23.8.19

సతతము నిన్నే స్మరింతును ....@శ్వేత

సతతము నిన్నే స్మరింతును ....@శ్వేత
ముల్లోకాలను నీ ఉదరమున ఇముడ్చుకునే కృష్ణా 
దేవకి గర్భంబున ఎలా ఒదిగి ఉంటివయ్యా ll
పాలు పెరుగు వెన్నలన్నీ నీ ఇంటి నిండా ఉండ
మట్టిముద్దపైన ఏల మనసు పడితివయ్యా ll
నిన్ను మెచ్చి నీ వెంటపడిన గోపికలను మురిపించి
నిరతము నిన్నే పూజించే వనితల వలువలేల గొనిపోతివయ్యా ll
మురిసె గోకులవాసులంతా నీ ఆటపాటలతో
అట్టివారింట వెన్న దొంగాడి కయ్యాలేల పెట్టితివయ్యా ll
కడు దుర్లభమైన నీ పాద దర్శనం కోసం ముల్లోకాలు వేచి చూస్తాయి
అట్టి నీ పాద స్పర్శ ఇట్టే కాళిందునికెలా దక్కేనయ్యా ll
సతతము నిన్నే స్మరించే నన్ను విస్మరించి
అన్యులకేల ముక్తినొసగుతున్నావయ్యా ll
....23 Aug 2019


16.8.19

వసంతంలా వొచ్చి గ్రీష్మంలా వెళ్ళిపోయింది - నా కలలోకి వచ్చిన స్వప్నసుందరి

వసంతంలా వొచ్చి గ్రీష్మంలా వెళ్ళిపోయింది - నా కలలోకి వచ్చిన స్వప్నసుందరి .... శ్వేత 6 Sep 2017

ఎన్ని వత్సరాలు గడచినా వన్నె తగ్గనిది - వడ్డాదివారి వయ్యారిభామ

ఎన్ని వత్సరాలు గడచినా వన్నె తగ్గనిది - వడ్డాదివారి వయ్యారిభామ.... శ్వేత 06 Sep 2017

 

కదిలిపోతున్నాయి మంచుతెమ్మెరలు.... కరగిపోయిన మన క(థ)లల వలె

కదిలిపోతున్నాయి మంచుతెమ్మెరలు.... కరగిపోయిన మన క(థ)లల వలె ...@శ్వేత...27/8/2018



27.8.18

నీ స్మృతుల స్వప్నాలు కళ్ళల్లో కదలాడుతూనే ఉన్నాయి - కంటికి వెలుగు దూరమైనప్పటికీ

నీ స్మృతుల స్వప్నాలు కళ్ళల్లో కదలాడుతూనే ఉన్నాయి - కంటికి వెలుగు దూరమైనప్పటికీ .@శ్వేత...27/8/2018



నిత్య జ్ఞాపకమై నన్ను వెంటాడుతూ ఉంటాయి - నీ సూదంటి కొంటి చూపులు

నిత్య జ్ఞాపకమై నన్ను వెంటాడుతూ ఉంటాయి - నీ సూదంటి కొంటి చూపులు .... శ్వేత 06 Sep 2017




6.9.17

తలపులు తట్టి లేపి వలపులు దోచుకున్నావు - పిలుపు గాలమేసి

తలపులు తట్టి లేపి  వలపులు దోచావు - పిలుపు గాలమేసి .... శ్వేత 06 Sep 2017


ఎగిరిపోదామా - హద్దులు లేని ఆకాశానికి, నిద్దురలేని లోకానికి

ఎగిరిపోదామా - హద్దులు లేని ఆకాశానికి, నిద్దురలేని లోకానికి .... శ్వేత 06 Sep 2017

 

కమ్మగా నిదురపోదామా - కనుదోయిలో వెన్నెల నింపుకొని⁠⁠⁠⁠

కమ్మగా నిదురపోదామా - కనుదోయిలో వెన్నెల నింపుకొని⁠⁠⁠⁠ .... శ్వేత 6 Sep 2017

28.8.17

ఋతువులతో గలాటాలెందుకు ... శ్వేత

ఋతువులతో గలాటాలెందుకు ... శ్వేత

వసంతఋతువుతో వయ్యారాలెందుకు
గ్రీష్మఋతువుతో గిల్లికజ్జాలెందుకు

వర్షఋతువుతో వాదులాటెందుకు
శరదృతువుతో సరసాలెందుకు

హేమంతఋతువుతో హాస్యమెందుకు
శిశిరఋతువుతో సమరమెందుకు

ఋతువులతో గలాటాలెందుకు మనకు ..... 28 Aug 2017


మందారంలా ముడుచుకుని, సిరిమల్లల్లే సిగ్గుపడింది - సొట్టబుగ్గల సుందరి

మందారంలా ముడుచుకుని, సిరిమల్లల్లే  సిగ్గుపడింది - సొట్టబుగ్గల సుందరి ...
శ్వేత 28 Aug 2017


చెలికాని నవ్వులకే గువ్వల్లే ఒదిగిపోయింది - పసిడివంటి పడుచుప్రాయం

చెలికాని నవ్వులకే గువ్వల్లే ఒదిగిపోయింది - పసిడివంటి పడుచుప్రాయం ... శ్వేత 28 Aug 2017

నిను తలచిన ప్రతిక్షణం .... శ్వేత

నిను తలచిన ప్రతిక్షణం .... శ్వేత

బ్రతుకంటే చేదన్నది
బంధుత్వమే రోతన్నది

అనురాగమే లేదన్నది
ఆప్యాయత కావాలన్నది

స్నేహమంటే బరువన్నది
సాహసాలు వద్దన్నది

అరుదెంచిన అవకాశాలు వద్దన్నది
ఆకశాన ఊయలలూగుతానన్నది

నిను తలచిన ప్రతిక్షణం
విలపించును నా మది .... 28 Aug 2017



కవితల పూదోట .... శ్వేత

కవితల పూదోట .... శ్వేత

అలసత్వమెరుగని నా అక్షరాలని
పటుత్వమున్న మంచి పదాలని

మృదుత్వమున్న (మృదువైన) మాటలతో
సరళత్వమున్న సంభాషణలతో

అస్తిత్వం కోల్పోతున్న అక్షరాలని
కమ్మని కవితల పూదోటలో విహరింపచేస్తున్నా ..... 28 Aug 2017