8.11.16

How to make Shampoo at home ..... 5 Lt. షాంపూని ఇంట్లోనే తయారుచేయటం ఎలా ?

How to make Shampoo at home ..... 5 Lt. షాంపూని ఇంట్లోనే తయారుచేయటం ఎలా ?


తయారుచేయడానికి కావలసిన వస్తువులు 
కుంకుడుకాయలు - 100 గ్రా 
శీకాకాయ్ - 100 గ్రా 
మెంతులు - 100 గ్రా 
బెంజోపౌడరు - 10 గ్రా 
scs - 1 లీ. 
కొకోడి - 1/2 కేజీ 
సెంటు - 25 ml (మనకు నచ్చింది వాడుకోవచ్చును
వేపాకు - 4 రెమ్మలు 
తులసి - గుప్పెడు ఆకులు 
గోరింటాకు - గుప్పెడు ఆకులు  
మందారాకులు పెద్దవి ఐతే - 10 ఆకులు చాలు  
(దొరికితే పొన్నగంటి ఆకు, గుంటగలగరాకు) 
ఆకులు ఇష్టమైతే వేసుకోవచ్చును..... దొరకకపోయిన పరవాలేదు. మిగిలిన వాటితో షాంపూ తయారుచేసుకోవచ్చును. 


తయారీవిధానం 
ముందురోజు రాత్రి కుంకుడుకాయలు 1 లీ. నీటిలో నానబెట్టాలి, 
శీకాకాయ గింజలు తీసి 1 లీ. నీటిలో నానబెట్టాలి, 
మెంతులని మెత్తగా పొడి చేసి 1 లీ. నీటిలో నానబెట్టాలి. 
ఆకులని శుభ్రంగా కడిగి 1 లీ. నీటిలో నానబెట్టాలి.  
ఇలా అన్నిటిని వేరువేరుగా నానబెట్టిన వాటిని ఒక్కొక్క స్టీలు గిన్నెలో పోసి 1/2 లీ. అయ్యేవరకు బాగా మరిగించుకోవాలి. అన్నీ చల్లారిన తరవాత ఒక పెద్ద పాత్రలోకి వడగట్టుకోవాలి. ఇప్పుడు కొకోడిని వేడిచేసి ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. scs  ని కూడా మిశ్రమంలో వేసి అన్నీ కలిసేటట్టు  బాగా కలపాలి. ఇప్పుడు అన్నీ కలిసేటట్టు ఒక్కసారి ఈ మొత్తం మిశ్రమాన్ని స్టవ్ పైన పెట్టి పొంగకుండా కలుపుతూ 10 నిముషాలు మరిగించాలి. స్టవ్ పైనుండి దించాక మిశ్రమం పూర్తిగా చల్లారిన తరవాత సెంటు కలుపుకోవాలి. అంతే అతి తక్కువ ఖర్చుతో 5 లీ. Herbal Shampoo మీ ఇంట్లో మీరే తయారుచేసేసారు. :) 

ఈ షాంపూ వాడటం వలన ఎటువంటి సైడు ఎఫెక్ట్స్ ఉండవు, జుట్టు ఎక్కువగా రాలిపోదు. ఖర్చు తక్కువ - నురగ ఎక్కువ. నేను ఈ పద్దతిలో తయారుచేసుకొని వాడుతున్నాను. ఇంకా రకరకాల పద్ధతుల్లో shampooని తయారుచేస్తుంటారు. నాకు తెలిసిన పద్ధతి మాత్రం ఇదే.            
         

2 comments:

  1. చాలా మంచి సమాచారం ఇచ్చారండీ.. _/\_

    ReplyDelete
  2. మీరు సూచించిన విధంగా షాంపు తయారు చేయాలని ప్రయత్నించానండీ... అయితే కొన్ని అర్థం కాలేదు..
    అవి.
    1.మీరు సూచించిన దినుసులలో... కొకొడి అని వ్రాసారు.. అది బహుషా కొకొవా పౌడర్ అయిఉంటుందనుకుంటున్నాను...
    2. ఇక బెంజో పౌడర్.. కొకొవా పౌడర్ ఎక్కడ దొరుకుతుందో చెపితే బావుండు...
    3.ఇక 4 items గురించి ఒక్కొక్కటి ఒక లీ. నీటిలో నాన బెట్టి.. అర లీటరు అయ్యేవరకు.. మరిగించాలన్నారు.. అంటే ఒక్కొక్కటి విడిగానా..
    4. ఇచ్చిన వివరణ ఇంకొంచెం బావుంటే బావుండు.. నేను తయారు చేయాలని ప్రారంభిస్తే ఇన్ని సందేహాలొచ్చాయి.. please correct.. some areas... if needed..

    ReplyDelete