4.2.13

ఆకతాయికుర్రాళ్ళు

కొంటె కుర్రాళ్ళు 

తలకి నీలోసుకుని కురులార బెడుతుంటే 
కన్ను గీటి పోయాడే కాలనీ కుర్రాడు

పెద్ద నుయ్యి కాడ- నీళ్ళు నే తేబోతే 
పైటట్టుకు లాగాడే పోకిరి పిల్లోడు

జామ తోట కాడ-జాగింగు చేయబోతే

జోరుగా ఈలేసొకడు జాజిమల్లెలిచ్చాడు

సెరుకు తోటకి ఎరువెయ్య నేబోతే
సెయ్యట్టుకు లాగాడే సాంబయ్యొకడు

రామన్న గుడికి నే నెళ్ళ బోతుంటే
రేతిరికి రమన్నాడే రాలుగాయొకడు

చాకిరేవుకాడకి నేనెళ్ళ బోతుంటే
చస్తనన్నడొకడు మనువాడక పొతే

అబ్బబ్బ నే జెప్ప జాలలేకున్నానే
ఈ ఆకతాయి కుర్రాళ్ళ ఆగడాలు...

(ఓ కొంటె పల్లెపడుచు భావాలని అక్షర రూపంలో మీకు అందించే చిన్న ప్రయత్నం)...27 Jan 13.....No comments:

Post a Comment