How to make surf at Home..... 5 Kgల సర్ఫ్ ని ఇంట్లోనే తయారుచేయటం ఎలా ?
5 Kgల సర్ఫ్ ని తయారుచేయుటకు కావలసిన వస్తువులు
బట్టలషోడా - 2 1/2 kg
స్లరీ - (లిక్విడ్) - 1/2 kg
S.L.S (సోడియం లేజర్ సల్ఫేట్).... (లిక్విడ్) - 200 ml
T.S.P (ట్రాన్సోడియం ఫాస్ఫాట్) - 1/2 kg
S.T.P.P (సోడియం ట్రై ఫాస్ఫాట్) - 1/2 kg
C.M.C (క్రిటికల్ మిథైల్ కాన్సంట్రేషన్ or కార్పో ఆయిల్ మిథైల్ సల్ఫ్యూడ్ ఆయిల్) - 100 గ్రా టినోపల్ - 100 గ్రా
జీ సాల్ట్ - = గోబర్ సాల్ట్ - 1 kg
ఫ్లవర్ సెంట్ - 25 ml (మనకు నచ్చిన సేంట్ వాడుకోవచ్చును)
సర్ఫ్ గ్రాన్యువల్స్ - తగినంత
తయారుచేయు విధానం
గమనిక :--- చేతికి గ్లౌజస్, ముక్కు - మూతికి మాస్క్ ధరించి సర్ఫ్ పౌడర్ని కలుపుకోవాలి.
ముందుగా ప్రతీ పౌడరుని మెత్తగా నూరుకొని, జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి.
ముందుగా ప్రతీ పౌడరుని మెత్తగా నూరుకొని, జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి.
ఒక పొడిగా ఉన్న పెద్ద టబ్బు తీసుకొని అందులో ముందుగా బట్టలషోడా వేసుకోవాలి, ఇప్పుడు స్లరీ వెయ్యాలి. స్లరీ వెయ్యగానే మిశ్రమం వేడిగా అవుతుంది. అందుకే ఆ మిశ్రమాన్ని ఒక కర్ర తీసుకొని బాగా కలియబెట్టాలి. బట్టలషోడాలో అంతా స్లరీ ఉండలు లేకుండా బాగా కలిసేటట్టు చూడాలి, ఇప్పుడు ఆ మిశ్రమంలో sls వేసి బాగా కలపాలి. మిగిలిన సామాను అన్నింటిని ఒకదాని తరవాత ఒకటిగా ఇప్పుడు ఆ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతా కలిపాక సర్ఫ్ గ్రాన్యువల్స్ వేసి కలుపుకోవాలి. సర్ఫ్ వేడి కొంచెం తగ్గాక సేంట్ కలిపి, ఒక 1/2 గంట నీడలోనే అంటే ఇంట్లోనే ఉంచి ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టకూడదు. అంతే ఎటువంటి కల్తీ లేని 5 kgల సర్ఫ్ మనం తయారుచేసుకున్నాం.
ఈ సామాను ఏ chemical షాప్స్ లోనైనా దొరుకుతాయి. బయట కొనుక్కొనే సర్ఫ్ ఖర్చు కంటే చాలా తక్కువ ఖర్చులో మనం తయారుచేసుకోవచ్చును. 4 సంవత్సరాల నుండి నేను ఇంట్లోనే తయారుచేసుకొని Washing mission లో కూడా వేసి వాడుతున్నా.
No comments:
Post a Comment