7.2.14

Raghava Kumar.....Upanayanam (My Elder Son's Upanayanam .... Part -2)

మా పెద్దబ్బాయి ఉపనయనం వీడియో Part -2

శ్వేత ...... పెళ్ళికళ వచ్చేసిందేబాలా !

శ్వేత ...... పెళ్ళికళ వచ్చేసిందేబాలా !

పట్టుచీరల గరగరలతో
పసిపిల్లల కిలకిలలతో

పడుచుపిల్లల అందాలతో
కుర్రకారు కేరింతలతో

బావ - మరదళ్ళల సరసాలతో
కొత్తల్లుడి అలుకలతో
బావమరిది బుజ్జగింపులతో

మర్యాదల లోపమని వియ్యపురాలి మూతివిరుపులతో
హడావుడిగా పరుగులిడుతు ఆయాసపడు తల్లిదండ్రులతో

ఎన్నాళ్ళకో కలుసుకున్న బంధుమిత్రుల ఆప్యాయతల పలకరింపులతో
పెళ్ళిమంటపానికి  పెళ్ళికళ వచ్చేసిందేబాలా ! ........ 7-2-2014


శ్వేత ..... మాఘమాసమొచ్చింది

శ్వేత ..... మాఘమాసమొచ్చింది

మాఘమాసమొచ్చింది
పెళ్ళిబాజా మ్రోగింది

కన్నెమది కదిలింది
కలవరపడింది

జత ఏదని వెతికింది
తోడున్నా నీకంటూ చేయి ఒకటి చాచింది

సరి నీవని అనుకుంది
తోడుగ రమ్మంది
వారి కలలు తీరాయి

మాఘమాసమొచ్చింది
పెళ్ళిబాజా మ్రోగింది  ...... 7-2-2014


Raghava Kumar.....Upanayanam (My Elder Son's Upanayanam .... Part -1)

మా పెద్దబ్బాయి ఉపనయనం వీడియో Part -1

Pichukalu...... మా పెరటిలోకి వచ్చి పలకరించిన పిచుకలు

మా పెరటిలోకి వచ్చి పలకరించిన పిచుకలు

1.2.14

శ్వేత .... వీడదేల నీపై మోహావేశం

శ్వేత .... వీడదేల నీపై మోహావేశం

వీడదేల నీపై మోహావేశం
చూపవేల నాపై - నీ కరుణాకటాక్షం


శ్వేత ..... రావయ్యా వేణుగోపాలా !

శ్వేత ..... రావయ్యా వేణుగోపాలా !


మమత నీపై కురిపింతును

మనసు నీ నామం జపియించెను

తనువు నీకై తపియించెను

ఈరాధ నీకై ఏతెంచెను

వేవేగ రావయ్య వేణుగోపాలా !