28.1.14

శ్వేత ..... అత్తకొడుకు

శ్వేత ..... అత్తకొడుకు

అత్తకొడుకని నే చేరదీస్తే
చిత్తాన్నే దోచేసినాడే ఉత్తముడిగా కనిపిస్తూ

ఎంతెంత దూరం పోయాడో
ఏమేమి చేసాడో నే చెప్పజాల

ముత్యపు ముక్కెర ఇచ్చి
మువ్వన్నెల చీరలిచ్చి

మగడు నేనని చెప్పినాడు
మూడుముళ్ళు వేసేసినాడు .... 28-01-2014


దాగి ఉండేది తండ్రి ప్రేమ ...... బయటపడేది తల్లి ప్రేమ ..... శ్వేత

దాగి ఉండేది తండ్రి ప్రేమ ...... బయటపడేది తల్లి ప్రేమ ..... శ్వేత


25.1.14

ఆకాశమే నీకు హద్దు

ఆకాశమే నీకు హద్దు 

ఆకాశమే నీకు హద్దు 
అంతకు మించి అవధులు దాటొద్దు

కుల-మత భేదాలొద్దు
కలహాలు మనకొద్దు
కలహించుకోడానికి కారణాలు వెతకొద్దు

అత్యాచార అకృత్యాలు వద్దు

ఆగడాలు మానితే ముద్దు
అందరం కలసి ఉంటేనే ముద్దు...


వందే మాతరం ....... వందేమాతరం....26 JAN 13



Happy Republic Day

Happy Republic Day


గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 




24.1.14

నూతన వధూవరులకు అక్షరాక్షర శుభాక్షతలు

నూతన వధూవరులకు అక్షరాక్షర శుభాక్షతలు
(అమ్మ - నాన్న పెళ్ళికి వారిని ఆశీర్వదిస్తూ.... నాన్నగారి స్నేహితుడు (కొప్పనాతి అప్పలస్వామిగారు)  రాసి అందించిన కవిత)

ఓనూత్న వధూవరులారా !
వినూత్న జీవన ప్రాంగణాప్రవేశితులారా !
నవజీవనానందాన్వేషణాశక్తులారా !
అక్షరాక్షర శుభాక్షతలివే ..... ఇవే ..... ఇవే !!!

చంద్రుడూ వెన్నెలల
పూవూ తావిలా
ఎడబాయక మీరెప్పుడు
ఎదలలోన మమతలనూ
మురిపెముగా పెంచుకొనగ
అక్షరాక్షర శుభాక్షతలివే ...... ఇవే ...... ఇవే !!!

మధుర శోభాసమన్వితం జీవితం
వసంత వాటికా తటాక తరీ సౌందర్యశ్రీ
చెంత ... వన్నెల, చిన్నెల హాసవిలాసములదేల
అక్షరాక్షర శుభాక్షతలివే ...... ఇవే ...... ఇవే !!! 

ఓ నూత్న వధూవరులారా !
నవోదయం మీకు
మహోదయం మీకు
శుభోదయం మీకు
నూత్న వదూవరులకు అక్షరాక్షర శుభాక్షతలివే ...... ఇవే ...... ఇవే !!!

(By ..... కొపనాతి అప్పలస్వామి .... 14-05-1968.....శ్రీహరిపురం ..... విశాఖపట్నం)



<3 అమ్మ - నాన్న పెళ్ళిఫోటో లేదు .... అందుకే షష్టిపూర్తి ఫోటో పెడుతున్నాను <3

20.1.14

మావోచ్చీసినాడే

శ్వేత ..... మావోచ్చీసినాడే

పట్టేసినాడే మావ - పట్టేసినాడే
వలవేసి వలపించి నన్నే పట్టేసినాడే మావా ll పట్టే ll

ఒళ్ళంతా తడిమేసి - వయ్యారాలు దోచేసి
ఓర సూపుల గాలమేసి - ఒడిసి పట్టేసినాడే మావా ll పట్టే ll

కాళ్ళకి కడియాలు తెచ్చి - సేతికి వంకీలు ఇచ్చి
నడుముకి వడ్డాణమెట్టి - నడుమును సుట్టేసినాడే మావా ll పట్టే ll

కళ్ళలోన కళ్ళుపెట్టి - మంత్రమేసి మాయసేసి
సందురుడిని సూపించి - సొగసులన్ని కాజేసినాడే మావా ll పట్టే ll




ఎప్పుడొస్తాడో నామావ

శ్వేత ... ఎప్పుడొస్తాడో నామావ

ఎన్నముద్దంటి మనసున్న నామావ
సద్దిముద్దైనా తినటానికి రాడాయె

పనిసెయ్య పోబోతే - నీయాద వస్తది
కనుమూసి సూతమంటే - నీడైనా కానరాకున్నది

ఒళ్ళంతా కళ్ళు సేసుకొని ఎదురుసూస్తినయ్యా
వేవేగ రావేమయ్యా ఓరోరి మావ

ఏడ నీవుంటివిరో - మావా
ఏనాడు నన్నేలుకొందువురో - మావా
ఎపుడొచ్చి మూడుముళ్ళు వేస్తవురో - మావా ..... 20-01-2014


10.1.14

పెట్టినా విమర్శించేవాడు బిడ్డ, విమర్శించినా పెట్టేది అమ్మ .

