7.2.15

శ్వేత ........ ప్రేమ ఉచ్చు

శ్వేత ........ ప్రేమ ఉచ్చు

బుక్కు నుండి లుక్కులాపి
నక్కినక్కి నన్నే చూసింది
బక్కచిక్కిన దేహంతో మా అత్తకూతురు

పెక్కు మాటలాడింది
పక్కపక్కకొచ్చింది

లక్షణంగా ఉంటుంది
లక్కు కొద్దీ దొరికిందని ఎక్కువ సంతోషించాను

కైపెక్కిన కన్నులతో కిక్కు నాకు ఇచ్చింది
చెక్కుబుక్కుపై సంతకం పెట్టమని
చెక్కుపట్టుకొని చక్కంగా చెక్కేసింది

ముక్కుమూతి చీదుకుంటూ
వెక్కివెక్కి ఏడ్చుకుంటూ
చెక్కమంచమెక్కాను

ఉక్కుమనిషిలాంటోడిని
బక్కపలచనయ్యాను

ప్రేమ ఉచ్చులోపడి
బిచ్చగాడినయ్యాను .... 7-2-2015

No comments:

Post a Comment