29.10.15

శ్వేత ...... బాసలన్నీ మాయమాయే

శ్వేత ...... బాసలన్నీ మాయమాయే

ఊసులన్ని నిజమేనని బాసచేసితివానాడు
మదిమాటున బాసలన్నీ మసకబారెను  నేడు
నీతోటి నడకలన్నీ నీటిమీద రాతలాయే చూడు
విసిగి వేసారిన జీవితం  అంతమొనర్చ, విసిరేసాడు దేహాన్ని సాగరుడు  .... శ్వేత 11 July 2015


America Photos

America Photos







శ్వేత ..... చుక్క నీటి కోసం

శ్వేత ..... చుక్క నీటి కోసం

అన్నార్తులను ఆదుకునే అన్నదాత
ఆకలితో అలమటిస్తున్నాడు 
దిక్కులు పిక్కటిల్లేలా గద్దిస్తున్నాడు 

గర్జించటం తెలిసిన ఓ మేఘమా వర్షించవా అని 
చుక్క నీరు నోచుకోని
బక్కచిక్కిన దేహంతో
బ్రతికున్నదేందుకో తెలియక 

భగవంతుడిని నిందిస్తూ
భారంగా బ్రతుకీడుస్తూ 
భూమికి భారంగా నేనెందుకు బ్రతికున్నానా అని రోదిస్తూ...... 29 Oct 2015


శ్వేత ....... మనసా ఎక్కడున్నావు

శ్వేత ....... మనసా ఎక్కడున్నావు

అల్లరి మాటలతో మనసుకి మత్తెక్కించి
చల్లగ సరసాలాడుతూ
మెల్లగ ఎదనే గిల్లి 

బిందువంత ప్రేమ జూపి
సింధువులా మనసునాక్రమించి 

మాటలతో మదిలో తుఫాను రేపి
మనసు విరిచి పారేసింది

నాదారిన పోతున్న నన్ను
పిలచి, మురించి, వలచిన చిన్నది

మనసిమ్మని అడిగి, ముక్కలు చేసి విసిరేసింది
అలసట తెలియని ఓ మనసా
నను మరవకుమా, దరికి చేరుమా
ఎక్కడున్నావమ్మా ఓ నామనసా ! 29 Oct 2015


నీ అల్లరి చూపుల్ని దాచలేను - నా ఆశల దోసిళ్ళలో

నీ అల్లరి చూపుల్ని దాచలేను - నా ఆశల దోసిళ్ళలో ..... శ్వేత 29 Oct 2015



శ్వేత ....... ఒంటరి పక్షి

శ్వేత ....... ఒంటరి పక్షి

కాయం గాయమై, హృదయం ముక్కలై
నిన్నటి కబురులే నేటి జ్ఞాపకాలై

మిగిల్చిపోయావు తీయని గురుతులు నాకై
జీవిస్తున్నాను నేను విగతజీవినై
ఒంటరి పక్షినై ..... 29 Oct 2015


శ్వేత ........ దూరమన్నది లేదుగా - మన ఎద మాటున

శ్వేత ........ దూరమన్నది లేదుగా - మన ఎద మాటున

కరిగిపోని కలలెన్నో - కనురెప్పల దుప్పటి మాటున
కలత వీడని కనులెన్నో - ప్రతి హృది మాటున

నలతెరుగని హృది ఉందా - ఈ పృధివి(విశ్వం) మాటున
కల్మషమన్నది లేదుగా - పసిహృదయం మాటున

మోసమన్నది తెలియదుగా - మన ప్రేమ చాటున
దూరమన్నది లేదుగా - మన ఎద మాటున ..... 29 Oct 2015


కనురెప్పల దుప్పటి కప్పుతున్నా - కలలు కరిగిపోకుండా

కనురెప్పల దుప్పటి కప్పుతున్నా - కలలు కరిగిపోకుండా ..... శ్వేత 29 Oct 2015


నీ రూపాన్నేప్పుడూ బంధిస్తూనే(కౌగిలిస్తూనే) ఉంటాను - కనురెప్పల కౌగిళ్ళలో

నీ రూపాన్నేప్పుడూ బంధిస్తూనే(కౌగిలిస్తూనే) ఉంటాను - కనురెప్పల కౌగిళ్ళలో ..........శ్వేత 29 Oct 2015


ప్రతిరేయి మదికి తప్పని తిప్పలు - మూతపడని కనురెప్పల నొప్పులతో

ప్రతిరేయి మదికి తప్పని తిప్పలు - మూతపడని కనురెప్పల నొప్పులతో ..........శ్వేత 29 Oct 2015


