28.2.14
మీరు శివరాత్రి ఎలా జరుపుకున్నారు?
మీరు శివరాత్రి ఎలా జరుపుకున్నారు?
నేనైతే శివరాత్రి రోజు ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి, దేవాలయానికి వెళ్ళి, దర్శనం చేసుకొని, చుట్టుపక్కల ఉన్నవాళ్ళతో కాసేపు దైవసంబంధమైన విషయాలు చర్చించుకుంటాము. తరవాత పెద్దవాళ్ళం అంతా కలసి మావీధిలో ఉన్న పిల్లలని అందరిని ఒకదగ్గరకు చేర్చి, మేము చిన్నప్పుడు ఆడుకున్న రకరకాల ఆటలు నేర్పించి, ఆడిస్తాము. ఇక రాత్రి అయ్యింది అంటే, వీధిలో ఉన్న ఆడవాళ్ళం అందరం ఒక దగ్గర చేరి, ఉప్పులకుప్ప, కుంటాట, పరుగుపందాలు, ఖోఖో, షటిల్, రింగ్ టెన్నిస్, ఒకటేమిటి..... చిన్నప్పుడు మేం ఏమేమి ఆటలు ఆడేవాళ్ళమో, అవన్నీ ఆడుకుంటాము. ఆ ఆటలు ఆడుకుంటూ ఉంటే, మళ్ళీ మా చిన్నతనం గుర్తుకువస్తుంది. ఆటలు ఆడి - ఆడి అలసిపోయిన తరవాత, ఇంట్లో కూర్చొని ఆటలు ఆడుకుంటాం. అష్టాచెమ్మా, పులి - మేక, వైకుంఠపాళీ, దాడీ ఆట, హౌసీ మొదలైన ఆటలు పిల్ల, పెద్ద, ముసలివాళ్ళు అందరం కలసి తెల్లారేవరకు ఆడుకుంటాం. జన్మకో శివరాత్రి అని అంటారు కదా! అలాగ మాకు ఏడాదికి ఒకసారి ఈ శివరాత్రి ఆనందం. మరి మీరు ఈశివరాత్రి రోజున ఎలా గడుపుతారో చెప్పండి.......
27.2.14
Sri Ramanavami In America అమెరికాలో రామ మందిరంలో శ్రీరామనవమి
Sri Ramanavami In America అమెరికాలో రామ మందిరంలో శ్రీరామనవమి
Sudarshana Homam...... మా ఇంట్లో జరిగిన సుదర్శన హోమం
Sudarshana Homam...... మా ఇంట్లో జరిగిన సుదర్శన హోమం
26.2.14
Smt.Pullabhatla Eswarammagaru ....... శ్రీమతి పుల్లాభట్ల ఈశ్వరమ్మగారు
Smt.Pullabhatla Eswarammagaru ....... శ్రీమతి పుల్లాభట్ల ఈశ్వరమ్మగారు
మన విశాఖ మహాసాగరంలో ప్రతిభ ఉన్నవారు, పైకి రాలేక, ఎందరెందరో మరుగున పడిపోతున్నారు. ఈమె ఈశ్వరమ్మగారు. నాకు మాపిన్నిగారిద్వారా పరిచయమయ్యారు. ఈమె 3 సంవత్సరముల వయసు నుండే సంగీతం పట్ల అభిమానం చూపుతూ, వింటూ, రామాయణ, మహాభారత, భాగవతాలు మొదలైన పురాణగ్రంధాలను బాగా చదువుతూ, అన్నిటినీ ఆకళింపు చేసుకొని, ఆధ్యాత్మిక కీర్తనలు అవలీలగా ఆసువుగా పాడటం, రాయటం మొదలుపెట్టారు. ఆవిధంగా ఎన్నో కీర్తనలు రచించి, స్వరపరచి, ఆలపించారు. ఎన్నో హరికథలు కూడా చెప్పారు. ఈ కీర్తనకి ఆమె చాలా కష్టపడ్డారు. ఆమెకున్న పాండిత్యమంతా రంగరించి రాసి, స్వరపరచి, ఆలపించారు. ఆమె ప్రతిభని, ఆమె కుమార్తె వర్ణించారు. ఈశ్వరమ్మగారి కీర్తనని, ఆమె స్వరంలోనే మీరు స్వయంగా విని ఆనందించండి.
