8.11.16

How to make Shampoo at home ..... 5 Lt. షాంపూని ఇంట్లోనే తయారుచేయటం ఎలా ?

How to make Shampoo at home ..... 5 Lt. షాంపూని ఇంట్లోనే తయారుచేయటం ఎలా ?


తయారుచేయడానికి కావలసిన వస్తువులు 
కుంకుడుకాయలు - 100 గ్రా 
శీకాకాయ్ - 100 గ్రా 
మెంతులు - 100 గ్రా 
బెంజోపౌడరు - 10 గ్రా 
scs - 1 లీ. 
కొకోడి - 1/2 కేజీ 
సెంటు - 25 ml (మనకు నచ్చింది వాడుకోవచ్చును
వేపాకు - 4 రెమ్మలు 
తులసి - గుప్పెడు ఆకులు 
గోరింటాకు - గుప్పెడు ఆకులు  
మందారాకులు పెద్దవి ఐతే - 10 ఆకులు చాలు  
(దొరికితే పొన్నగంటి ఆకు, గుంటగలగరాకు) 
ఆకులు ఇష్టమైతే వేసుకోవచ్చును..... దొరకకపోయిన పరవాలేదు. మిగిలిన వాటితో షాంపూ తయారుచేసుకోవచ్చును. 


తయారీవిధానం 
ముందురోజు రాత్రి కుంకుడుకాయలు 1 లీ. నీటిలో నానబెట్టాలి, 
శీకాకాయ గింజలు తీసి 1 లీ. నీటిలో నానబెట్టాలి, 
మెంతులని మెత్తగా పొడి చేసి 1 లీ. నీటిలో నానబెట్టాలి. 
ఆకులని శుభ్రంగా కడిగి 1 లీ. నీటిలో నానబెట్టాలి.  
ఇలా అన్నిటిని వేరువేరుగా నానబెట్టిన వాటిని ఒక్కొక్క స్టీలు గిన్నెలో పోసి 1/2 లీ. అయ్యేవరకు బాగా మరిగించుకోవాలి. అన్నీ చల్లారిన తరవాత ఒక పెద్ద పాత్రలోకి వడగట్టుకోవాలి. ఇప్పుడు కొకోడిని వేడిచేసి ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. scs  ని కూడా మిశ్రమంలో వేసి అన్నీ కలిసేటట్టు  బాగా కలపాలి. ఇప్పుడు అన్నీ కలిసేటట్టు ఒక్కసారి ఈ మొత్తం మిశ్రమాన్ని స్టవ్ పైన పెట్టి పొంగకుండా కలుపుతూ 10 నిముషాలు మరిగించాలి. స్టవ్ పైనుండి దించాక మిశ్రమం పూర్తిగా చల్లారిన తరవాత సెంటు కలుపుకోవాలి. అంతే అతి తక్కువ ఖర్చుతో 5 లీ. Herbal Shampoo మీ ఇంట్లో మీరే తయారుచేసేసారు. :) 

ఈ షాంపూ వాడటం వలన ఎటువంటి సైడు ఎఫెక్ట్స్ ఉండవు, జుట్టు ఎక్కువగా రాలిపోదు. ఖర్చు తక్కువ - నురగ ఎక్కువ. నేను ఈ పద్దతిలో తయారుచేసుకొని వాడుతున్నాను. ఇంకా రకరకాల పద్ధతుల్లో shampooని తయారుచేస్తుంటారు. నాకు తెలిసిన పద్ధతి మాత్రం ఇదే.            
         

Home made Zhandubalm at home ........ 1/2 kg జండూబామ్ ఇంట్లోనే తయారుచేతం ఎలా ?

Home made Zhandubalm at home ........ 1/2 kg జండూబామ్ ఇంట్లోనే తయారుచేతం ఎలా ?

