17.10.13

సిగ్గిల్లి ముడుచుకున్న నీ మోము..... గులాబి మొగ్గల్లే ఉంది.

సిగ్గిల్లి ముడుచుకున్న నీ మోము..... గులాబి మొగ్గల్లే ఉంది..... @శ్వేత...17-10-2013



16.10.13

శుభరాత్రి సందేశాలు 141 నుండి 150 వరకు

శుభరాత్రి సందేశాలు

























నేను ఒంటరిని

ఆనందాల లోగిలిలో ఉన్నాను నేను ..... నీవు ఉన్న నిన్నలో 
కష్టాల కడలిలో ఉన్నాను నేను ...... నీవు లేని నేటిలో .......



12.10.13

కలిసుండండి ..... శ్వేత

కలిసుండండి ..... శ్వేత 


వద్దు వద్దు కోపాలు తాపాలు
మరువద్దు పెళ్ళినాటి ప్రమాణాలు

ఆలుమగలన్నాక ఉంటాయి ప్రణయకలహాలు
అవి కాకూడదు జీవితాన ప్రళయకలహాలు

అలుకలు మాని,కలతలు వీడి
కలిసుండాలి కలకాలము

ఇతర జంటలకు ఆదర్శమవ్వాలి
పిల్లలకు మార్గదర్శకం కావాలి
పెద్దల జీవితమున ప్రశాంతత నిలపాలి .....12 Oct 2013




29.9.13

శ్రీ శ్రీ కి అక్షర నివాళి

శ్రీశ్రీకి అక్షర నివాళి

పదండి ముందుకు పదండి ముందుకు
పోదాం పోదాం పైపైకి
మూఢనమ్మకాల ముసుగు తీయండి
పదవీ వ్యామోహాలొదలండి
ప్రాణాలొడ్డి ఎదురు నిలవండి
ధైర్యసాహసాలున్న భావిపౌరులు మీరేనండి

దేశభవిత ఉంది మీ చేతుల్లో
తెగువ చూపి కదలండి మీ చేతల్లో
నిర్లక్ష్యం నైరాశ్యం వదలండి
జగతికి స్ఫూర్తిగా అడుగు ముందుకేసి
గమ్యాన్ని చేరండి
చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా నిలపండి

(శ్రీ శ్రీ జయంతి సందర్భంగా నేను రాసిన ఈ కవిత తెలుగు వన్ డాట్ కామ్ లో ప్రచురితమైనది)

నిన్ను నన్ను ఏకం చేసే

నిన్ను నన్ను ఏకం చేసే

మనసులు ముడివేసే
తనువులు పేనవేసే 
తలపులు కలబోసే 
నీవు నా సొంతమాయే
నా మనసంతా నీవాయే
మన ప్రేమ నిన్ను నన్ను ఏకం చేసే

28.9.13

ఎవరికి కానుందో సొంతం - ఈ మేలిముసుగులోని అందం

ఎవరికి కానుందో సొంతం -  ఈ మేలిముసుగులోని అందం ....శ్వేత 28 Sep6 2013

ప్రతి అడుగులో కనిపిస్తుంది - నా అణువణువులో దాగున్న నీపై నాకున్న ప్రేమ

ప్రతి అడుగులో కనిపిస్తుంది - నా అణువణువులో దాగున్న నీపై నాకున్న ప్రేమ ... శ్వేత  28 Sep 2013


మైమరపు ...... శ్వేత

మైమరపు ...... శ్వేత

తొలి వలపు తియ్యనైనది
నీ పిలుపు కమ్మనైనది
తలపు పిలుపుల నడుమ కలిగేదే మైమరపు .... 28 Sep 2013

మది కలవరం

అలుకచూపకే 


ఒంపుసొంపుల వయ్యారి 


మది కలవరం 


వలపు వాకిళ్ళు