మేక, వైకుంఠపాళీ, దాడీ ఆట, హౌసీ మొదలైన ఆటలు పిల్ల, పెద్ద, ముసలివాళ్ళు అందరం కలసి తెల్లారేవరకు ఆడుకుంటాం. జన్మకో శివరాత్రి అని అంటారు కదా! అలాగ మాకు ఏడాదికి ఒకసారి ఈ శివరాత్రి ఆనందం. మరి మీరు ఈశివరాత్రి రోజున ఎలా గడుపుతారో చెప్పండి.......

                 

No comments:

Post a Comment