కనుపాప సిగ్గుపడింది - కనురెప్పల కౌగిలింతకి

కనుపాప సిగ్గుపడింది - కనురెప్పల కౌగిలింతకి ...........శ్వేత 29 Oct 2015 


28.10.15

ఓడిపోయి ఒంటరిగా మిగిలిన హృదయం - బ్రతుకుపోరాటంలో

ఓడిపోయి ఒంటరిగా మిగిలిన హృదయం - బ్రతుకుపోరాటంలో ..........శ్వేత 28 Oct 2015


జలతరంగిణి అనుకున్నా - నీ నవ్వుల సవ్వడి విని

జలతరంగిణి అనుకున్నా - నీ నవ్వుల సవ్వడి విని ..........శ్వేత 28 Oct 2015 


నాలో విరిసాయి సప్తవర్ణాలు -నీ శ్వేతవర్ణపు చూపుకి

నాలో విరిసాయి సప్తవర్ణాలు -నీ శ్వేతవర్ణపు చూపుకి ..........శ్వేత 28 Oct 2015 


కుముదాలన్నీ సిగ్గిల్లి తలలు వాల్చాయి - కోనేట్లో నీ అభ్యంగన స్నానానికే

కుముదాలన్నీ సిగ్గిల్లి తలలు వాల్చాయి - కోనేట్లో నీ అభ్యంగన స్నానానికే ..........శ్వేత 28 Oct 2015


మూగమనసు ఆలపించేది - మౌనగీతాలే

మూగమనసు ఆలపించేది - మౌనగీతాలే ..........శ్వేత 28 Oct 2015 


విరులకు వసంతం వచ్చేది - మల్లెలు జడనలంకరించినపుడే

విరులకు వసంతం వచ్చేది - మల్లెలు జడనలంకరించినపుడే ..........శ్వేత 28 Oct 2015 


శోధనల అధ్యాయాలెన్నో - వేదనల పర్వంలో

శోధనల అధ్యాయాలెన్నో -  వేదనల పర్వంలో..........శ్వేత 28 Oct 2015 


భార్యాభర్తలిరువురూ భిన్న ధృవాలే - ఆకర్షించుకుంటూనే వికర్షిస్తుంటారు

భార్యాభర్తలిరువురూ భిన్న ధృవాలే - ఆకర్షించుకుంటూనే వికర్షిస్తుంటారు...............శ్వేత 28 Oct 2015 


24.10.15

తిరుగుబాటు చేస్తున్న కవితలు - అక్షరాలనే ఆయుధాలుగా చేసుకొని

తిరుగుబాటు చేస్తున్న కవితలు - అక్షరాలనే ఆయుధాలుగా చేసుకొని ...... శ్వేత 24 Oct 2015


22.10.15

శృతిచేసి చూడు నా మదిని - పలుకుతుంది నీ నామమే

శృతిచేసి చూడు నా మదిని - పలుకుతుంది నీ నామమే ....... శ్వేత .......22 Oct 2015


18.10.15

అక్షర దీపికనై వెలిగిపోనా - విద్యార్థులకు మార్గం చూపుతూ

అక్షర దీపికనై వెలిగిపోనా - విద్యార్థులకు మార్గం చూపుతూ ...........శ్వేత 18 Oct 2015


పులకించిపోయిన మనసు - పరువాల పలకరింపుకే

పులకించిపోయిన  మనసు - పరువాల పలకరింపుకే ...........శ్వేత 18 Oct 2015


వలపు కావ్యం అలంకరిస్తున్నా - తలపు(జ్ఞాపకాల) అక్షరాలద్దుతూ

వలపు కావ్యం అలంకరిస్తున్నా - తలపు(జ్ఞాపకాల) అక్షరాలద్దుతూ ...........శ్వేత 18 Oct 2015


కళ్ళు కిటికీలు తెరిచాయి - వలపు వాకిళ్ళలో నీవు కనిపించగానే

కళ్ళు కిటికీలు తెరిచాయి - వలపు వాకిళ్ళలో నీవు కనిపించగానే ...........శ్వేత 18 Oct 2015


అభిమానపు సిరాతో లిఖిస్తున్నా - మన స్నేహ కావ్యాలని

అభిమానపు సిరాతో లిఖిస్తున్నా - మన స్నేహ కావ్యాలని ...........శ్వేత 18 Oct 2015


అద్దానికే కన్నుకుట్టింది - నీ నవయవ్వనాన్ని చూసి

అద్దానికే కన్నుకుట్టింది - నీ నవయవ్వన సోయగాలని చూసి ...........శ్వేత 18 Oct 2015


ఏరుకొని భద్రపరుస్తున్న రాధమ్మ - రాలిపడుతున్న కృష్ణయ్య జ్ఞాపకాలని

ఏరుకొని  భద్రపరుస్తున్న రాధమ్మ - రాలిపడుతున్న కృష్ణయ్య జ్ఞాపకాలని ...........శ్వేత 18 Oct 2015


