27.3.14

ఉగాది వేడుకలు ...... శ్వేత

ఉగాది వేడుకలు ...... శ్వేత 

వచ్చాయి ఉగాది వేడుకలు

వేసింది ప్రకృతి తమ ఇండ్ల(చెట్ల)కి పచ్చని సున్నాల(పెయింట్)ని
కట్టింది రంగురంగుల కొత్త కోకని
వేయి కన్నులతో వేచి చూస్తోంది
తన పురుషు(వసంతు)ని రాకకై
అందరూ రండి ఉగాది వేడుకలు చేసుకుందామని 

అందిస్తున్నాయి చెట్లు
కొత్త కొత్త పూలని, ఆకులని, కాయలని
(కొత్త పంటలని)
అందరూ రండి ఉగాది వేడుకలు చేసుకుందామని

కమ్మని స్వరంతో కోకిలమ్మ పలుకుతోంది స్వాగతం
అందరూ రండి ఉగాది వేడుకలు చేసుకుందామని

ఆరుకాలాలు ఒక్కసారిగా ఆరు రుచులను అందిస్తున్నాయి
అందరూ రండి ఉగాది వేడుకలు చేసుకుందామని

మొహావేశాలు విడచి - వయోబేధం మరచి
కులమతాల తేడాలు వదలి
రండి అందరం కలసి చేసుకుందాం సంబరంగా ఉగాది వేడుకలని
జయనామ సంవత్సరంలో అందరికీ జయములు కలగాలని   ..... 27-3-14

********** అందరికీ ఉగాది శుభాకాంక్షలు **********


No comments:

Post a Comment