శ్వేత........గోరింటాకుల పంట
పండెను ఈ రోజు మా ఇంట
గోరింటాకుల పంట
రారమ్మ చెలులారా
అట్లతద్ది ఆరట్లు అనుచు
నోచేదము మనము నోములపంట
ఊయలలూగెదం మనసారా
శ్రీను శివ కట్టిరి ఊయల
మనమంతా ఆడెదం ఈ వేళ
పిలువవే వల్లీ చెల్లి మన సఖులను
ఓ మమత ! నుమిత ! అమృత !
స్వర్ణ ! సుకన్య ! సరోజ !
రారండమ్మ ఆడేదము మనమంతా ఈ వేళ
No comments:
Post a Comment