16.2.15

పొడిబారిన మనసు - తడి ఆరని కనులను చూసి ..

పొడిబారిన మనసు - తడి ఆరని కనులను చూసి ... శ్వేత 16 FEB 2015


శ్వేత .... సడి చెయ్యని మనసు

శ్వేత .... సడి చెయ్యని మనసు

పొడిబారిన గొంతుతో
తడి ఆరని కన్నులతో
గుడిలోని దేవతలా
మడికట్టుకుని కూర్చుంది
సడి చెయ్యని మనసు 16 FEB 2015


పలికెనుమధు గీతం - నవనీతమైన ఒక హృదయం ..

పలికెను మధు గీతం - నవనీతమైన ఒక  హృదయం ... శ్వేత 16 Feb 2015


ఎదురు చూస్తున్నా - గేట్ ఎగ్జామ్ రాస్తే ఫేట్ మారుతుందేమో అని

ఎదురు చూస్తున్నా - గేట్ ఎగ్జామ్ రాస్తే ఫేట్ మారుతుందేమో అని .... శ్వేత 16 FEB 2015


కనులు మూతపడనంటున్నాయి - మనసునెంత సమాధానపరచినా

కనులు మూతపడనంటున్నాయి - మనసునెంత సమాధానపరచినా ....శ్వేత 16 Feb 2015


15.2.15

శ్వేత .....జయహో భారత్

శ్వేత .....జయహో భారత్


గర్వం మత్తులో ఉండి
చెత్త చెత్తగ ఆడిన
పాకిస్తాన్ పిలకను పీకేస్తానంటూ

మనవాళ్ళు గొప్పగొప్పగా ఆడి
పగవాళ్ళనుచిత్తుచిత్తుగా ఓడించి

క్రికెట్ ప్రపంచంలో మీపై ప్రతిసారీ మాదే గెలుపని చాటి చెప్పుతూ
చెప్పుతీసి కొట్టినట్టు చెప్పకనే చెప్పింది

మీకంటే గట్టివాళ్ళమే అని నిరూపించి
మాకెవ్వరూ సాటి రారని  తమ తడాక చూపించి  

మనదేశ పరువును నిలబెట్టి
త్రివర్ణ పతాకాన్ని ఆకాశమంత ఎత్తు ఎగురేశారు ....15-2-2015


13.2.15

Happy Valentines Day...పెళ్ళికి ముందు స్త్రీ -పురుషులుప్రేమించుకుంటే తప్పు

పెళ్ళికి ముందు స్త్రీ -పురుషులుప్రేమించుకుంటే తప్పు
పెళ్ళయ్యాక భార్యాభర్తలు ప్రేమించుకోకుంటే ముప్పు ....శ్వేత 13-Feb 2015


12.2.15

నేను పుట్టగానే మ్యాచ్ ఫిక్సింగ్ చేసారు మా పెద్దవాళ్ళు - బావకి సరిజోడు నేనేనని

నేను పుట్టగానే మ్యాచ్ ఫిక్సింగ్ చేసారు మా పెద్దవాళ్ళు - బావకి సరిజోడు నేనేనని ....శ్వేత ... 12-2-15 :)



శ్వేత ..... వీడని బంధం

శ్వేత ..... వీడని బంధం

ఎదలో ఉంటాడు గానీ ఎదురుగ రాడాయె
ఎదురుగ వచ్చిననాడు మాటలు కరువాయె
ఎదుట లేనినాడు నిదుర కరువాయె
ఎద గిల్లిననాడు ఒళ్లంత పులకింతాయె
ఎంత పిలచినా, ఏమన్నాగానీ ఉలకడాయె పలుకడాయె

