28.8.15

శ్వేత ....... ఎన్నాళిలా కాలం గడపాలి

శ్వేత ....... ఎన్నాళిలా కాలం గడపాలి

నిను పిలువగ నేనడుగిడగ కదిలివస్తే
ఉలుకవు - పలుకవేల
కదలక - మెదలక ఉండుటేల
ఇంత కినుక నీకెలా
నీలో కదలిక రాదేల
పట్టు వదలక ఉండుటేల
నీకేమి కావాలో అడుగకపోతే ఎలా
ఏమివ్వాలో తెలియకనైతిని కదా
పంతం విడువక
వెనుకకు మరలక
పట్టు సడలక ఉన్న
నినునేనొదలక
ఎన్నాళిలా కాలం గడపాలి మనమిలా ..... 28 Aug 2015

मैं होगई तुझको फ़िदा - कभी न कहूँगी अलबिदा।

मैं  होगई  तुझको फ़िदा - कभी न कहूँगी अलबिदा। ….... శ్వేత 28 Aug 2015


శ్వేత........ విలువైన జీవితం

శ్వేత........ విలువైనది జీవితం

జీవితం చాలా చిన్నది, విలువైనది
మరుక్షణం నీది కాదని తెలుసుకో
తెలుసుకొని జీవించు
జీవించి ఆనందించు
ఆ ఆనందాన్ని నలుగురికి పంచు ..... 28 Aug 2015


జీవన పోరాటంలో ఓడినవారే ఎక్కువ - గెలిచినవారు ఎవరు లేరు

జీవన పోరాటంలో ఓడినవారే ఎక్కువ - గెలిచినవారు ఎవరు లేరు ...... శ్వేత 28 Aug 2015


నా మనః సాక్షిగా చెబుతున్నా - నిన్ను అగ్నిసాక్షిగా నేనే పెళ్ళాడుతానని

నా మనః సాక్షిగా చెబుతున్నా - నిన్ను అగ్నిసాక్షిగా నేనే పెళ్ళాడుతానని ..... శ్వేత 28 Aug 2015


నా జీవితం మలుపు తిరిగింది - తలపులలో ఉన్న సుందరి వలపు పొందినందుకు

నా జీవితం మలుపు తిరిగింది - తలపులలో ఉన్న సుందరి వలపు పొందినందుకు....  శ్వేత 28 Aug 2015
Photo By.....Ravivarma

మనసు చెదిరింది - బెదురు కనుల సుందరి ఎదురుగా వచ్చేసరికి

మనసు చెదిరింది - బెదురు కనుల సుందరి ఎదురుగా వచ్చేసరికి ..... శ్వేత 28 Aug 2015
Photo By Raja Ravivarma

స్వప్న వేదికపై కూడా నేనొంటరినే - స్వప్నంలో కూడా నన్నెవ్వరూ పలుకరించక

స్వప్న వేదికపై కూడా నేనొంటరినే - స్వప్నంలో కూడా నన్నెవ్వరూ పలుకరించక ..... శ్వేత 28 Aug 2015


ఎన్నో చెప్పాలని వచ్చాను - విప్పారిన కన్నులను చూసి అన్నీ మరిచాను

ఎన్నో చెప్పాలని వచ్చాను - విప్పారిన కన్నులను చూసి అన్నీ మరిచాను ...... శ్వేత 28 Aug 2015


తలపుల విత్తులు నాటాను - వలపుల పంటలు పండిద్దామని

తలపుల విత్తులు నాటాను - వలపుల పంటలు పండిద్దామని .... శ్వేత 28 Aug 2015



గోలపెట్టిన గుండె - గుండె గదిలోకి ఎవరో చొరబడ్డారని

గోలపెట్టిన గుండె - గుండె గదిలోకి ఎవరో చొరబడ్డారని ...... శ్వేత 28 Aug 2015


మౌనరాగాలాలపించే హృదయాలు సంగమమై- ఆలపించేవి ప్రణయరాగాలే

మౌనరాగాలాలపించే హృదయాలు సంగమమై- ఆలపించేవి ప్రణయరాగాలే........@శ్వేత 28 Aug 2015


వెతికా నీ రూపం కోసం - దాగుంది నా ఎద సవ్వడిలో నీ జ్ఞాపకమై

వెతికా నీ రూపం కోసం - దాగుంది నా ఎద సవ్వడిలో నీ జ్ఞాపకమై ...... @శ్వేత 28 Aug 2015 :)


