14.5.13

శ్వేత......అమ్మ అంటే అమ్మే

శ్వేత......అమ్మ అంటే అమ్మే

ఇంతగొప్ప జన్మనిచ్చావు
మధురమైన బాల్యాన్ని ఇచ్చావు
నీ రక్తాన్ని పాలుగా మార్చి నాకు శక్తినిచ్చావు

ఆకలిని తీర్చి అన్నపూర్ణవైనావు
గోముగా నాకు గోరుముద్దలు తినిపించావు

నీ చేయి అందించి నాకు నడకలు నేర్పావు
సొగసైన రూపమిచ్చావు

అందమైన వ్యక్తిత్వమిచ్చావు
చిరునవ్వును పంచే ఆనందమిచ్చావు

నేనంటే ఏమిటో చెప్పే గొప్ప అవకాశమిచ్చావు
ఆత్మవిశ్వాసం నాలో నింపినందుకు

నా బాధలలో నీ ఓదార్పునందించినందుకు
అలసిపోయినప్పుడు నీ ఒడిలో లాలించినందుకు

ఇప్పటికీ కూడా నన్ను కంటికిరెప్పలా కాపాడుతున్నందుకు
మెండైన చిరునవ్వుని నిండుగా ప్రసాదించి

నా వెన్నంటే ఉంటూ విజయాలని అందిస్తున్నందుకు
నిన్ను గూర్చి ఎన్నెన్ని చెప్పినా తక్కువే
నే వర్ణించజాలను, నీ ప్రేమని నే మరువజాలను...11-05-2013

(Mother'sday సందర్భంగా...... నాకు జన్మనిచ్చిన నా కన్నతల్లికి(అమ్మకి) నా ఈ కవిత అంకితం)




నా మది చితి చల్లారేదెప్పుడు

నా మది చితి చల్లారేదెప్పుడు

నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే మనిద్దరిని
విధి వెక్కిరించి విడదీసింది

నూరేళ్ళు నాతో ఉంటానని చెప్పి
నేడు చెప్పకనే నన్నొదిలిపోయావు

మనిషికి మనిషే శతృవు అంటారు
కానీ భగవంతుడే మనకు బద్ద శతృవు

ఇష్టంలేని వారిని కలుపుతాడు
ఇష్టమైన వారిని విడదీస్తాడు

జంటగ జీవించిన నేను
ఒంటిగ ఉండలేను

నా మది చితి చల్లారేదెప్పుడు
నేను నిను దరి చేరేదెపుడు ...... శ్వేత 14 May 2013


2.5.13

శ్వేత...... మావ ముచ్చట్లు

శ్వేత...... మావ ముచ్చట్లు

ఏమి చెప్పుదునే మా నరిసిమావ ముచ్చట్లు
పొలమొచ్చి నే పనిచేయబోతుంటే
పొలమొద్దు పనిఒద్దు
పనిజేస్తే నీ ఒళ్ళు పాడవుద్ది అంటాడే

వంట చేయ నేను వంటింటికి పోబోతే
వంటొద్దు గంటొద్దు
వడలిపోతవు నీవు నే చేస్తానంటడే

చెరువుకాడకు పోయి నీళ్ళు నే తేబోతే
కడవెత్తుకున్న నీ నడుము కందిపోతాదంటడే

సేదదీర నేను సావిట్లో కూర్సుంటే
ఊరిపోరగాండ్లు వత్తురే నిను చూడ
సక్కంగ ఇంటిలో కూకుండమంటడే

నా నరసయ్యమావ ప్రేమ నే భరియించకుంటినే
ఒక్క పని యైనను నను ముట్టనీకుంటడే....02-05-2013


1.5.13

శ్వేత...... నేనొక స్నేహ పిపాసిని

శ్వేత...... నేనొక స్నేహ పిపాసిని

నిన్ను ప్రేమించిన సున్నితమైన
మనసుని నొప్పిస్తే
అది తప్పుకాక ఒప్పనుకుంటున్నావా?

నీ ప్రేమను కోరిన మనసుని
బాధ పెట్టుట భావ్యమా?
ప్రేమ విలువ ఇంతేనా?

నాకు ప్రేమించడమే తెలుసు...
నొప్పించటం తెలియదునాకు
ప్రేమంటే నే ప్రాణమిస్తా

నీ ప్రేమకి నే వెలకట్టలేని విలువనిస్తా
నేనొక ప్రేమపిపాసిని.
నువ్వు నొప్పించిన నీ 'ప్రేమ'ని...16 FEB 13..