11.7.15

మౌనశిలనై మిగిలున్నా - మాటలొచ్చిన మూగ గుండె పలకలేక

మౌనశిలనై మిగిలున్నా - మాటలొచ్చిన మూగ గుండె పలకలేక .... శ్వేత 11 July 2015


గురుతులకెప్పుడు ఉండవు - ఎవ్వరి షరతులు

గురుతులకెప్పుడు ఉండవు - ఎవ్వరి షరతులు .... శ్వేత 11 July 2015


శబ్దం చెయ్యక - స్తబ్ధుగా నిలిచింది నిను వీడిన నా దేహం

శబ్దం చెయ్యక - స్తబ్ధుగా నిలిచింది నిను వీడిన నా దేహం .... శ్వేత 11 July 2015


జ్వలించిన ఎదరాగాలు - పారెను కవితా ధారలై ....శ్వేత 11 July 2015

జ్వలించిన ఎదరాగాలే - పారెను కవితా ధారలై ....శ్వేత 11 July 2015


బరువైన కనురెప్పలు మూతపడనంటున్నాయి - నీవు కంటపడేవరకు

బరువైన కనురెప్పలు మూతపడనంటున్నాయి - నీవు కంటపడేవరకు ....శ్వేత 11 July 2015


తెరచి ఉంటాయి ఎద తలుపులు - వేచి ఉంటాయి నా కన్నులు ...నిత్యం నీకోసమే

తెరచి ఉంటాయి ఎద తలుపులు - వేచి ఉంటాయి నా కన్నులు ...నిత్యం నీకోసమే .... శ్వేత 11 July 2015


బంధమై చేరనా - అందమైన నీ మనసులో

బంధమై చేరనా - అందమైన నీ మనసులో ... శ్వేత 11 July 2015


తియ్యని బాధవు నీవు - ఎదలోతుల్లో - మాయని మమతవు నీవు మధురోహల్లో

తియ్యని బాధవు నీవు, ఎదలోతుల్లో - మాయని మమతవు నీవు, మధురోహల్లో..శ్వేత 11 July 2015


6.7.15

కసిరి పొమ్మన్నాడు - కోరమీసమున్న కుర్రోడికి కన్ను గీటితే

కసిరి పొమ్మన్నాడు - కోరమీసమున్న కుర్రోడికి కన్ను గీటితే ....శ్వేత 06 July 2015


నాకు నేనే రాజు, మంత్రి - నామాట నీవు వినేంతవరకు :P

నాకు నేనే రాజు, మంత్రి -  నామాట నీవు వినేంతవరకు :P ....శ్వేత 06 July 2015


సగం జీవితం వ్యర్థమయ్యాక తెలుస్తుంది - అమ్మానాన్నల మాటలకి అర్థాలు

సగం జీవితం వ్యర్థమయ్యాక తెలుస్తుంది - అమ్మానాన్నల మాటలకి అర్థాలు ....శ్వేత 06 July 2015


అందంగా ఉంటాయి - ఆకు చాటు పిందెలు, కొంగుచాటు అందాలు

అందంగా ఉంటాయి - ఆకు చాటు పిందెలు, కొంగుచాటు అందాలు  ....శ్వేత 06 July 2015


వ్యాకరణం తెలియదు నాకు - కానీ ప్రాసంటే ప్రాణం నాకు

వ్యాకరణం తెలియదు నాకు - కానీ ప్రాసంటే ప్రాణం నాకు ....శ్వేత 06 July 2015



అర్థాన్ని వ్యర్థం చేస్తున్నారు - అర్థం కోసమే జీవిస్తూ, సంపాదిస్తూ

అర్థాన్ని వ్యర్థం చేస్తున్నారు - అర్థం కోసమే జీవిస్తూ, సంపాదిస్తూ ....శ్వేత 06 July 2015


అర్థాంతరంగా ముగిసిన(ముగుస్తున్న) జీవితాలెన్నో - అర్థం తెలియకుండానే

అర్థాంతరంగా ముగిసిన(ముగుస్తున్న) జీవితాలెన్నో - అర్థం తెలియకుండానే ....శ్వేత 06 July 2015


సద్దుమణిగిన జీవితాలెన్నో - పొద్దువాలక ముందే

సద్దుమణిగిన జీవితాలెన్నో - పొద్దువాలక ముందే  ....శ్వేత 06 July 2015


జపిస్తున్నా నీ నామాన్నే అక్షర లక్షలుగా - గుండెల్లో ధ్యానిస్తూ

జపిస్తున్నా నీ నామాన్నే అక్షర లక్షలుగా - గుండెల్లో ధ్యానిస్తూ ....శ్వేత 06 July 2015


ఎన్ని కుస్తీలు పడుతున్నానో - బస్తీ పిల్లను బుట్టలో వెయ్యడానికి

 ఎన్ని కుస్తీలు పడుతున్నానో - బస్తీ పిల్లను బుట్టలో వెయ్యడానికి  ....శ్వేత 06 July 2015


ఎన్ని కుస్తీలు పడుతున్నానో - చెలి మదిలో భర్తీ అవ్వడానికి

ఎన్ని కుస్తీలు పడుతున్నానో - చెలి మదిలో భర్తీ అవ్వడానికి ....శ్వేత 06 July 2015


మనసులో ఆవిరులు పుట్టిస్తున్నాయి - ఆమె ఆ విరులే

మనసులో ఆవిరులు పుట్టిస్తున్నాయి - ఆమె ఆ విరులే  ....శ్వేత 06 July 2015
( Photo By Jaanu Bhayya)



సెలెక్ట్ చేసుకున్నా నిన్నే - ఏ డిఫెక్టు లేని పెర్ఫెక్ట్ జోడీ నాకు నీవేనని

సెలెక్ట్ చేసుకున్నా నిన్నే - ఏ డిఫెక్టు లేని పెర్ఫెక్ట్ జోడీ నాకు నీవేనని ....శ్వేత 06 July 2015


కలవరింతలెక్కువాయె - మదిలో పులకరింతలు మొదలయ్యాక

కలవరింతలెక్కువాయె - మదిలో పులకరింత మొదలైనవేళ  ..... శ్వేత 06 July 2015