అమరులైనారు గోపికలంతా - కృష్ణయ్య వేణుగానామృతాన్ని గ్రోలి

అమరులైనారు గోపికలంతా - కృష్ణయ్య వేణుగానామృతాన్ని గ్రోలి ...... శ్వేత 28 Aug 2015


20.8.15

ఎడారి మదిపై చిరుజల్లు కురిసినట్టైనది - నీ చల్లని చిరునవ్వుల జల్లులకి......@శ్వేత

ఎడారి మదిపై చిరుజల్లు కురిసినట్టైనది - నీ చల్లని చిరునవ్వుల జల్లులకి......@శ్వేత 20 Aug 2015


ప్రేమాక్షరాలను దిద్దుతున్నా - యవ్వనాల పాఠశాలలో......@శ్వేత

ప్రేమాక్షరాలను దిద్దుతున్నా - యవ్వనాల పాఠశాలలో......@శ్వేత 20 Aug 2015


19.8.15

ఒక్కో గ్రంథమౌతోంది - మదిలో మెదిలే ఒక్కో భావము .

ఒక్కో గ్రంథమౌతోంది - మదిలో మెదిలే ఒక్కో భావము ..... శ్వేత 19 Aug 2015


ఒకో గ్రంథమౌతుంది _ మదిలో మెదిలే ప్రతిభావాన్నీ వ్రాస్తూ ఉంటే .....శ్వేత 20 Aug 2015



నివేదన చేసా - మనసు పలుకలేని భావాలని కవితలుగా ప్రవహించమని .....శ్వేత

నివేదన చేసా  - మనసు పలుకలేని భావాలని కవితలుగా ప్రవహించమని .....శ్వేత 19 Aug 2015


16.8.15

శ్వేత .....మెచ్చినారంతా

శ్వేత .....మెచ్చినారంతా 

చాటుగ నను చూసి
పొరపాటుగ నను పొందవలెనని
నేరుగ నాకెదురేగి
ధీటుగ పలికిన సన్నాసికి
ఘాటుగ బదులిచ్చితినని
సెహబాషుగా పలికితివని
హుషారుగ, యమజోరుగా మెచ్చితిరందరు ....16 AUG 2015


6.8.15

మదిమాటున బంధమై నిలిచావు - ఎదగిల్లి గిలిగింతలు పెట్టి

మదిమాటున బంధమై నిలిచావు - ఎదగిల్లి గిలిగింతలు పెట్టి ..... శ్వేత 06 AUG 2015


5.8.15

శ్వేత..... ఎద శోధన

శ్వేత..... ఎద శోధన

ఏ ఎద తట్టి శోధన చేసిన ఎక్కడుంది ఆనందం
మనో వేదన, మూగ రోదన, మౌన ఆరాధన తప్ప

ఎదఎదలోనూ దాగున్నాయి ఎన్నెన్నో వ్యధలు
వ్యథలవెనుకున్నాయి ఎన్నెన్నో కథలు

చిటికిన బతుకులు
విరిగిన మనసులు

గాయమైన గుండె పలికే రాగాలు
మాయమైన మాటలు
సొంతమైన మౌనాలు

పొంతనలేని బంధాలు
సాంత్వన అందని శ్వాసలు
చింతను వీడని వదనాలు
అందీఅందని ఆశలు
అలికిడిలేని ఆయుష్షుకివే ఆఖరి హారతులు ..... 05 AUG 2015