7.6.13

శ్వేత.....ఏమి కావలేనే ఓ లచ్చి

శ్వేత.....ఏమి కావలేనే ఓ లచ్చి

సైకిలు కావలెనా, ఓ లచ్చీ! మోటరు కారు కావలెనా?
సైకిలొద్దు మోటరు కారు లొద్దు
నీ గుండెల్లో చోటుంది చాలు......నాకదే పది వేలుర ఓ మావా!

రేడియో తెమ్మందువా, ఓ లచ్చీ ! టివీ తెమ్మందువా?
రెడియోద్దు, టివీలోద్దు
నీ మాటలే చాలు....నీ పాటలె మేలు ఓ మావా!

సినిమాకి పోదామా ఓ లచ్చీ ! సర్కసుకి పోదామా?
సినిమాలొద్దు, సర్కస్సులొద్దు
ఆటలు చాలుర మావా... నీ సయ్యాటలే చాలురా ఓ మావా!

మల్లెలు తెమ్మందువా ఓ లచ్చీ ! జాజులు తెమ్మందువా?
మల్లెలు వద్దు, జాజులు వద్దు
సల్లని నీ పిలుపే చాలు.....మల్లంటి నీ మనసే చాలు ఓ మావా!

ముక్కెర కొనమందువా ఓ లచ్చీ ! కమ్మలు కొనమందువా?
ముక్కెరొద్దు, కమ్మలొద్దు
నా ఎదురుంగా నువ్వుంటే చాలు ఓ మావా! అదే నాకు లక్షల విలువలే ఓ మావా! 05-06-2013



No comments:

Post a Comment