29.5.14

శ్వేత ..... పరుగో పరుగు

శ్వేత ..... పరుగో పరుగు

నగలు మెరుగు పెట్టిద్దామని నేపోబోతే
తరుగు చూపి మోసగించె దుకాణుదారు

పెరుగమ్మ జూప నేపోబోతే
పరుగుపరుగున వచ్చె పోకిరి కుర్రాళ్ళు

అరుగుమీద కూర్చుండ నేపోబోతే
మొరుగుకుంటూ వచ్చె శునకమారాజులు

ఎరుకశానిని చూసి ఎదురు నేపోబోతే
వెదురుకర్ర నాకు నుదురు మీద తగిలి బెదిరిపోయాను

ఎక్కడినుండో ఎగురుకుంటూ వచ్చే ఓ పురుగు
అది చూసి మొదలెట్టె నేనొక్క పరుగు ...... 29-5-14


No comments:

Post a Comment