చీరలని
డ్రై వాష్ మరియు
పెట్రో వాష్ చేయటం ఎలాగ ?? ...... అనే అంశాలను మనం తెలుసుకుందాం.
(1) డ్రై వాష్
కావలసిన మెటీరియల్
సోప్ ఆయిల్
వైట్ పెట్రోల్
వెనిగర్
సెంట్
రాళ్ళ ఉప్పు (కల్లుప్పు)
చీరని ఉతికే విధానం:--
ఒక చీరని ఉతుకుటకు ..... 2 లీటర్ల నీరు + 2 స్పూన్స్ సోప్ ఆయిల్ + 2 స్పూన్స్ పెట్రో ఆయిల్ + 2 స్పూన్స్ సర్ఫ్ వేసి బాగా కలపాలి. చీరని ఫాల్ ఉన్నవైపు కుచ్చిళ్ళు పెట్టి, ఫాలు వైపు భాగం మన చేతిలో ఉంచుకొని, చీరని నీటిలో చాలా ఫోర్సుగా 3 సార్లు ముంచి తీయాలి. తరవాత చీర ఫాలుని కూడా ముంచి తీయాలి. ఇప్పుడు చీరని జాడించటానికి ఒక బకెట్లో సగానికి నీరు తీసుకొని, ఆ నీటిలో రాళ్ళ ఉప్పు (కల్లుప్పు ) వేసి రెండుసార్లు జాడించుకోవాలి . మూడోసారి జాడించేటప్పుడు 2స్పూన్స్ వెనిగర్ + 1డ్రాప్ సెంట్ (any flavour sent) వేసి జాడించి చీరని పిండకుండా ఒక మెత్తటి తువ్వాలులో చుట్టి ఉంచాలి. నీరు అంతా పోయిన తరవాత ఎండ తగలని ప్రదేశంలో ఆరబెట్టాలి.
చీర ఒకరంగు, బోర్డర్ వేరే రంగు ఉన్న చీరలని, లైట్ కలర్ రంగుని ముందుగా సర్ఫ్ లో ముంచి తీసాక ... ముదురు రంగు భాగాన్ని సర్ఫ్ లో ముంచుకోవాలి.
(2) పెట్రో వాష్
కావలసిన మెటీరియల్
వైట్ పెట్రోల్ (1 లీటరు సుమారుగా Rs 90/ ఉండవచ్చును )
నీరు
ఈ పెట్రో వాష్ ..... ఎక్కువ ఖరీదైన చీరలు, వర్క్ శారీస్ .... మరియు పట్టుచీరలు & పట్టు పంచెలు ఉతుకుటకు ఉపయోగించాలి.
ఒక చీరని ఉతుకుటకు రెండు లీటర్ల నీరు + ఒక లీటరు వైట్ పెట్రోలు ఒక బకెట్ లో వేసి బాగా కలిపి, చీరని చాలా ఫోర్సు గా 3 సార్లు నీటిలో ముంచి తీయాలి.... వైట్ పెట్రోల్ కెమికల్ కాబట్టి చీరని ఎక్కువ సేపు నీటిలో ఉండనివ్వకూడదు. చీర పాడయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఈ చీరని నీటిలో జాడించవలసిన పనిలేదు.
వన్నె తగ్గిన చీరలని ఈ పెట్రో వాష్ లో ఉతికితే.... మళ్ళీ సరికొత్త చీరలాగ కనిపిస్తుంది. జరీ అంచులు మెరుస్తూ కనిపిస్తాయి. వర్క్ చీరలకి ఉండే కుందన్స్ , పూసలు వంటివి ఊడిపొకుండా, పాడవకుండా ఉంటాయి.