22.4.13

శ్వేత.......నాలాగాఎందరో

శ్వేత.......నాలాగాఎందరో

తినడానికి తిండి లేదు
ఉండటానికిల్లులేదు 

కట్టడానికి బట్ట లేదు
బతకాలన్న ఆశలేదు

కన్నవారు కాలం చేసారు
కట్టుకున్నోడు ఒదిలేసాడు 
కన్నబిడ్డలు రోడ్డుపాల్చేసేసారు 

బిచ్చమెత్తి బతకలేను
కూలిసేయ ఓపికలేదు 

గారవించేవారు లేరు
ఆదరించువారసలు లేరు 
 
నిలువ నీడనిచ్చేవారు కానరారు
బతకలేక భారంగా ఇంకా ఎన్నాళ్లీ బతుకు బండినీడ్చను? 
 
ఈ అవనిలో నేనొక అభాగ్య వనితను.
ఇంకా ఈ(మన)దేశంలో నాలాగా ఎందరో....08 MAR 13...No comments:

Post a Comment