నిను తలచిన ప్రతిక్షణం .... శ్వేత
బ్రతుకంటే చేదన్నది
బంధుత్వమే రోతన్నది
అనురాగమే లేదన్నది
ఆప్యాయత కావాలన్నది
స్నేహమంటే బరువన్నది
సాహసాలు వద్దన్నది
అరుదెంచిన అవకాశాలు వద్దన్నది
ఆకశాన ఊయలలూగుతానన్నది
నిను తలచిన ప్రతిక్షణం
విలపించును నా మది .... 28 Aug 2017
No comments:
Post a Comment