How To Make Phenyle at Home....... ఫినాయిల్ ఇంట్లోనే తయారుచేయటం ఎలా ?
5 లీ. ఫినాయిల్ తయారుచేయుటకు కావలసిన వస్తువులు
కటింగ్ ఆయిల్ - 100 ml
పైనాయిల్ - 100 ml
సోప్ ఆయిల్ - 200 ml
సెట్రినెల్లా సెంట్ - 25 ml
మంచినీరు - 6 లీ.
తయారీవిధానం
ముందుగా ఒక శుభ్రమైన గిన్నెలోకి 6 లీ. మంచినీటిని తీసుకొని స్టవ్ పైన పెట్టి 5 లీ. అయ్యేవరకు బాగా మసిలించాలి. నీరు బాగా మసిలిన తరవాత స్టవ్ పై నుండి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ నీటిలో కటింగ్ ఆయిల్ కలపాలి. తరవాత ఒక మగ్గు తీసుకొని పైనాయిల్, 100 ml సోప్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇంక మిగిలిన 100 ml సోప్ ఆయిల్ & సెట్రినెల్లా సెంట్ మిశ్రమాన్ని బాగా కలిపి....... ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమంలో కలుపుకోవాలి. అంతే అన్నీ బాగా కలుపుకొని శుభ్రమైన bottles లోకి తీసుకొని దాచుకోవాలి.
Baagundi .ee chemicals yekkada dorukuthai
ReplyDelete