పెట్టినా విమర్శించేవాడు బిడ్డ,
విమర్శించినా పెట్టేది అమ్మ .  


8.1.14

నడకలు నేర్పుతున్నావా ? - నాట్యం నేర్పిన నెమలికి

నడకలు నేర్పుతున్నావా ? - నాట్యం నేర్పిన నెమలికి ..... శ్వేత -- 08-01-2014


Rubik Cube Puzzle

Rubik Cube Puzzle -----  మా చెల్లెలి కొడుకు (S.Sai Saketh) 1 నిమిషం 20 సెకండ్లలో సెట్ చేసాడు :)

7.1.14

నీతో నేనెప్పుడూ సిద్ధమే _ సయ్యాటకైనా, సమరానికైనా

నీతో నేనెప్పుడూ సిద్ధమే _ సయ్యాటకైనా, సమరానికైనా....శ్వేత 07-01-2014


5.1.14

నేను నీకేమవ్వను

శ్వేత .... నేను నీకేమవ్వను

సెల్లునైన కాకపోతిని - సమంత చెంపను తాకగా
కాటుకైనా కాకపోతిని - కాజోల్ కంటిలో ఉండగా

అందెనైనా కాకపోతిని - అనుష్క కాలిని సోకగా
బిందీనైనా కాకపోతిని - భార్గవి నుదుటన ఉండగా

లిప్ స్టిక్ ఐనా కాకపోతిని - లైలా పెదవులు ముద్దాడగా
పేస్ క్రీమ్ నైనా కాకపోతిని - మమత మోమును ముద్దాడగా

ఝుంకా నైనా కాకపోతిని - జెనీలియ చెవులకు వ్రేలాడగా
గొలుసునైనా కాకపోతిని - గజాల మెడను తాకగా

వడ్డాణమైనా కాకపోతిని - వసంత నడుమును చట్టగా
గాజులైనా కాకపోతిని - గౌతమి చేతిలో ఉండగా

డ్రెస్ నైనా కాకపోతిని - దామిని అంటిపెట్టుకొని ఉండగా
మంచమైన కాకపోతిని - మల్లియను నా ఒడిలో సేదదీర్చగా  .... 5-1-14


ఒళ్ళంత తుళ్ళింత

శ్వేత --- ఒళ్ళంత తుళ్ళింత

నీవు నాదరి చేరగనె
నా తనువంతా తుళ్ళింతాయె
ఒకింత సరసమ్ము శృతిమించె
వెనువెంటనే విరహమ్ము వెనుకకు జంకె
తనువులు పెనవేసి లోకాలు మైమరాచె .... 05-01-2014


పూబాటే - నీవు నడచిన ప్రతిచోటా

పూబాటే - నీవు నడచిన ప్రతిచోటా .... శ్వేత -- 5-01-2014


కంటిపాపలో నేనుంటా - చంటిపాపలా లాలించి పాలించావా ?

లాలించి పాలించావా ? - కంటిపాపలో చంటిపాపలా నేనుంటా -  .... శ్వేత -- 5-01-2014


4.1.14

हमें तीन चीजें हमेशा याद रखिये

हमें तीन चीजें हमेशा याद रखिये 

१. तीन चीजें किसीका इंतज़ार नहीं करती है।
वक्त - मौत - ग्राहक

२. तीन चीजें जिंदगी में एकबार ही मिलती है।
माता-पिता --- जिंदगी --- मानवजन्म

३. तीन चीजें निकली हुई वापस नहीं आती।
तीर कमान से --- बात जबान से --- प्राण शरीर से

४. तीन चीजें परदे में होनी चाहिए।
धन --- स्त्री --- भोजन

५. तीन चीजों से बचना चाहिए
 बुरी सांगत --- स्वार्थ --- निंदा

६. तीन चीजों में मन लगाने से फायदा होता है।
ईश्वर --- मेहनत --- विद्या

७. तीन चीजें कभी भूलना नहीं चाहिए
कर्ज़ --- मर्ज़ --- फर्ज़

८. तीन चीजों का आदर करना चाहिए।
माता -पिता --- मेहमान --- गुरू

९. तीन चीजें हमेशा अपनी वश में रखनी चाहिए।
मन --- काम --- लोभ

१०. तीन चीजें पर दया करनी चाहिए।
बालक --- भूका --- पागल

११. तीन चीजें भाई को भाई का दुश्मन बना देती है।
जर --- जोर --- जमीन


1.1.14

నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ మిత్రులందరికీ శుభోదయం

నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ మిత్రులందరికీ శుభోదయం

ఆశలతీరం చేరుకుంటూ
కొత్త ఊహలకి ఊపిరి పోసుకుంటూ

నవతరానికి నాంది పలుకుతూ
నూతన సంవత్సరానికి ఆహ్వానం చెబుతూ

మిత్రులందరికీ శుభోదయం ..... శ్వేత 1 Jan 2014


ఎలా ఎలా

శ్వేత -- ఎలా ఎలా

ఎలా చేరుకోవాలి నిన్ను నేను
ఎలా మరువాలి నన్ను నేను

నిన్ను నాలో కలుపుకుంటూ
నన్ను నీలో వెతుక్కుంటూ

ఒకరికొకరు హత్తుకుంటూ
ఆశలతీరం చేరుకుంటూ

ఎలా చేరుకోవాలి నిన్ను నేను
ఎలా మరువాలి నన్ను నేను ..... 01 Jan 2014


Happy New Year