జండూబామ్ తయారుచేయుటకు కావలసిన వస్తువులు 
పెట్రోలియం జెల్లీ - 500 గ్రా 
wax (మైనం) - 50 గ్రా 
యూకలిఫ్టస్ ఆయిల్ - 100 ml 
ms ఆయిల్ - 100 ml 
పిప్పర్మెంట్ ఆయిల్ - 50 ml 

తయారీవిధానం 
స్టవ్ వెలిగించి ఒక స్టీలుగిన్నెను పెట్టి అందులో పెట్రోలియం జెల్లీ వేసి కొంచెం కరిగాక మైనం వేసి మరిగించాలి. రెండూ బాగా కలిసి కరిగాక స్టవ్ మీద నుండి కిందకి దించి, కొద్దిగా చల్లారిన తరవాత మూడు రకాల ఆయిల్స్  ని వేసి కలుపుతూ ఉంటే మిశ్రమం గడ్డకడుతుంది. వెంటనే మనకి కావలసిన bottels(డబ్బాల) లో వేసుకోవాలి. అంతే జండూబామ్ తయారైపోయింది. 

           

How to make Sabina Powder at home ..... 5 Kg సబీనా పౌడర్ని ఇంట్లోనే తయారుచేయటం ఎలా ?

How to make Sabina Powder at home .....  5 Kg సబీనా పౌడర్ని ఇంట్లోనే తయారుచేయటం ఎలా ?


సబీనా పౌడర్ని తయారుచేయుటకు కావలసిన వస్తువులు 
డోలోమోట్ పౌడర్ - 5 kg 
సోడా యాష్ - 1/2 kg 
స్లరీ - 200 gms
tsp (ట్రాన్సోడియం ఫాస్ఫేట్) - 1/4 kg  or  200 గ్రా 
లెమన్ సాల్ట్ - 10 ml   

తయారుచేయు విధానం 
గమనిక :--- చేతికి గ్లౌజస్, ముక్కు - మూతికి మాస్క్ ధరించి సబీనా పౌడర్ని కలుపుకోవాలి.
ఒక  పొడిగా ఉన్న పెద్ద టబ్బు తీసుకొని అందులో డోలోమోట్ పౌడర్ ని + సోడా యాష్ ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో స్లరీ వేసి కర్రతో బాగా కలుపుకోవాలి. స్లరీ వెయ్యగానే మిశ్రమం వేడిగా అవుతుంది. ఈ మిశ్రమం వేడి తగ్గాక (చల్లారిన తరవాత) tsp & లెమన్ సాల్ట్ వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అంతే మనం పాత్రలు (గిన్నెలు) తోముకునే సబీనా పౌడర్ తయారు ఐపోయింది. 

   
   

How To Make Blue at Home ...... 5 లీ. నీలిమందు ఇంట్లో తయారుచేయటం ఎలా ?

How To Make Blue at Home ...... 5 లీ. నీలిమందు ఇంట్లో తయారుచేయటం ఎలా ?


నీలిమందు తయారుచేయుటకు కావలసిన వస్తువులు 
ఓస్వాల్ బ్లూ or  రివెన్ బ్లూ పౌడర్  - 250 గ్రా 
గ్లిజరిన్ - 25 ml 
టీనోపాల్ (గంధకం) - 25 గ్రా

తయారీవిధానం 
6 లీటర్ల మంచి నీటిని తీసుకొని బాగా వడగట్టి, స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి, అంటే ఆ నీరు 5 లీటర్లు అయ్యేవరకు మరిగించాలి. ఆవిధంగా మరిగిస్తే నీలిమందు ఎన్నాళైనా నిల్వ ఉంటుంది. పాడవదు. ఇప్పుడు ఆ నీటిని ఒక బకెట్ లో పోసి, ఓస్వాల్ బ్లూ or  రివెన్ బ్లూ పౌడర్ ని వేసి బాగా కరిగిపోయేలా కలపాలి. ఆ మిశ్రమానికి గ్లిజరిన్ & టీనోపాల్ (గంధకం) కూడా వేసి బాగా కలపాలి. అంతే ఇప్పుడు మనకు 5 లీటర్ల నీలిమందు తయారైపోయింది.  తగిన bottlesలో పోసి నిల్వ ఉంచుకోవటమే.  


           

How To Make Vaseline at Home ..... వేజలైన్ని ఇంట్లోనే తయారుచేయటం ఎలా ?

How To Make  Vaseline at Home..... వేజలైన్ని ఇంట్లోనే తయారుచేయటం ఎలా ?


