19.10.13

నన్నెందుకు (ఎ)మార్చేవు

శ్వేత.....నన్నెందుకు (ఎ)మార్చేవు

ఈ ఉషోదయాన్న
ఆ తుషార వీచికల్లో

నీ నిషా కన్నులతో
మిష నాకు చూపి

కాషాయరంగు చీరతో
వేషాన్ని మించిన వన్నెతో

త్రిషలా, ప్రత్యూషలా, సింధూషలా,
ఒక్కోమారు ఒక్కోలా కనిపించి,

నిషాలో నన్ను ముంచి
హమేషా తమాషా చూపించి

ఈ విశాల ప్రపంచంలో
నా హుషారైన జీవితంలో
అశాంతిని నింపి
విషాదాన్ని మిగిల్చావు......19 Oct 2013

No comments:

Post a Comment