27.7.14

శ్వేత ..... నవయువతరం

శ్వేత ..... నవయువతరం

వెర్రితలలు వేస్తున్న
వెర్రిమొర్రి వేషాలని చూసి

కుర్రకారు రెచ్చిపోయి
ఆడపిల్లల దేహాలతో
ఆటలాడి వదిలిపెట్ట
సభ్యసమాజం సిగ్గుచెందె

జీవచ్ఛవాలైరి అమ్మాయిలు
కామంధులై కటకటాలపాలైరి అబ్బాయిలు

సమసమాజ నిర్మాణం జరిగేదెన్నడు ?
గాంధీ కలలు నెరవేరేదెన్నడు

విద్యార్హులై నాగరికత మరుస్తున్న నవయువతరం వీళ్ళేనా ????..... 27-7-14


26.7.14

శ్వేత ...... హృదయాలు ఏకమయ్యే

శ్వేత ...... హృదయాలు ఏకమయ్యే

ఒక హృదయం

రెండవ హృదయాన్ని చూసింది (కోరింది)

మూడుముళ్ళు వెయ్యాలనుకొంది

నాలుగు వేదాల మంత్రాలతో

పంచభూతాల మధ్య

ఆరు ఋతువులు ఆమనియై వచ్చిన వేళ

సప్తఋషుల ఆశీస్సులతో

అష్టదిక్పాలకుల ఎదురుగా

నవగ్రహాల సాక్షిగా

పది దిక్కులు పిక్కటిల్లేలాగా

మేళతాళాల మధ్య

ఇరు హృదయాలకు మనువయ్యి  ఏకమయ్యే ..... 23-7-14


25.7.14

ఎన్ని తిరకాసులో - అరకాసు బంగారం కొనమంటే

ఎన్ని తిరకాసులో - అరకాసు బంగారం కొనమంటే ...... @శ్వేత...25-7-14

23.7.14

శ్వేత ..... దోస్తీకి లేదు సరిసాటి

శ్వేత ..... దోస్తీకి లేదు సరిసాటి

పోయాను ఒకనాడు నాస్నేహితుడు బోయపాటి భోగారావింటికి
పోవుసరికి అక్కడున్నాడు రాయపాటి రామారావు
మువ్వురం కలసి పోయాము - మేడపాటి మోహనరావుగాడి మిద్దింటికి

అక్కడ కలిసాడు చిన్ననాటి నేస్తం ఓలేటి ఓంకారుగాడు
నాటి మా మేటి కలియిక ఆనందం, అపురూపం, అద్భుతం
లేరెవ్వరు మా దోస్తీకి సరిసాటి
అందరం కలసి పోయాము గరికిపాటివారి అవధానానికి ..... 23-7-14

శ్వేత ..... ఎక్కిళ్ళు

శ్వేత ..... ఎక్కిళ్ళు

చంటిపిల్ల నాడు వచ్చేవి ఎక్కిళ్ళు

వయసులో పెరిగేవి ఆకళ్ళు

పెళ్ళయ్యాక వచ్చేవి వేవిళ్ళు

జంటలు దూరమైతే(విడిపోతే) మిగిలేవి కన్నీళ్ళు ..... 23-7-14 


నన్నెంత కష్టపెడుతున్నావో - నిన్నిష్టపడి వెంటపడుతుంటే

నన్నెంత కష్టపెడుతున్నావో - నిన్నిష్టపడి వెంటపడుతుంటే ..... శ్వేత 23-7-14

22.7.14

ఘజల్ శ్రీనివాసుగారి ..... ఒక ఘజల్

కవితచక్రగారు నిర్వహించిన స్వరాంజలి కార్యక్రమంలో ఘజల్ శ్రీనివాసుగారు ఆలపించిన ఒక అద్భుతమైన ఘజల్...... విన్నవారినందరినీ మైమరపించింది.


నిత్యాన్వేషిణే నేను - అనునిత్యం నాలో నిన్ను, నీలో నన్ను వెతుక్కుంటూ

 నిత్యాన్వేషిణే నేను - అనునిత్యం నాలో నిన్ను, నీలో నన్ను వెతుక్కుంటూ ...... @శ్వేత 22-7-14

  

12.7.14

శ్వేత .... మా బతుకులు దిద్దేదెవ్వరు ???

శ్వేత .... మా బతుకులు దిద్దేదెవ్వరు ???

బక్కచిక్కిన దేహంతో
పొట్టచేత పట్టుకొని

ఇల్లు - ఇల్లు తిరుక్కుంటూ(అడుక్కుంటూ)
మెతుకు - మెతుకు ఏరుకుంటూ

కూటికోసం వెతుక్కుంటూ
కోటితిప్పలు పడుతుంటే

పొమ్మన్నవారే తప్ప
పట్టెడన్నం పెట్టువారు లేరు

ఆకలి చావులు చూసినా
ఆదుకున్న వారు లేరు

మా ఆకలి తీరేదెన్నడు
మా బతుకులు దిద్దేదెవ్వరు ??? 12-7-14


Ramanareti Asramam in Mathura

 
Ramanareti Asramam in Mathura..... మథురలో రమణరేతి ఆశ్రమం 

శ్వేత .... నిను చేరాను

శ్వేత .... నిను చేరాను

నీపై మనసిడి - త్వరపడి
వెంటపడి మనువాడాను

మదిలో కలిగెడి అలజడితో
నీతో తలపడి - పరుగిడి
అలిసెడి హృదయముతో నిను చేరాను 12-7-14

Musical Fountain- In Prem Mandir

Beautiful & Colorful Musical Fountain- In Brundavanam Prem Mandir

Prem mandir in Brundavanam

బృందావనంలో ప్రేమమందిరంలో శ్రీకృష్ణుడు గోపికలతో ఆడిన ఆటలు

kaliyamardhanam....కాళీయమర్దనం

బృందావనంలో - ప్రేమమందిరంలో - కాలీయమర్దనం చేస్తున్న చిన్నికృష్ణుని చిత్రాలు

11.7.14

Radhamadhavulu.....బృందావనంలో ప్రేమమందిరంలో రాధామాధవులు

బృందావనంలో ప్రేమమందిరంలో ఊయలూగుతున్న  రాధామాధవులు

Rangamandir- బృందావనంలో రంగమందిరం

బృందావనంలో రంగమందిరంలో మధ్యాహ్నం ఆరగింపు సందర్భంగా దర్శనాలు నిలిపివేయటం వలన, ప్రార్థనా మంటపంలో భక్తులు చేస్తున్న శ్రీకృష్ణ భజన కార్యక్రమం,

10.7.14

Nidhivanam...బృందావనంలో నిధివనం

బృందావనంలో శ్రీకృష్ణుడు గోపికలతో రాసక్రీడలాడి, నడయాడిన నిధివనంలో మనం పోర్లాడితే కృష్ణుని పాదధూళి మనకు సోకి, చేసిన పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందట.

స్వర్గమెందుకింక ...... అన్నీ తానైన వలచిన చెలికాడు చెంతనుండగ

స్వర్గమెందుకింక..... అన్నీ తానైన వలచిన చెలికాడు చెంతనుండగ --- శ్వేత - 10-7-14