14.5.13

శ్వేత......అమ్మ అంటే అమ్మే

శ్వేత......అమ్మ అంటే అమ్మే

ఇంతగొప్ప జన్మనిచ్చావు
మధురమైన బాల్యాన్ని ఇచ్చావు
నీ రక్తాన్ని పాలుగా మార్చి నాకు శక్తినిచ్చావు

ఆకలిని తీర్చి అన్నపూర్ణవైనావు
గోముగా నాకు గోరుముద్దలు తినిపించావు

నీ చేయి అందించి నాకు నడకలు నేర్పావు
సొగసైన రూపమిచ్చావు

అందమైన వ్యక్తిత్వమిచ్చావు
చిరునవ్వును పంచే ఆనందమిచ్చావు

నేనంటే ఏమిటో చెప్పే గొప్ప అవకాశమిచ్చావు
ఆత్మవిశ్వాసం నాలో నింపినందుకు

నా బాధలలో నీ ఓదార్పునందించినందుకు
అలసిపోయినప్పుడు నీ ఒడిలో లాలించినందుకు

ఇప్పటికీ కూడా నన్ను కంటికిరెప్పలా కాపాడుతున్నందుకు
మెండైన చిరునవ్వుని నిండుగా ప్రసాదించి

నా వెన్నంటే ఉంటూ విజయాలని అందిస్తున్నందుకు
నిన్ను గూర్చి ఎన్నెన్ని చెప్పినా తక్కువే
నే వర్ణించజాలను, నీ ప్రేమని నే మరువజాలను...11-05-2013

(Mother'sday సందర్భంగా...... నాకు జన్మనిచ్చిన నా కన్నతల్లికి(అమ్మకి) నా ఈ కవిత అంకితం)




No comments:

Post a Comment