How To Make Blue at Home ...... 5 లీ. నీలిమందు ఇంట్లో తయారుచేయటం ఎలా ?
నీలిమందు తయారుచేయుటకు కావలసిన వస్తువులు
ఓస్వాల్ బ్లూ or రివెన్ బ్లూ పౌడర్ - 250 గ్రా
గ్లిజరిన్ - 25 ml
టీనోపాల్ (గంధకం) - 25 గ్రా
తయారీవిధానం
6 లీటర్ల మంచి నీటిని తీసుకొని బాగా వడగట్టి, స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి, అంటే ఆ నీరు 5 లీటర్లు అయ్యేవరకు మరిగించాలి. ఆవిధంగా మరిగిస్తే నీలిమందు ఎన్నాళైనా నిల్వ ఉంటుంది. పాడవదు. ఇప్పుడు ఆ నీటిని ఒక బకెట్ లో పోసి, ఓస్వాల్ బ్లూ or రివెన్ బ్లూ పౌడర్ ని వేసి బాగా కరిగిపోయేలా కలపాలి. ఆ మిశ్రమానికి గ్లిజరిన్ & టీనోపాల్ (గంధకం) కూడా వేసి బాగా కలపాలి. అంతే ఇప్పుడు మనకు 5 లీటర్ల నీలిమందు తయారైపోయింది. తగిన bottlesలో పోసి నిల్వ ఉంచుకోవటమే.
No comments:
Post a Comment