తలపుల గ్రంథాలెన్నో రాస్తున్నా - వలపు సిరాతో

తలపుల గ్రంథాలెన్నో రాస్తున్నా - వలపు సిరాతో ...........శ్వేత 18 Oct 2015


నిత్యం నృత్యం చేస్తుంది మనోవిహంగం - ప్రతి స్వప్నం సత్యమైతే ......శ్వేత

నిత్యం నృత్యం చేస్తుంది మనోవిహంగం - ప్రతి స్వప్నం సత్యమైతే ......శ్వేత 18 Oct 2015


మదిమంటలు చల్లారేది - హృదయపు లోగిలిలో, చెలి కౌగిలిలో చేరినపుడే

మదిమంటలు చల్లారేది - హృదయపు లోగిలిలో, చెలి కౌగిలిలో చేరినపుడే ...........శ్వేత 18 Oct 2015


సెలయేరులై పారుతున్నాయి - అల్లరి ఆలోచనలు

సెలయేరులై పారుతున్నాయి -  అల్లరి ఆలోచనలు ...........శ్వేత 18 Oct 2015


కనోదోయి కుటీరంలో కడదాకా తోడుంటా - కనుపాపలో నీవు కాపురముంటే

కనోదోయి కుటీరంలో కడదాకా తోడుంటా - కనుపాపలో నీవు కాపురముంటే ...........శ్వేత 18 Oct 2015


మదిలో ఆరని జ్వాలలు రేపకు - అందమైన వయసు వల విసిరి

మదిలో ఆరని జ్వాలలు రేపకు - అందమైన వయసు వల విసిరి ...........శ్వేత 18 Oct 2015


తలపులు ఏరులై పారుతున్నాయి - జ్ఞాపకాలు కనుమరుగైపోతుంటే

తలపులు ఏరులై పారుతున్నాయి - జ్ఞాపకాలు కనుమరుగైపోతుంటే ...........శ్వేత 18 Oct 2015


విధించావు మరణశిక్ష - మనసు భిక్షగా కోరితే

విధించావు మరణశిక్ష - మనసు భిక్షగా కోరితే ...........శ్వేత 18 Oct 2015


విచ్చుకున్న హృదయ కమలాలు - నీ వేణుగానం వినినంతనే

విచ్చుకున్న హృదయ కమలాలు - నీ వేణుగానం వినినంతనే ...........శ్వేత 18 Oct 2015


కలలు కరిగిపోయాయి - కలలో నీ వేడి నిట్టూర్పులకే

కలలు కరిగిపోయాయి - కలలో నీ వేడి నిట్టూర్పులకే  ...........శ్వేత 18 Oct 2015


ఎగసిపడుతున్న గుండె సవ్వడి - నీ ఊహల సడి వినినంతనే

ఎగసిపడుతున్న గుండె సవ్వడి - నీ ఊహల సడి వినినంతనే ...........శ్వేత 18 Oct 2015


జీవితాన్నే హారతిగా ఇస్తాను - హృదిలో కొలువైన కన్నయ్యకి

జీవితాన్నే హారతిగా ఇస్తాను - హృదిలో కొలువైన కన్నయ్యకి ...........శ్వేత 18 Oct 2015


ఆలోచనలు అల్లరి చేస్తున్నాయి - ఊహల గిలిగింతలికి

ఆలోచనలు అల్లరి చేస్తున్నాయి - ఊహల గిలిగింతలికి ...........శ్వేత 18 Oct 2015


ఊహల సౌధంలో ఊసులెన్నో చెప్పుకుంటున్నాయి - మనోవిహంగాలు

ఊహల సౌధంలో ఊసులెన్నో చెప్పుకుంటున్నాయి - మనోవిహంగాలు ...........శ్వేత 18 Oct 2015


ఎద తలుపు తట్టి చూడు - ఎద నిండా నీ తలపులే

ఎద తలుపు తట్టి చూడు - ఎద నిండా నీ తలపులే ...........శ్వేత 18 Oct 2015


చిరుజల్లై వచ్చి చల్లార్చిపో - తమకంతో తపించే హృదయాన్ని

చిరుజల్లై వచ్చి చల్లార్చిపో - తమకంతో తపించే హృదయాన్ని...........శ్వేత 18 Oct 2015