22.11.13

కోటి రాగాలు పలుకుతాయి - నా ఎద మీటినంతనే

కోటి రాగాలు పలుకుతాయి - నా ఎద మీటినంతనే .... శ్వేత -- 22-11-13


మది పులకించింది - నీ వేలి కొసలు కాలిని తాకగానే

మది పులకించింది - నీ వేలి కొసలు కాలిని తాకగానే ...శ్వేత 22-11-13

శ్వేత ...... చిలిపి వయసు కోరిక

శ్వేత ...... చిలిపి వయసు కోరిక

జాజులు ఎర్రబడ్డాయి ...... నీవు తలపుకు రాగానే
చెక్కిళ్ళు సిగ్గుపడ్డాయి ...... నీవు ఎదురుపడగానే

ఎద తుళ్ళిపడింది ....... నీ పిలుపు వినగానే
పరువం ఎగసిపడింది ....... నీవు చెంతకు రాగానే

మనసు మారాం చేసింది ......... నిను వీడి రానని
చిలిపి వయసు కోరుతున్నది ....... నీ తోడు కావాలని 22-11-13

ఆనందం

నిన్ను చూసినప్పటి ఆనందం మళ్ళీ నాలో కలుగదు
నా అందాన్ని నేను ఎన్నిసార్లు అద్దంలో చూసుకున్నా ...... శ్వేత ... 22-11-13


15.11.13

చెవిలో చెప్పకు గుసగుసగా _ ఎదుటపడి తెలుపు ఇలా ఊసులుగా

చెవిలో చెప్పకు గుసగుసగా _ ఎదుటపడి తెలుపు ఇలా ఊసులుగా ..... శ్వేత ... 15-11-13




షేర్ చేసుకోవెందుకు నాతో ? - నీలో భావాలని !

షేర్ చేసుకోవెందుకు నాతో ? - నీలో భావాలని !.......శ్వేత ...14-11-13




 

పునీతురాలినయ్యా ! - నీ పాదాలచెంత చోటుదొరికినంతనే

పునీతురాలినయ్యా ! - నీ పాదాలచెంత చోటుదొరికినంతనే ....శ్వేత... 14-11-13



 

14.11.13

రిమూవ్ చేయకు మది నుండి - మన మధురూహలని .

రిమూవ్ చేయకు మది నుండి - మన మధురూహలని .....శ్వేత...14-11-13




 

శ్వేత ..... బుల్లి చెల్లి

శ్వేత ..... బుల్లి చెల్లి 

తడబడు అడుగులు ఎందుకే చెల్లి 
బుడిబుడి అడుగులు వేస్తూ రావే 

చురచుర చూపులు చూడకే బుల్లి 
పకపక నవ్వులు రువ్వగ రావే 

చెడుగుడు ఆటలు ఆడుదామే లిల్లి 
చకచక పరుగులు పెడదాం రావే ...... 14 Nov 2013

తిరిగిరాని బాల్యం ...... శ్వేత

(N.V. రఘువీర్ ప్రతాప్ గారి సంపాదకత్వంలో.....అక్టోబర్ 27 వ తేదిన "అపురూపం" అనే పుస్తకావిష్కరణ జరిగింది. ఆ పుస్తకంలో 200 మంది కవులు వారి బాల్యం గూర్చి రాసారు. అందులో నేను (నండూరి లక్ష్మి) కూడా ఒక కవిత రాసాను. అదే ఈ కవిత)

తిరిగిరాని బాల్యం ...... శ్వేత

తిరిగిరాని బాల్యం - మనకెంతో అమూల్యం
అందరికి ప్రియాతిప్రియం
తలచుకుంటే కలుగుతుంది ఆనందం

చిన్ననాడు కాకెంగిళ్ళు అందరితో పంచుకున్నాం
ఆడ - మగ తేడాలేక అందరితో ఆడుకున్నాం

బంకమన్ను తెచ్చుకుని బొమ్మరిళ్ళు కట్టుకున్నాం
పప్పుబెల్లాలు అందరితో కలసి ఆరగించం

కోతిబావ అని అంటు బావల్ని ఆటపట్టించాం
గిల్లికజ్జాలాడుకుంటు ఆటలెన్నో ఆడుకున్నాం

ఆటలలో ముందున్నాం - అల్లరిలో ముందున్నాం
చదువులలో ముందున్నాం - అణకువలో ముందున్నాం

జ్ఞాపకాలకంటూ లేదు ఎప్పుడూ అంతం
గుర్తుకొచ్చిన నాడు వస్తుంది కన్నీటి వర్షం
ఈ బాల్యం స్మృతులంటే నాకెంతో ఇష్టం ..... 14 Nov 2013


13.11.13

శ్వేత ....చక్కని చుక్క

శ్వేత ....చక్కని చుక్క 

చక్కని చుక్క - దక్కెను లక్కుగ
మక్కువ పెరిగి వచ్చెను పక్కగ

ఎక్కువ - తక్కువలు ఆలోచించక
కిక్కురుమనక ఠక్కున పట్టెను తనచేయి
మనసు ఆనందంతో ఊరేగెను చుక్కలపల్లకిలో నడిరేయి....13 Oct 2013


8.11.13

శ్వేత .....ఆ కళ్ళు .....ఆ......కళ్ళు

శ్వేత .....ఆ కళ్ళు .....ఆ......కళ్ళు 

కొంటె చూపుల కన్నులతో కవ్విస్తూ
కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తూ 

అందమైన కళ్ళతో ఆకర్షిస్తూ
అందరి ఆకళ్ళను పెంచుతున్నాయి ... ఆ ...... కళ్ళు  ........ 08 Oct 2013

1.11.13

రాగాలు నేర్పుతున్నవా ?___ పాటలు నేర్పిన కోకిలమ్మకే.

రాగాలు నేర్పుతున్నవా ?___ పాటలు నేర్పిన కోకిలమ్మకే...శ్వేత..30-10-13