12.2.15

శ్వేత ..... వీడని బంధం

శ్వేత ..... వీడని బంధం

ఎదలో ఉంటాడు గానీ ఎదురుగ రాడాయె
ఎదురుగ వచ్చిననాడు మాటలు కరువాయె
ఎదుట లేనినాడు నిదుర కరువాయె
ఎద గిల్లిననాడు ఒళ్లంత పులకింతాయె
ఎంత పిలచినా, ఏమన్నాగానీ ఉలకడాయె పలుకడాయె

చెంత లేనినాడు గుండె బరువాయె
చేరువైననాడు మనసంత సిగ్గాయె

మనసంత నీవాయె - తనువంత నీదాయె
మరణాన్నైనా ఇద్దరిదీ వీడని బంధమాయె 12 Feb 2015


No comments:

Post a Comment