వేజలైన్ని తయారుచేయుటకు కావలసిన వస్తువులు 
పెట్రోలియం జెల్లీ - 500 గ్రా 
wax (మైనం) - 50 గ్రా 
ఫ్లోరోసెంట్ - 25 ml (మనకు నచ్చిన సెంట్ తీసుకోవచ్చును)  

తయారుచేసేవిధానం 
ఒక స్టీలు పాత్రలో పెట్రోలియం జెల్లీని + మైనాన్ని కలిపి వేసి స్టవ్ పైన పెట్టి కరిగించాలి. రెండూ బాగా కరిగి కలిసాకా స్టవ్ పైనుండి దించి, కొంచెంగా చల్లారిన తరవాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు, గట్టిపడక ముందు ఆ మిశ్రమంలో ఫ్లోరోసెంట్ వేసి కలిపి, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీకు కావలసిన డబ్బాలలో పోసి పక్కన ఉంచుకోవాలి. (చల్లారిన తరవాత వెయ్యలేరు కదా!) అంతే చలికాలంలో మనకు శరీరం పొడిబారకుండా, పెదవులు పగిలిపోకుండా, కాలి పగుళ్ళు లేకుండా అన్ని రకాలుగా పనికివస్తుంది. శరీరం మృదువుగా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. నేను తయారుచేసుకున్నా, వాడుతున్నాను. 


        

How To Make Room Spray at Home.....రూమ్ స్ప్రే ఇంట్లో తయారుచేయటం ఎలా ?

How To Make Room Spray  at Home..... రూమ్ స్ప్రే ఇంట్లో తయారుచేయటం ఎలా ?


5 లీ. స్ప్రే చేయుటకు కావలసిన వస్తువులు
కటింగ్ ఆయిల్ - 100 ml 
జాస్మిన్ సెంట్ - 10 ml (any ఫ్లేవర్)
సోప్ ఆయిల్ - 500 ml 
కలర్ (color) - Rs5
మంచినీరు - 5 లీ 

తయారీవిధానం 
ముందుగా మంచినీటిని ఒక శుభ్రమైన బకెట్ లోకి తీసుకొని అందులో కటింగ్ ఆయిల్ కలపాలి. తరవాత ఒక మగ్గులో సోప్ ఆయిల్, సెంట్ & కలరు తీసుకొని అన్నీ బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కటింగ్ ఆయిల్ కలిపిన నీటిలో పోసి బాగా కలుపుకోవాలి. అంతే ఇప్పుడు మనకు కావలసిన రూమ్ స్ప్రే  తయారైపోయింది.    

    

How To Make Phenyle at Home ....... ఫినాయిల్ ఇంట్లోనే తయారుచేయటం ఎలా ?

How To Make Phenyle at Home....... ఫినాయిల్ ఇంట్లోనే తయారుచేయటం ఎలా ?


5 లీ. ఫినాయిల్ తయారుచేయుటకు కావలసిన వస్తువులు 
కటింగ్ ఆయిల్ - 100 ml 
పైనాయిల్ - 100 ml 
సోప్ ఆయిల్ - 200 ml 
సెట్రినెల్లా సెంట్ - 25 ml 
మంచినీరు - 6 లీ.  

తయారీవిధానం 
ముందుగా ఒక శుభ్రమైన గిన్నెలోకి 6 లీ. మంచినీటిని తీసుకొని స్టవ్ పైన పెట్టి 5 లీ. అయ్యేవరకు బాగా మసిలించాలి. నీరు బాగా మసిలిన తరవాత స్టవ్ పై నుండి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ నీటిలో కటింగ్ ఆయిల్ కలపాలి. తరవాత ఒక మగ్గు తీసుకొని పైనాయిల్, 100 ml సోప్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇంక మిగిలిన 100 ml సోప్ ఆయిల్ & సెట్రినెల్లా సెంట్ మిశ్రమాన్ని బాగా కలిపి....... ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమంలో కలుపుకోవాలి. అంతే  అన్నీ బాగా కలుపుకొని శుభ్రమైన bottles లోకి తీసుకొని దాచుకోవాలి.  