చెంత లేనినాడు గుండె బరువాయె
చేరువైననాడు మనసంత సిగ్గాయె

మనసంత నీవాయె - తనువంత నీదాయె
మరణాన్నైనా ఇద్దరిదీ వీడని బంధమాయె 12 Feb 2015


10.2.15

శుభరాత్రి సందేశాలు 181 నుండి 190 వరకు

  శుభరాత్రి సందేశాలు 181 నుండి 190 వరకు

















శ్వేత .......కనువిప్పు కలిగింది

శ్వేత .......కనువిప్పు కలిగింది

నీ మెప్పుకోసం ఎన్నో ముప్పతిప్పలు పడ్డాను
కప్పు కాఫీ తాగుతూ - కబుర్లెన్నో చెప్పుకుంటూ
మనసు విప్పి నీముందర పరచాను

చెప్పకనే చెప్పాయి నీ తప్పుడు మెసేజీలు
నీవు తిరుగుబోతు వాడివని
అప్పులెన్నో ఉన్నాయని
అప్పలమ్మల చుట్టూ తిరుగుతుంటావని

నేడు కనువిప్పు కలిగింది
నీవు నివురుగప్పిన నిప్పువని
నేను నిన్ను ప్రేమించి తప్పుచేశానని......10-2-2015


శ్వేత .......విధివక్రించింది

శ్వేత .......విధివక్రించింది

కలలోకొచ్చిన ఊహా సుందరి
ఇలలో ఎదురుగ వచ్చి
తన వాడి చూపులతో ఎదనే గిచ్చి
మనసే ఇచ్చి
మురిపాలు పంచి కైపెక్కించి
ఎదలో ఎన్నో ఆశలు రేకెత్తించి
మనువాడతానని మాటిచ్చి
విధివక్రించి మరొకరితో పెళ్ళిపీటెక్కి
పిచ్చివాణ్ణి చేసి వీధికెక్కించింది ...... 10-2-2015


శ్వేత ..... నిశాచరి

శ్వేత .... నిశాచరి

ఈ విశాల వినీలాకాశంలో
నిశీధిలో నిశాచరినై
నిరాశతో నున్న నేను

నిర్జీవమైన ఈ దేహంతో
నీకై అర్చనలెన్నో చేశాను
అర్జీలెన్నో పంపాను

తర్జుమాచేసి చదువుకుంటావో
విసర్జన (విసిరివేస్తావో) చేస్తావో నీ ఇష్టం నేస్తమా ....10-2-2015



7.2.15

కవితలను పండిస్తున్నా - కాగితపు పొలంలో అక్షరాల విత్తులను నాటి

కవితలను పండిస్తున్నా - కాగితపు పొలంలో అక్షరాల విత్తులను నాటి ..... శ్వేత 7-Feb-2015






రావయ్య నల్లనయ్య

శ్వేత ..... రావయ్య నల్లనయ్య

నా తలపు నీదయ్య
నా పిలుపు నీకయ్య
నీ వేణునాదంతో కన్నెల మది దోచే కన్నయ్య

కోపము వీడి
తాపము తీర్చి
పాపములు తొలగించవయ్య పాండురంగయ్య

ఒకపరి నాదరి చేరరావేమయ్య
ఓరోరి నల్లనయ్య  7-2 -15


శ్వేత ........ ప్రేమ ఉచ్చు

శ్వేత ........ ప్రేమ ఉచ్చు

బుక్కు నుండి లుక్కులాపి
నక్కినక్కి నన్నే చూసింది
బక్కచిక్కిన దేహంతో మా అత్తకూతురు

పెక్కు మాటలాడింది
పక్కపక్కకొచ్చింది

లక్షణంగా ఉంటుంది
లక్కు కొద్దీ దొరికిందని ఎక్కువ సంతోషించాను

కైపెక్కిన కన్నులతో కిక్కు నాకు ఇచ్చింది
చెక్కుబుక్కుపై సంతకం పెట్టమని
చెక్కుపట్టుకొని చక్కంగా చెక్కేసింది

ముక్కుమూతి చీదుకుంటూ
వెక్కివెక్కి ఏడ్చుకుంటూ
చెక్కమంచమెక్కాను

ఉక్కుమనిషిలాంటోడిని
బక్కపలచనయ్యాను

ప్రేమ ఉచ్చులోపడి
బిచ్చగాడినయ్యాను .... 7-2-2015