29.10.15

శ్వేత ....... మనసా ఎక్కడున్నావు

శ్వేత ....... మనసా ఎక్కడున్నావు

అల్లరి మాటలతో మనసుకి మత్తెక్కించి
చల్లగ సరసాలాడుతూ
మెల్లగ ఎదనే గిల్లి 

బిందువంత ప్రేమ జూపి
సింధువులా మనసునాక్రమించి 

మాటలతో మదిలో తుఫాను రేపి
మనసు విరిచి పారేసింది

నాదారిన పోతున్న నన్ను
పిలచి, మురించి, వలచిన చిన్నది

మనసిమ్మని అడిగి, ముక్కలు చేసి విసిరేసింది
అలసట తెలియని ఓ మనసా
నను మరవకుమా, దరికి చేరుమా
ఎక్కడున్నావమ్మా ఓ నామనసా ! 29 Oct 2015


No comments:

Post a Comment