శ్రీశ్రీకి అక్షర నివాళి
పదండి ముందుకు పదండి ముందుకు
పోదాం పోదాం పైపైకి
మూఢనమ్మకాల ముసుగు తీయండి
పదవీ వ్యామోహాలొదలండి
ప్రాణాలొడ్డి ఎదురు నిలవండి
ధైర్యసాహసాలున్న భావిపౌరులు మీరేనండి
దేశభవిత ఉంది మీ చేతుల్లో
తెగువ చూపి కదలండి మీ చేతల్లో
నిర్లక్ష్యం నైరాశ్యం వదలండి
జగతికి స్ఫూర్తిగా అడుగు ముందుకేసి
గమ్యాన్ని చేరండి
చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా నిలపండి
(శ్రీ శ్రీ జయంతి సందర్భంగా నేను రాసిన ఈ కవిత తెలుగు వన్ డాట్ కామ్ లో ప్రచురితమైనది)
29.9.13
28.9.13
14.9.13
7.9.13
5.9.13
1.9.13
శ్వేత......... చెల్లి (ఉల్లి) లొల్లి
ఓ నా ముద్దుల చెల్లి
ఆపవే నీ లొల్లి
ఆపకుంటే నే పిలుస్తాను పిల్లి
అమ్మతో చెప్పి తాయిలమిప్పిస్తానే తల్లీ
మిడిసి మిడిసి పడమాకే మళ్ళీ మళ్ళీ
తుళ్ళి తుళ్ళి పడమాకే తుంటరి చెల్లీ
ఇంకా ఆపకుంటే నీ లొల్లి
పిలుస్తానే రక్కసిబల్లి
ఆపేస్తే నీ లొల్లి
ఇప్పిస్తా బస్తాడు ఉల్లి....... 31-08-2013
Subscribe to:
Posts (Atom)