21.2.14
విశాఖ ఆణిముత్యాలు
విశాఖ ఆణిముత్యాలు
విశాఖ నగరంలో ఎందరెందరో ఆణిముత్యాలు ఉన్నారు.అందులో కొందరు నా ముఖపుస్తక మిత్రులు కూడా ఉన్నారు. అందరినీ ముఖాముఖి కలుసుకొని మాట్లాడాలని ఈ గుప్పెడంతగుండెలో ఉన్న చిన్ని ఆశ. ఆ ప్రయత్నంలో భాగంగా, నాకు వీలు కుదిరినప్పుడు, నాకు తెలిసినవాళ్ళని వెళ్ళి పలకరిస్తున్నాను. నాకు తెలియనివారిని స్నేహితుల ద్వారా పరిచయం చేసుకుంటున్నాను. వాళ్ళని కలుసుకొని, మాట్లాడి వచ్చేస్తే ఎలాగా ? అందుకే వారిని పలకరించినప్పుడు, వారితో మాట్లాడిన మాటలను వీడియోలో బంధిస్తున్నాను. ఆ వీడియోలన్నీ త్వరలోనే మీముందుకు తీసుకువస్తాను.

18.2.14
Squirrel .... ఉడుత ఆటలు
మాఇంట్లో అటకమీద ఒక ఉడుత రెండు పిల్లలని పెట్టింది. అవి కొంచెం పెద్దయ్యాక అటకమీద నుండి చూస్తూ కిందకి పడిపోయాయి. ఇంకేముంది వంటింట్లో ఒకటే అల్లరి - అల్లరి. ఇల్లు పీకి పందిరి వేస్తున్నాయి. వాటికి ప్రతీరోజూ ఫోటోనో, వీడియోనో తీద్దామని ప్రయత్నిస్తున్నా. ఈరోజు, ఇప్పుడే నా కెమెరాకి ఒక బుల్లి ఉడుత చేసిన అల్లరి చిక్కింది. వెంటనే వీడియో తీసీసాను.
15.2.14
మా ప్రేమకథ
మా ప్రేమకథ
మా ప్రేమకథలో ఫైటింగులు లేవు, పెద్దల ఆంక్షలు లేవు, అసలు ఏ ఆటంకాలు లేవు. మా ప్రేమకి 50 సంవత్సరాలు. మాప్రేమని నాటింది, చిగురింపచేసింది, పెద్దలేనండి. ఎలాగంటారా ........ నేను పుట్టగానే ఇదిగోరా నీకు పెళ్ళాం పుట్టింది, అని మా పెద్దవాళ్ళే చెప్పారు మాబావకి.... అదిగో అలామొదలయ్యింది మాప్రేమకథ. అలా తొలిచూపు నుండి నేటి వరకు అదే ప్రేమ కొనసాగుతుంది. అందుకే చెప్పాను కదండీ --- తొలిచూపు నుండి తుదిశ్వాస వరకు ఇరు హృదయాల ఏక సవ్వడే నిజమైన ప్రేమ అని.