           

How to make surf at Home. ..... 5 Kgల సర్ఫ్ ని ఇంట్లోనే తయారుచేయటం ఎలా ?

How to make surf at Home.....  5 Kgల సర్ఫ్ ని ఇంట్లోనే తయారుచేయటం ఎలా ?



5 Kgల సర్ఫ్ ని తయారుచేయుటకు కావలసిన వస్తువులు 
బట్టలషోడా - 2 1/2 kg 
స్లరీ - (లిక్విడ్) - 1/2 kg 
S.L.S (సోడియం లేజర్ సల్ఫేట్).... (లిక్విడ్) - 200 ml 
T.S.P (ట్రాన్సోడియం ఫాస్ఫాట్) - 1/2 kg 
S.T.P.P (సోడియం ట్రై ఫాస్ఫాట్) - 1/2 kg 
C.M.C (క్రిటికల్ మిథైల్ కాన్సంట్రేషన్ or కార్పో ఆయిల్ మిథైల్ సల్ఫ్యూడ్ ఆయిల్) - 100 గ్రా  టినోపల్ - 100 గ్రా 
జీ సాల్ట్ - =  గోబర్ సాల్ట్ - 1 kg 
ఫ్లవర్ సెంట్ - 25 ml (మనకు నచ్చిన సేంట్ వాడుకోవచ్చును) 
సర్ఫ్ గ్రాన్యువల్స్ - తగినంత 

తయారుచేయు విధానం 
గమనిక :--- చేతికి గ్లౌజస్, ముక్కు - మూతికి మాస్క్ ధరించి సర్ఫ్ పౌడర్ని కలుపుకోవాలి.
ముందుగా ప్రతీ పౌడరుని మెత్తగా నూరుకొని, జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి.

ఒక  పొడిగా ఉన్న పెద్ద టబ్బు తీసుకొని అందులో ముందుగా బట్టలషోడా వేసుకోవాలి, ఇప్పుడు స్లరీ వెయ్యాలి. స్లరీ వెయ్యగానే మిశ్రమం వేడిగా అవుతుంది. అందుకే ఆ మిశ్రమాన్ని ఒక కర్ర తీసుకొని బాగా కలియబెట్టాలి. బట్టలషోడాలో అంతా స్లరీ ఉండలు లేకుండా బాగా కలిసేటట్టు చూడాలి, ఇప్పుడు ఆ మిశ్రమంలో sls వేసి బాగా కలపాలి. మిగిలిన సామాను అన్నింటిని ఒకదాని తరవాత ఒకటిగా ఇప్పుడు ఆ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతా కలిపాక సర్ఫ్ గ్రాన్యువల్స్ వేసి కలుపుకోవాలి. సర్ఫ్ వేడి కొంచెం తగ్గాక సేంట్ కలిపి, ఒక 1/2 గంట నీడలోనే అంటే ఇంట్లోనే ఉంచి ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టకూడదు. అంతే ఎటువంటి కల్తీ లేని 5 kgల సర్ఫ్ మనం తయారుచేసుకున్నాం.  

ఈ సామాను ఏ chemical షాప్స్ లోనైనా దొరుకుతాయి. బయట కొనుక్కొనే సర్ఫ్ ఖర్చు కంటే చాలా తక్కువ ఖర్చులో మనం తయారుచేసుకోవచ్చును. 4 సంవత్సరాల నుండి నేను ఇంట్లోనే తయారుచేసుకొని Washing mission లో కూడా వేసి వాడుతున్నా.             
    

పరిమళాలు వెదజల్లుతూ పరిభ్రమిస్తున్న భావకుసుమాలు - కవితావనంలో ...... శ్వేత

పరిమళాలు వెదజల్లుతూ పరిభ్రమిస్తున్న భావకుసుమాలు - కవితావనంలో ...... శ్వేత 08 Nov 2016





4.11.16

సందేహాలు, సంసయాలతో సమాధానాలు దొరకవు - కొన్ని సమస్యలకి

సందేహాలు, సంసయాలతో సమాధానాలు దొరకవు - కొన్ని సమస్యలకి ..... శ్వేత 4 Nov 2016