29.9.13

శ్రీ శ్రీ కి అక్షర నివాళి

శ్రీశ్రీకి అక్షర నివాళి

పదండి ముందుకు పదండి ముందుకు
పోదాం పోదాం పైపైకి
మూఢనమ్మకాల ముసుగు తీయండి
పదవీ వ్యామోహాలొదలండి
ప్రాణాలొడ్డి ఎదురు నిలవండి
ధైర్యసాహసాలున్న భావిపౌరులు మీరేనండి

దేశభవిత ఉంది మీ చేతుల్లో
తెగువ చూపి కదలండి మీ చేతల్లో
నిర్లక్ష్యం నైరాశ్యం వదలండి
జగతికి స్ఫూర్తిగా అడుగు ముందుకేసి
గమ్యాన్ని చేరండి
చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా నిలపండి

(శ్రీ శ్రీ జయంతి సందర్భంగా నేను రాసిన ఈ కవిత తెలుగు వన్ డాట్ కామ్ లో ప్రచురితమైనది)

2 comments:

  1. ilaanti kavitalu raayadam koddigaa kashtam kaani meeru chaala baaga raasaru....abhinandanalu....

    ReplyDelete