చిన్నప్పటి నుండి "చేతిలో చెయ్యేసి చెప్పుబావ" అని ..... "ఎన్నెన్నో జన్మలబంధం నీది - నాది" అని ..... "నీవు లేని నేను లేను - నేను లేని నీవు లేవు" అని పాటలు పాడుకుంటుంటే మా పెద్దోళ్ళు చూసి, ఇంక లాభంలేదు, వీళ్ళకి పెళ్ళి చేసెయ్యాలి అని "శ్రీరస్తు - శుభమస్తు ... శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం" అంటూ నాకు 18 సంవత్సరాలకు మూడుముళ్ళు వేయించారు. "ఇంకేం చేస్తాం..... సర్దుకుపోతాం" అంటూ సర్దుకుపొయాము."కాపురం కొత్త కాపురం ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం" అంటూ పెళ్ళయ్యాక పాడుకున్నాము. ఇక నా చదువు అంతా పెళ్ళి అయ్యాక, పిల్లలు ఇద్దరూ పుట్టాక నడిచింది. నాచదువుకి పునాది వేసింది మానాన్నగారు & మాబావ. నాన్నగారికి ఆడపిల్లలని చదివించాలి అని కోరిక. మాబావకి కూడా నేను చదుకోవాలి అని ఆశ. అందుకే వాళ్ళిద్దరి ప్రోత్సాహంతో నేను MA వరకు చదవగలిగాను. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా 'హిందీ నిష్ణాత్' పాసయ్యాను, Human Resource Development(New Delhi) ద్వారా హిందీ డిప్లొమా చేశాను, ఆంధ్రాయూనివర్సిటీ కరస్పాండెన్స్ ద్వారా -- హిందీ MA చేశాను. పెళ్ళయ్యాక చదువు అంటే మాటలా???? నేను చదువుకుంటూ ఉంటే మా అమ్మ - నాన్న, మా బావ - పిల్లలు అందరూ ఎంతో సహకారం అందించారు. ఆ విధంగా పిల్లలతో పాటుగా, నేను కూడా చదువుకుంటూ ఉన్నాను.
ఇప్పుడు పిల్లల చదువులు అయిపోయాయి. ఉద్యోగాల వేటలో ఉన్నారు. బావ ఉద్యోగరీత్యా పై దేశాలకి వెళ్లారు, అందుకే కాలక్షేపం కోసం ఈ ముఖపుస్తాకనికి వచ్చి చేరాను. ఇందులో అందరినీ చూసి, నాకు తోచినట్టుగా ఏవో వాక్యాలు రాసేస్తున్నాను. ఆధ్యాత్మిక విషయాలు -- అమ్మ, నాన్నగారు, తమ్ముడిని అడిగి తెలుసుకుంటున్నాను.నాకు Computer Works అంటే అస్సలు తెలియదు. మా ఇద్దరు పిల్లలు నాకు అన్ని విషయాలు నేర్పించారు. ఈవిధంగా సరదాగా, సంతోషాలతో మా బ్రతుకుబండి సాగుతోంది.
Thankful 2 You & Love You So Much My Dear "Ravi Bava".
14.2.14
10.2.14
ManasantaNuvve Book Release- My Brother Rvss Srinivas
ManasantaNuvve Book Release- My Brother Rvss Srinivas
Sree Vishnusahasra Nama Stotram ......... శ్రీ విష్ణుసహస్ర నామస్తోత్రం
Sree Vishnusahasra Nama Stotram ......... శ్రీ విష్ణుసహస్ర నామస్తోత్రం
8.2.14
7.2.14
Raghava Kumar.....Upanayanam (My Elder Son's Upanayanam .... Part -2)
మా పెద్దబ్బాయి ఉపనయనం వీడియో Part -2
శ్వేత ...... పెళ్ళికళ వచ్చేసిందేబాలా !
శ్వేత ...... పెళ్ళికళ వచ్చేసిందేబాలా !
పట్టుచీరల గరగరలతో
పసిపిల్లల కిలకిలలతో
పడుచుపిల్లల అందాలతో
కుర్రకారు కేరింతలతో
బావ - మరదళ్ళల సరసాలతో
కొత్తల్లుడి అలుకలతో
బావమరిది బుజ్జగింపులతో
మర్యాదల లోపమని వియ్యపురాలి మూతివిరుపులతో
హడావుడిగా పరుగులిడుతు ఆయాసపడు తల్లిదండ్రులతో
ఎన్నాళ్ళకో కలుసుకున్న బంధుమిత్రుల ఆప్యాయతల పలకరింపులతో
పెళ్ళిమంటపానికి పెళ్ళికళ వచ్చేసిందేబాలా ! ........ 7-2-2014

Raghava Kumar.....Upanayanam (My Elder Son's Upanayanam .... Part -1)
మా పెద్దబ్బాయి ఉపనయనం వీడియో Part -1
6.2.14
3.2.14
Vinayaka Nee Murthy ke Na Modati Pranam... వినాయక నీమూర్తికే నా మొదటి ప్రణామం
Vinayaka Nee Murthy ke Na Modati Pranam... వినాయక నీమూర్తికే నా మొదటి ప్రణామం
Subscribe to:
Posts (Atom)