20.1.14

ఎప్పుడొస్తాడో నామావ

శ్వేత ... ఎప్పుడొస్తాడో నామావ

ఎన్నముద్దంటి మనసున్న నామావ
సద్దిముద్దైనా తినటానికి రాడాయె

పనిసెయ్య పోబోతే - నీయాద వస్తది
కనుమూసి సూతమంటే - నీడైనా కానరాకున్నది

ఒళ్ళంతా కళ్ళు సేసుకొని ఎదురుసూస్తినయ్యా
వేవేగ రావేమయ్యా ఓరోరి మావ

ఏడ నీవుంటివిరో - మావా
ఏనాడు నన్నేలుకొందువురో - మావా
ఎపుడొచ్చి మూడుముళ్ళు వేస్తవురో - మావా ..... 20-01-2014


No comments:

Post a Comment