28.8.17
ఋతువులతో గలాటాలెందుకు ... శ్వేత
ఋతువులతో గలాటాలెందుకు ... శ్వేత
వసంతఋతువుతో వయ్యారాలెందుకు
గ్రీష్మఋతువుతో గిల్లికజ్జాలెందుకు
వర్షఋతువుతో వాదులాటెందుకు
శరదృతువుతో సరసాలెందుకు
హేమంతఋతువుతో హాస్యమెందుకు
శిశిరఋతువుతో సమరమెందుకు
ఋతువులతో గలాటాలెందుకు మనకు ..... 28 Aug 2017
మందారంలా ముడుచుకుని, సిరిమల్లల్లే సిగ్గుపడింది - సొట్టబుగ్గల సుందరి
మందారంలా ముడుచుకుని, సిరిమల్లల్లే సిగ్గుపడింది - సొట్టబుగ్గల సుందరి ...
శ్వేత 28 Aug 2017
చెలికాని నవ్వులకే గువ్వల్లే ఒదిగిపోయింది - పసిడివంటి పడుచుప్రాయం
చెలికాని నవ్వులకే గువ్వల్లే ఒదిగిపోయింది - పసిడివంటి పడుచుప్రాయం ... శ్వేత 28 Aug 2017
నిను తలచిన ప్రతిక్షణం .... శ్వేత
నిను తలచిన ప్రతిక్షణం .... శ్వేత
బ్రతుకంటే చేదన్నది
బంధుత్వమే రోతన్నది
అనురాగమే లేదన్నది
ఆప్యాయత కావాలన్నది
స్నేహమంటే బరువన్నది
సాహసాలు వద్దన్నది
అరుదెంచిన అవకాశాలు వద్దన్నది
ఆకశాన ఊయలలూగుతానన్నది
నిను తలచిన ప్రతిక్షణం
విలపించును నా మది .... 28 Aug 2017
కవితల పూదోట .... శ్వేత
కవితల పూదోట .... శ్వేత
అలసత్వమెరుగని నా అక్షరాలని
పటుత్వమున్న మంచి పదాలని
మృదుత్వమున్న (మృదువైన) మాటలతో
సరళత్వమున్న సంభాషణలతో
అస్తిత్వం కోల్పోతున్న అక్షరాలని
కమ్మని కవితల పూదోటలో విహరింపచేస్తున్నా ..... 28 Aug 2017
కమ్మని కవితల పూదోటలో విహరిస్తున్నాయి - అలుపెరుగని అక్షరాలు
కమ్మని కవితల పూదోటలో విహరిస్తున్నాయి - అలుపెరుగని అక్షరాలు ...శ్వేత 28 Aug 2017
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)