4.2.13

విధి వంచిత

విధి వంచిత 

నన్నోడించేవారు లేరు
మాటల్లో గెలవలేరు 
ఆటలలో గెలవలేరు

అల్లరిలో గెలవలేరు
అదృష్టంలో గెలవలేరు

నాదంలో గెలవలేరు
వాదంలో గెలవలేరు
అని విర్రవీగా ఇన్నాళ్ళు.

విధి వక్రించి, నను వెక్కిరించి,
నేనోడి తా గెలిచి,
తన చేతిలో నన్ను చేసింది బందీని
విగతనై జీవిస్తున్నా...

తెలుసుకో సత్యాన్ని..
గెలుపోటములు మన చేతిలోలేవనీ
విర్రవీగాడలసలే వద్దనీ...
విధి చేతిలో అంతా కీలుబొమ్మలం....
చెప్పినట్లాడే తోలుబోమ్మలం...24 JAN 13...... 


1 comment:

 1. ఓడి గెలిచిందో
  గెలిచి ఓడిందో

  గెలిపించాలని ఓడిందో
  ఓడిపోవాలని గెలిపించిందో

  కాని చివరాఖరున..

  స్నేహాన్ని గెలిపించి తానోడింది
  బంధాన్ని గెలిపించి తానోడింది
  మంచిని గెలిపించి తానోడింది

  ఓడినా గాని గెలిచింది

  ReplyDelete